నెలకు రూ. 10 వేల రూపాయలు SIP పెట్టుబడి పెట్టడం ద్వారా కోట్లాధిపతిగా మారవచ్చా..అవును మారవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.. మరి ఎలాగంటారా.. తెలివుంటే దేనికైనా మార్గముంటుందని అంటున్నారు.. ఈ రోజుల్లో యువతీ యువకుల్లో ఎక్కువగా ఉండేది ఒక్క కోరిక మాత్రమే. భవిష్యత్తులో ఆర్థిక స్వేచ్ఛను సంపాదించుకోవడం. రిటైరయ్యాక కూడా డబ్బులకు కొదవ లేకుండా జీవితాన్ని గడపటం.
అయితే వారికి వస్తున్న తక్కువ జీతం, పెరుగుతున్న ఖర్చులు, స్థిరం లేని పెన్షన్ వంటి కారణాలు యువతలో ఆ ఆశలను చిదిమేస్తున్నాయి. అయితే దీనిపై చింతించవద్దని నిపుణులు చెబుతున్నారు. మీరు సరైన ప్రణాళిక, క్రమశిక్షణ, ఆర్థిక పరిస్థితులు అనువుగా మార్చుకుని నెలకు కేవలం రూ. 10,000 SIP (Systematic Investment Plan) పెట్టుబడి పెట్టడం ద్వారా లక్షాధికారిగా మారడం పూర్తిగా సాధ్యమేనని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

చార్టర్డ్ అకౌంటెంట్ రాము చెప్పిన వివరాల ప్రకారం.. చిన్న మొత్తంతో ప్రారంభించి, దీర్ఘకాలం పాటు దాన్ని కొనసాగించగలిగితే మీకు వచ్చే చక్రవడ్డీ శక్తి ఈ అసాధ్యాన్ని సాధ్యం చేస్తుంది. ఉదాహరణకు మీరు 25 ఏళ్ల వయసులోనెలకు రూ. 10,000 సిప్ లో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే..మీకు 60 ఏళ్లు వచ్చే నాటికి రూ. 17.7 కోట్లను సంపాదించుకోవచ్చు.అది ఎలాగంటారా..అయితే కింద టేబుల్ ఓ సారి చూడండి.
దశలవారీగా మీరు పెట్టిన పెట్టుబడికి వచ్చే ఫలితాలు:
మీకు 30 ఏళ్లు వచ్చేసరికి ఆ మొత్తం: రూ. 9.8 లక్షలు
35 ఏళ్లు ఏళ్లు వచ్చేసరికి : రూ. 33.7 లక్షలు
40 ఏళ్లు ఏళ్లు వచ్చేసరికి: రూ. 86 లక్షలు
45 ఏళ్లు ఏళ్లు వచ్చేసరికి: రూ.2 కోట్లు
50 ఏళ్లు ఏళ్లు వచ్చేసరికి: రూ. 4.27 కోట్లు
55 ఏళ్లు ఏళ్లు వచ్చేసరికి: రూ.8.8 కోట్లు
60 ఏళ్లు ఏళ్లు వచ్చేసరికి: రూ17.7 కోట్లు అవుతుంది.
అయితే మీరు ఈ ఫలితాలను సాధించడంలో కీలకమైనవి మూడు అంశాలు అని చెప్పుకోవచ్చు. అవేంటంటే.. కాలం, క్రమశిక్షణ, మార్కెట్‌పై నమ్మకం.సాధారణంగా మార్కెట్ హెచ్చుతగ్గులు తరచూ పెట్టుబడిదారులను భయపెడుతూ ఉంటాయి. కానీ పెట్టుబడి ప్రయాణంలో మీరు భయపడకుండా నిరంతరంగా కొనసాగితే దీర్ఘకాలంలో మీరు గొప్ప ఫలితాలను పొందగలుగుతారు.
మీరు సగటున రూ. 17.7 కోట్ల నిధితో పదవీ విరమణ తర్వాత నెలకు రూ. 80,000 వరకు ఆదాయం పొందవచ్చు. ఇక ద్రవ్యోల్బణాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంట..మీకు ఇది సుమారు 95 ఏళ్ల వయస్సు వరకు ఆర్థిక భద్రతను అందిస్తుంది.
ఈ మధ్య కాలంలో అద్భుతమైన ఫలితాలు చూపించిన కొన్ని ఫండ్లు:
క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్: 26.62% CAGR
నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్: 25.01% CAGR
మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్: 23.93% CAGR
క్వాంట్ ELSS పన్ను ఆదా: 23.61% CAGR
కాబట్టి మీరు చిన్న మొత్తాలతో పెట్టుబడిని ప్రారంభించడంలో ఏ మాత్రం భయంతో కూడిన సందేహం అవసరం లేదు. సమయం, స్థిరత్వం, మార్కెట్‌పై నమ్మకం ఉంటే ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడం పెద్ద కష్టమేమి కాదు. కాబట్టి నిర్భయంగా మీ ప్రయాణాన్ని ప్రారంభించండి... కొనసాగించండి... చేరాల్సిన లక్ష్యాన్ని చేరుకోండి!
Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications