వివిధ అవసరాల కోసం ఉద్యోగస్తులు రుణాలు తీసుకోవడం సహజం. చాలామంది PPF (పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్)పై లోన్ తీసుకుంటారు. అత్యవసరమైతే తప్ప పీపీఎఫ్‌పై రుణం తీసుకోకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకు ముఖ్యంగా మూడు కారణాలు చెబుతున్నారు.

వడ్డీ రేటు 1 శాతం తగ్గింది కానీ..
గత ఏడాది డిసెంబర్ నెలలో ప్రావిడెంట్ ఫండ్ నిబంధనలలో కొన్ని మార్పులు చేసింది ప్రభుత్వం. అలాంటి మార్పుల్లో ఒకటి PPF ఖాతాలకపై తీసుకున్న రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటు మార్పు. పీపీఎఫ్‌పై తీసుకునే రుణంపై వడ్డీ రేటు డిసెంబర్ 12, 2019 నుండి మారింది. రుణాలపై వడ్డీ 2 శాతం నుండి 1 శాతానికి తగ్గించింది.

వడ్డీ ఇలా భారం..
1 శాతం రుణం చూసేందుకు ఆకర్షణీయంగానే కనిపిస్తోంది. వడ్డీ రేటు తక్కువగా ఉన్నప్పటికీ తొలి ప్రియారిటీగా పీపీఎఫ్ లోన్‌కు వెళ్లకూడదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం పీపీఎఫ్ ఖాతాపై వడ్డీ రేటు 7.9 శాతంగా ఉంది. రుణం తీసుకుంటే ఇది రాకుండా పోతుంది. అప్పుడు వడ్డీ రేటు 1 శాతం కలుపుకొని మొత్తం 8.9 శాతానికి చేరుకుంటుంది.

వడ్డీ రాదు.. పన్ను ప్రయోజనం కోల్పోతారు
మీరు పీపీఎఫ్ ఖాతాపై రుణం తీసుకుంటే... మీరు తీసుకున్న మొత్తం చెల్లించే వరకు పీపీఎఫ్ బ్యాలెన్స్‌పై వడ్డీని కోల్పోతారు. పన్ను మినహాయింపు ప్రయోజనం కోల్పోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఇలా రుణాలు తీసుకుంటే పన్ను ప్రయోజనాలు కోల్పోవడం ఉంటుంది.

25 శాతం లోన్
రుణం తీసుకున్నందున కాంపౌండింగ్ బెనిఫిట్ మిస్ అవుతారు. వడ్డీ మీ ఖాతాలో జమ అవుతుంది. దీర్ఘకాలంలో కాంపౌండింగ్ బెనిఫిట్ లభిస్తుంది. రుణం తీసుకుంటే దానిని కోల్పోతారు. PPF ఖాతా తెరిచిన మూడో ఏడాది, ఆరో ఏడాది మధ్య రుణం లభిస్తుంది. పీపీఎఫ్ పైన 25 శాతం లోన్ మాత్రమే లభిస్తుంది.

రుణం తక్కువ..
ఉదాహరణకు మీరు 2015-16లో పీపీఎఫ్ ఖాతాను తెరిచి, ప్రతి ఏడాది రూ.1.5 లక్షలు డిపాజిట్ చేస్తుంటారు. 2019-20 ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి మీ పీపీఎఫ్ అకౌంటులో రూ.9.5 లక్షలు ఉంటుంది. మీరు రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే మీకు రూ.1.35 లక్షల రుణం (25 శాతం, అంటే 2017-18 నాటికి మొత్తం రూ.5.25 శాతంలో 25 శాతం) వస్తుంది. ఇది చాలా తక్కువ. షార్ట్ టర్మ్ లోన్ కోసం ఇతర మార్గాల్లో వెళ్తే బెట్టర్ అని అంటున్నారు.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications