Gold Bond Scheme: మార్కెట్ ధర కంటే తక్కువకు బంగారం... ధర, వడ్డీ, డిస్కౌంట్

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నేడు (జూన్ 8, సోమవారం) సావరీన్ గోల్డ్ బాండ్స్ (SGB) స్కీంను మూడో సిరీస్ అందుబాటులోకి తెస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో రెండుసార్లు సేల్ చేసింది. ఇది మూడో విడత. కరోనా మహమ్మారి సమయంలో చాలామంది చేతుల్లో డబ్బులు లేవు. అలాగే ఈక్విటీ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు ప్రస్తుత పరిస్థితుల్లో సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో గోల్డ్ బాండ్స్‌కు మరింత ప్రాధాన్యత ఏర్పడింది.

ఏప్పటి నుండి ఎప్పటి వరకు

ఏప్పటి నుండి ఎప్పటి వరకు

2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను మూడో విడత గోల్డ్ బాండ్స్ జూన్ 8వ తేదీ నుండి 12వ తేదీ మధ్య జారీ చేస్తున్నారు. ఈ సిరీస్‌లో కొన్న వారికి జూన్ 16వ తేదీన గోల్డ్ బాండ్స్ జారీ చేస్తుంది ఆర్బీఐ. మే నెలలో రూ.1,168 కోట్ల విలువైన 25 లక్షల యూనిట్ల బంగారం బాండ్స్‌ను విక్రయించింది. ఇప్పటి వరకు ఇదే అత్యధిక విక్రయం అని ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయి.

గోల్డ్ బాండ్స్ ధర మరియు డిస్కౌంట్

గోల్డ్ బాండ్స్ ధర మరియు డిస్కౌంట్

ఈ గోల్డ్ బాండ్స్ గ్రాము ధరను రూ.4,677గా నిర్ణయించింది ఆర్బీఐ. ఆన్‌లైన్‌తో పాటు డిజిటల్ మాధ్యమం ద్వారా కొనుగోలు చేస్తే డిస్కౌంట్ ఉంటుంది. చెల్లింపులు డిజిటల్ మార్గంలో ఉంటే గ్రాముకు రూ.50 డిస్కౌంట్ ఉంది. అంటే అలాంటి ఇన్వెస్టర్లకు గ్రాము బంగారం ధర రూ.4,627గా ఉంటుంది.

మార్కెట్ ధర కంటే తక్కువ

మార్కెట్ ధర కంటే తక్కువ

సావరీన్ గోల్డ్ బాండ్స్ మార్కెట్ ధర కంటే కాస్త తక్కువగా ఉంటుంది. ఇటీవల హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,000 మార్క్ దాటింది. మార్కెట్లో స్వచ్ఛమైన బంగారంతో పోలిస్తే సావరీన్ గోల్డ్ బాండ్స్ ధర తక్కువే. కానీ ఫిజికల్ బంగారానికి, గోల్డ్ బాండ్‌కు కొన్ని తేడాలు ఉన్నాయి.

ఇక్కడ కొనుగోలు చేయవచ్చు

ఇక్కడ కొనుగోలు చేయవచ్చు

బ్యాంకులు, పోస్టాఫీస్‌లు, ఎన్ఎస్ఈ, బీఎస్ఈ, స్టాక్ హోల్డింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేయవచ్చు. ఆర్థిక సంవత్సరంలో కనీసం 1 గ్రాము నుండి గరిష్టంగా 500 గ్రాముల వరకు గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేయవచ్చు.

ఎంత వరకు కొనవచ్చు

ఎంత వరకు కొనవచ్చు

హిందూ అవిభాజ్య కుటుంబం గరిష్టంగా 4 కిలోల బంగారం, ట్రస్టులు 20 కిలోల గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేయవచ్చు. మైనర్ల పేరు మీద కూడా తీసుకోవచ్చు. గోల్డ్ బాండ్స్ విక్రయించే ప్రతిసారి ఆర్బీఐ ధరను ఫిక్స్ చేస్తుంది. ఫిజికల్ బంగారం కొనుగోలు చేయడం ఇష్టంలేనివారు బాండ్స్‌కు పెట్టుబడి కోసం మొగ్గు చూపుతారు. రెండింటికి ఒకే కేవైసీ నిబంధనలు వర్తిస్తాయి. ప్రతి దరఖాస్తుపై ఇన్వెస్టర్ పాన్ నెంబర్ తప్పనిసరి.

వడ్డీ... ట్యాక్స్

వడ్డీ... ట్యాక్స్

గోల్డ్ బాండ్స్ పెట్టుబడి సాధనం. వీటిని డిమ్యాట్ రూపంలోకి మార్చుకోవచ్చు. తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవచ్చు. అయితే గోల్డ్ బాండ్స్‌కు ట్యాక్స్ చెల్లించాలి. గోల్డ్ బాండ్స్ మెచ్యూరిటీ పీరియడ్ 8 సంవత్సరాలు. మెచ్యూరిటీ పీరియడ్ తర్వాత అప్పటి ధరతో సమానంగా తిరిగి చెల్లిస్తారు. అయిదేళ్ల తర్వాత విక్రయించవచ్చు. సంవత్సరానికి నామమాత్రపు విలువపై 2.5 సాతం వడ్డీ లబిస్తుంది. ఈ వడ్డీని ఆరు నెలలకు ఓసారి చెల్లిస్తారు. అసలు, మెచ్యూరిటీపై వడ్డీ ఉంటుంది.

2015లో ప్రారంభం

2015లో ప్రారంభం

సావరీన్ గోల్డ్ బాండ్స్ స్కీంను కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రారంభించింది. ఫిజికల్ గోల్డ్‌కు డిమాండ్ తగ్గించే ఉద్దేశ్యంలో భాగంగా దీనిని తీసుకు వచ్చింది. ప్రతి సంవత్సరం పలుమార్లు గోల్డ్ బాండ్స్ జారీ చేస్తోంది. ఇప్పటి వరకు 39సార్లు గోల్డ్ బాండ్స్ జారీ చేశారు. 2016 అక్టోబర్ నెలలో 1,082, గత మే నెలలో అంతకుమించి విక్రయించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+