Gold Prices Today: బంగారం ధర రూ.45,000కు వస్తుందా? వెండి రూ.60,000కు వచ్చే ఛాన్స్

బంగారం ధరలు పెరుగుతున్నాయి. శుక్రవారం (ఆగస్ట్ 20) ప్రారంభ సెషన్‌లో అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.141.00 (0.30%) పెరిగి రూ.47310.00 వద్ద ట్రేడ్ అయింది. డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.172.00 (0.36%) పెరిగి రూ.47506.00 వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా స్వల్పంగా పెరిగాయి. అయినప్పటికీ రూ.62,500 దిగువనే ట్రేడ్ అవుతోంది. గత పది రోజుల్లోనే సిల్వర్ ఫ్యూచర్ రూ.7000 వరకు క్షీణించింది.

నేడు సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.121.00 (0.19%) పెరిగి రూ.62254.00 వద్ద, డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.128.00 (0.20%) పెరిగి రూ.63045.00 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లోను బంగారం, వెండి ధరలు పైపైకి చేరుకుంటున్నాయి. కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 4.90(+0.27%) డాలర్లు పెరిగి 1,788.00 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.007 (0.03%) డాలర్లు లాభపడి 23.223 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

పసిడి ప్రభావం, వడ్డీ రేటు ముందే మారే అవకాశం

పసిడి ప్రభావం, వడ్డీ రేటు ముందే మారే అవకాశం

బంగారం ధరలు నేడు స్వల్పంగా పెరిగినప్పటికీ మున్ముందు కరెక్షన్‌కు గురి కావొచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అమెరికాలో జాబ్ మార్కెట్ క్రమంగా పుంజుకుంటోంది. అలాగే, ఫెడ్ రిజర్వ్ అసెట్ పర్చేజ్ ప్రోగ్రామ్‌ను సులభతరం చేసే దిశగా వెళ్తోంది. ఈ నేపథయంలో యూఎస్ డాలర్ బలంగా మారుతుందని, ఈ ప్రభావం పసిడి పైన పడి దిద్దుబాటుకు లోను కావొచ్చునని భావిస్తున్నారు. అదే జరిగితే అమెరికా సెంట్రల్ బ్యాంకు ఊహించిన దాని కంటే ముందుగానే వడ్డీ రేట్ల పెంపు వైపు అడుగులు పడవచ్చునని భావిస్తున్నారు.

అమెరికా ఎకానమీ క్రమంగా పుంజుకుంటోంది. దీంతో డాలర్ డినామినేటెడ్ కమోడిటీస్ ఎక్కువగా పతనమవుతున్నాయి. డాలర్ ఇండెక్స్ మూడు వారాల గరిష్టానికి చేరుకుంది. ఆగస్ట్ 13వ తేదీన బంగారం 17000 డాలర్ల దిగువకు కూడా పడిపోయింది. అయితే ఆ తర్వాత తిరిగి పుంజుకొని, ఈ వారం రోజుల్లో 1790 డాలర్లకు చేరుకుంది.

బంగారం రూ.45,000కు పడిపోవచ్చా?

బంగారం రూ.45,000కు పడిపోవచ్చా?

దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర రూ.47,300 వద్ద ఉంది. ప్రధాన ద్రవ్యోల్భణ డేటా ఊహించిన దాని కంటే తక్కువగా ఉన్నందున ధరలు స్వల్పంగా పుంజుకున్నాయి. బలమైన యూఎస్ డేటా, ఫెడ్ వైఖరి స్వల్పకాలంలో బంగారం ధరలు తగ్గడానికి అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. త్వరలో ఈ పసుపు లోహం మరోసారి 1700 డాలర్ల దిగువకు పడిపోయే అవకాశాలు కొట్టి పారేయలేమని చెబుతున్నారు. మరికొద్ది వారాలకు గాను బంగారం రూ.45,500 టార్గెట్ ధరతో రూ.48,000 స్టాప్ లాస్ పెట్టుకొని, రూ.47,500 వద్ద కొనుగోలు చేయవచ్చునని సూచిస్తున్నారు.

వెండి ధర రూ.60,000 స్థాయికి...

వెండి ధర రూ.60,000 స్థాయికి...

మరోవైపు వెండి ధరలు ఇప్పటికే భారీగా దిద్దుబాటుకు గురయ్యాయి. మరింత దిద్దుబాటుకు గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ఫ్యూచర్స్ 23 డాలర్ల వద్ద ఉంది. దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో రూ.63,000 దిగువన ఉంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటుండటంతో విలువైన లోహాలపై ఒత్తిడి తగ్గుతోంది.

ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుండటంతో పారిశ్రామిక రంగ డిమాండ్ పుంజుకుంటుంది. రాబోయే రెండు మూడు వారాల్లో బంగారం ధర ఎంసీఎక్స్‌లో మరింత తగ్గే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ఎంసీఎక్స్‌లో రూ.60,000 టార్గెట్ ధరతో రూ.65,000 వద్ద స్టాప్ లాస్ పెట్టుకొని, రూ.63,500 వద్ద కొనుగోలు చేయవచ్చునని సూచిస్తున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+