For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ వారం మార్కెట్: మార్కెట్ మళ్లీ దిద్దుబాటు, బంగారం పరుగులు పెట్టేనా?

|

స్టాక్ మార్కెట్లు గతవారం బలహీనంగా ముగియగా, బులియన్ మార్కెట్ లాభపడింది. స్టాక్ మార్కెట్లో ఈ వారం కూడా లాభాల స్వీకరణ కనిపించవచ్చునని, అయితే బ్యాంకింగ్ వంటి షేర్ల ద్వారా కాస్త మద్దత ఉండే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు. అలాగే, గోల్డ్ మార్కెట్ కూడా ఈ వారం కూడా గతవారం వలె కాస్త సానుకూలంగానే కనిపించే అవకాశాలు మెండుగా ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే స్టాక్, బులియన్.. రెండు మార్కెట్లు కూడా వారంలో ఎక్కువగా ఊగిసలాటకు లోను కావొచ్చునని చెబుతున్నారు.

స్టాక్ మార్కెట్ ఆల్ టైమ్ గరిష్టాలను తాకింది. ఈ కారణంగా గతవారం ప్రాఫిట్ బుకింగ్ కనిపించిది. ప్రస్తుతం దేశీయంగా, అంతర్జాతీయంగా పరిస్థితులు నిలకడగా ఉన్న నేపథ్యంలో ఈ వారం కూడా ప్రాఫిట్ బుకింగ్ ఉండవచ్చునని, అయితే దేశీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో చోటు చేసుకునే పరిణామాలను బట్టి అప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకోవచ్చునని అంటున్నారు. స్వల్పకాలానికి బంగారం కొనుగోలు పట్ల కాస్త ఆలోచించాలని, దీర్ఘకాలానికి మాత్రం కొనుగోలు చేయవచ్చునని సూచిస్తున్నారు. ఎందుకంటే ఈ వారం కూడా గోల్డ్ మార్కెట్ స్థిరంగా లేదా కాస్త ముందుకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు.

మార్కెట్ ర్యాలీకి బ్రేక్

మార్కెట్ ర్యాలీకి బ్రేక్

స్టాక్ మార్కెట్ ర్యాలీకి గతవారం బ్రేక్ పడింది. ప్రాఫిట్ బుకింగ్ ప్రభావం చూపి, మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్‌లో భారీ దిద్దుబాటు కనిపించింది. ఈ దిద్దుబాటు ఈ వారం కూడా కనిపించవచ్చు. గతవారం బ్యాంకింగ్ రంగం మాత్రం రెండు శాతానికి పైగా లాభపడింది.

అంతకుముందు పది సెషన్లు నిఫ్టీ సగటున రోజుకు 100 పాయింట్లకు పైగా లాభపడింది. దీంతో గతవారం లాభాల స్వీకరణ కనిపించింది. గతవారం నష్టపోయినప్పటికీ 18,100 పాయింట్ల వద్ద మద్దతు లభించింది, ఈ వారం 18,040 పాయింట్ల దిగువకు పడిపోతే మీడియం దిద్దుబాటుకు అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. గత ఇరవై సెషన్ల సగటు 17,950 దిగువకు వస్తే 17,900 వద్ద మాత్రం మద్దతు కనిపిస్తోందని, 18,300 పైకి చేరుకుంటే మాత్రం పరుగుకు ఆస్కారం ఉందని భావిస్తున్నారు.

FY22 రెండో త్రైమాసికంలో ఆర్థిక ఫలితాలు అంచనాలకు తగినట్లుగా కనిపిస్తున్నాయి. అయితే దీపావళి సంవత్ నేపథ్యంలో ఈ వారం చివరి నుండి కొనుగోళ్లు పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. గత ఏడాదిన్నర కాలంలో మార్కెట్ కరెక్షన్ ఎనిమిది శాతం దిగువన ఉన్నాయి.

వీటి ప్రభావం

వీటి ప్రభావం

అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా మన సూచీలు కదలవచ్చు. అక్టోబర్ డెరివేటివ్ కాంట్రాక్ట్స్ ఈ వారం గురువారంతో ముగియనున్నాయి. దీంతో ఒడిదుడుకులకు ఆస్కారం ఉందని చెబుతున్నారు. భవిష్యత్తు అంచనాలు, ఉత్పత్తిపై ఆయా రంగాలు, కంపెనీల వ్యాఖ్యలు మార్కెట్ పైన ప్రభావం చూపుతాయి. ఇంధన ధరలు పెరిగితే లాభాలకు బ్రేక్ పడుతుంది. డాలర్ మారకంతో పోలిస్తే రూపాయి వ్యాల్యూ, FII పెట్టుబడుల నుండి మార్కెట్లు సంకేతాలు అందిపుచ్చుకుంటాయి.

సెన్సెక్స్ తక్షణ మద్దతు 60,330, 59,800, నిరోధకస్థాయి 61,420, 61,885. సెన్సెక్స్ 59,800 దిగువకు చేరుకుంటే మరింత పడిపోవచ్చు.

బంగారం ఎలా ఉండవచ్చు

బంగారం ఎలా ఉండవచ్చు

గోల్డ్ డిసెంబర్ ఫ్యూచర్ ఈ వారం రూ.47,300 కంటే దిగువకు రాకుంటే పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఆ స్థాయి కంటే దిగువకు పడిపోతే రూ.47,230 వద్ద మద్దతు లభించే అవకాశముంది. ఈ వారం కూడా బంగారం రూ.47,000 పైనే ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అనుకోని స్థాయిలో రూ.46,700 దిగువకు పడిపోతే మరింత పడిపోవచ్చు.

రూ.47,230 వద్ద స్టాప్ లాస్ పెట్టుకుని రూ.47,380 వద్ద కొనుగోలు చేయవచ్చు. సిల్వర్ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ.64,200 స్థాయికి వస్తే మరింత దిద్దుబాటుకు గురై రూ.63,400 దిగువకు పడిపోవచ్చు. 66,300ను అందుకుంటే మాత్రం రూ.67,000ను క్రాస్ చేయవచ్చు.

English summary

ఈ వారం మార్కెట్: మార్కెట్ మళ్లీ దిద్దుబాటు, బంగారం పరుగులు పెట్టేనా? | Things to whath in the stock market and Gold market for this week

Earnings season ramps up with a flood of fresh earnings reports over the next few trading days.
Story first published: Monday, October 25, 2021, 9:44 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X