ధనతెరాస్ టు ధనతెరాస్: రూ.3,000కు పైగా తగ్గిన బంగారం ధరలు
బంగారం ధరలు ఈ వారం తగ్గుతున్నాయి. గతవారం వరకు పెరిగిన గోల్డ్ ఫ్యూచర్స్ ఈ వారం మాత్రం రోజురోజుకు స్వల్పంగా క్షీణిస్తున్నాయి. ఈ వారం ప్రారంభంలో రూ.48,000కు సమీపంలో ఉన్న గోల్డ్ ఫ్యూచర్స్, ఇప్పుడు రూ.47,000కు దిగువన ఉన్నాయి. డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు (బుధవారం, నవంబర్ 3) ప్రారంభ సెషన్‌లో రూ.137.00 (-0.29%) తగ్గి రూ.47485.00 వద్ద, ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.129.00 (-0.27%) తగ్గి రూ.47621.00 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 7.50 (-0.42%) డాలర్లు క్షీణించి 1,781.90 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గోల్డ్ ఫ్యూచర్స్ నేటి సెషన్‌లో 1,779.95 - 1,789.25 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. 52 వారాల కనిష్టం1677.90 డాలర్ల నుండి 1978.40 డాలర్ల మధ్య కదలాడింది. క్రితం సెషన్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 1,789.40 డాలర్ల మధ్య ముగిసింది. ఏడాదిలో గోల్డ్ ఫ్యూచర్స్ దాదాపు ఏడు శాతం క్షీణించింది.

వెండి ధరలు ఇలా
వెండి ధరలు కూడా తగ్గాయి. సిల్వర్ ఫ్యూచర్స్ ఏకంగా రూ.63,000 స్థాయికి దిగి వచ్చాయి. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ నేటి ప్రారంభ సెషన్‌లో రూ.13.00 (-0.02%) తగ్గి రూ.63210.00 వద్ద, మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.32.00 (-0.05%) క్షీణించి రూ.63944.00 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో సిల్వర్ ఫ్యూచర్స్ 0.050 (-0.21%) డాలర్లు తగ్గి 23.457 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్‌లో 23.435 - 23.600 డాలర్ల మధ్య కదలాడింది. 52 వారాల కనిష్టం 21.410 డాలర్లు, 52 వారాల గరిష్టం 29.930 డాలర్లు. ఏడాదిలో సిల్వర్ ఫ్యూచర్స్ 4 శాతానికి పైగా క్షీణించింది.

బంగారానికి డిమాండ్
కరోనా సమయంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. ధనతెరాస్, దీపావళి సందర్భంగా బంగారం కొనుగోళ్లు పెరుగుతాయి. డిమాండ్‌కు అనుగుణంగా జ్యువెల్లరీ వ్యాపారులు సిద్ధంగా ఉన్నారు. ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ గత ఏడాది ఆగస్ట్ నెలలో ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200 వద్ద ట్రేడ్ అయింది. ఆ తర్వాత క్రమంగా తగ్గుకుంటూ వస్తోంది. గత ఏడాది ధనతెరాస్ సమయంలో బంగారం రూ.50,500 స్థాయిలో ఉంది. ఇప్పుడు రూ.47,750 వద్ద ఉంది. ఈ ఏడాది కాలంలో అంటే ధనతెరాస్ నుండి ధనతెరాస్ మధ్య రూ.3000కు పైగా తగ్గింది. భారత్‌లో బంగారం వినియోగం ఎక్కువ. దీనికితోడు చాలాకాలంగా బంగారాన్ని పెట్టుబడి సాధనంగా వినియోగిస్తున్నారు.

గత ఏడాది పెరిగి, ఇప్పుడు తగ్గుదల
బంగారం ధరలు 2020 క్యాలెండర్ ఏడాదిలో భారీగా పెరిగాయి. అయితే ఆర్థిక రికవరీ కారణంగా 2021లో క్రమంగా క్షీణిస్తున్నాయి. అమెరికా డాలర్ బలపడటం, ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ, కరోనా కేసులు తగ్గడం వంటి అంశాలు కలిసి వస్తున్నాయి. కేసులు తగ్గి, వ్యాక్సినేషన్ పెరగడంతో ఆర్థిక రికవరీ క్రమంగా పెరుగుతోంది. దీనికి తోడు బంగారం డిమాండ్ కూడా పెరుగుతోంది.


Click it and Unblock the Notifications