సావరీన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 020-21-సిరీస్ 12 సబ్‌స్క్రిప్షన్ నేటి నుండి (మార్చి 1, సోమవారం) అందుబాటులో ఉంటుంది. ఈ గోల్డ్ బాండ్ ఇష్యూ ధరను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) రూ.4,462గా నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం తరఫున ఆర్బీఐ ఈ బాండ్స్ జారీ చేస్తుంది. ఇది గోల్డ్ యూనిట్‌లుగా ఉంటుంది. ఇది ఒక గ్రాముకు సమానం. ఈ పథకం ద్వారా మీకు ఉండే బంగారం బాండ్ రూపంలో కలిగి ఉంటారు. మెచ్యూరిటీ సమయంలో దీనిపై వడ్డీ ప్రయోజనం ఉంటుంది. ఇటీవల బంగారం ధరలు భారీగా తగ్గాయి. దీంతో ఈసారి గోల్డ్ బాండ్ ధర కూడా తక్కువగా ఉంది.

ఇష్యూ ధర
సిరీస్ 12 గోల్డ్ బాండ్ ఇష్యూ ధరను రూ.4,662గా నిర్ణయించారు. ముంబై కేంద్రంగా పని చేసే ఇండియా బులియన్ అండ్ జ్యువెల్లరీ అసోసియేషన్ (IBJA) స్పాట్ ధరల ఆధారంగా బాండ్ ధరను నిర్ణయిస్తారు. 999 స్వచ్ఛత బంగారం ధర సబ్స్క్రిప్షన్‌కు ముందు వారం చివరి మూడు పని దినాలలో ఉన్న ధరకు సగటును లెక్కించి నిర్ణయిస్తారు. ఈ గోల్డ్ బాండ్ స్కీం నేటి నుండి (మార్చి 1) జారీ చేస్తున్నారు. మార్చి 5వ తేదీ వరకు దీనిపై పెట్టుబడులు పెట్టవచ్చు. గోల్డ్ బాండ్ స్కీం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

రూ.50 తగ్గింపు
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే గ్రాముకు రూ.50 తగ్గింపు ఉంది. డిజిటల్ మోడ్ ద్వారా సబ్‌స్క్రైబ్ అయితే రూ.50 తగ్గి రూ.4,612కు లభిస్తుంది. సావరీన్ గోల్డ్ బాండ్స్‌ను స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, చెల్లింపు బ్యాంకులు మినహా మిగతా బ్యాంకులు జారీ చేస్తాయి. అలాగే స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎంపిక చేయబడిన పోస్టాఫీసులు, ఎన్ఎస్ఈ, బీఎస్ఈ వంటి గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజీల ద్వారా విక్రయిస్తారు.

మెచ్యూరిటీ పీరియడ్
దరఖాస్తుదారు పాన్ నెంబర్ తప్పనిసరి. జారీ చేసిన బాండుపై పెట్టుబడిదారులకు ఏడాదికి 2.5 శాతం వడ్డీ అందిస్తుంది. ఆరు నెలలకు ఒకసారి వడ్డీని చెల్లిస్తారు. పెట్టుబడి పెట్టిన రోజు నుండి 8 సంవత్సరాలు మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. మెచ్యూరిటీ సమయంలో ఇండియా బులియన్ అండ్ జ్యువెల్లర్స్ అసోసియేషన్ ప్రచురించిన 999 స్వచ్ఛత బంగారం, చివరి మూడు పని దినాలలో ఉన్న ధరకు సగటు లెక్కించి చెల్లింపులు జరుపుతారు.
మెచ్యూరిటీ సమయం కంటే ముందు తీసుకోవాలంటే జారీ చేసిన రోజు నుండి 5 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత విత్ డ్రా చేసుకోవాలి. రుణ సదుపాయం ఉంటుంది. గోల్డ్ బాండ్స్ పైన వచ్చే వడ్డీ పైన పన్ను వర్తిస్తుంది. మెచ్యూరిటీ వరకు ఉంచితే మూలధన లాభాలపై పన్ను వర్తించదు. పన్ను ప్రయోజనం ప్రత్యేకించి పసిడి పథకాలకు మాత్రమే అందుబాటులో ఉంది.

మెచ్యూరిటీకి ముందు తీసుకుంటే
మెచ్యూరిటీకి ముందే విక్రయించాలనుకుంటే లిస్టయిన బాండ్స్‌ను ఎక్స్చేంజీల ద్వారా విక్రయించడం లేదా జారీ చేసిన తేదీ నుండి ఐదవ సంవత్సరం తర్వాత బాండ్స్ ఉపసంహరించుకోవచ్చు. అప్పుడు మూలధన లాభాలపై పన్ను వర్తిస్తుంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ 10 సిరీస్‌ల గోల్డ్ బాండ్స్ విక్రయించింది. 6.13 టన్నుల పసిడి, రూ.2,316.37 కోట్ల బాండ్స్ విక్రయించింది. ఫ్యూచర్ మార్కెట్లో ప్రస్తుతం పసిడి రూ.45,767గా ఉంది. గోల్డ్ బాడ్ రూ.4,662గా ఉంది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications