ఆరో సావరీన్ గోల్డ్ బాండ్(సార్వభౌమ పసిడి బాండ్లు) నేటి నుండి (ఆగస్ట్ 31) నుండి జారీ చేస్తున్నారు. సెప్టెంబర్ 4వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఈ స్కీం అందుబాటులో ఉంటుంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇది ఆరో సిరీస్. మార్కెట్ ధర కంటే తక్కువ రేటుకు పసిడి అందుబాటులో ఉంటుంది. ఐదు రోజుల పాటు ఈ గోల్డ్ బాండ్ సేల్స్ ఉంటాయి. బంగారంపై ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశంగా భావిస్తారు. మార్కెట్ రేటు కంటే సావరీన్ గోల్డ్ బాండ్స్‌లో పసిడి రేటు కాస్త తక్కువగా ఉంటుంది.

సావరీన్ గోల్డ్ బాండ్స్ తేదీలు, ధరలు
ఆరో సావరీన్ గోల్డ్ బాండ్స్ ఇష్యూ గ్రాము ధర రూ.5,117గా నిర్ణయించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI). అంతకుముందు ఆగస్ట్ 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు జరిగిన ఐదో విడత సార్వభౌమ పసిడి బాండ్స్ విక్రయం రూ.5,334గా ఉంది. గత రెండు మూడు వారాలుగా పసిడి ధరలు తగ్గడంతో గత పసిడి బాండ్స్ కంటే ఈసారి ఒక గ్రాముకు రూ.200కు పైగా తగ్గింది.

ఆన్‌లైన్‌లో కొంటే రూ.50 తగ్గుదల
పసిడి బాండ్స్‌ను ఆన్ లైన్ మార్గంలో కొనుగోలు చేస్తే రూ.50 డిస్కౌంట్ ఉంది. ధర రూ.5,117 కాగా, డిజిటల్ మార్గంలో కొనుగోలు చేసిన వారికి రూ.5,067గా ఉంటుంది. అంటే 10 గ్రాములు కొనుగోలు చేస్తే రూ.500 తగ్గుతుంది. ఇటీవల పసిడి డిమాండ్‌లో మార్పుల నేపథ్యంలో సావరీన్ గోల్డ్ బాండ్స్‌కు డిమాండ్ పెరిగింది. ఫ్యూచర్ మార్కెట్లో పసిడి ధర 10 గ్రాములు రూ.51,208 పలుకుతోంది. ఇటీవల పసిడి అస్థిరత కొనసాగుతోంది. సావరీన్ గోల్డ్ బాండ్స్ ధర దాదాపు మార్కెట్ ధర కంటే కొంత వరకు తక్కువగా ఉంటుంది. బంగారంపై పెట్టుబడులు మంచి ఆలోచన అని, ఈ ఏడాది కరోనా కారణంగా దాదాపు 30 శాతం మేర పెరిగాయని బులియన్ మార్కెట్ నిపుణులు గుర్తు చేస్తున్నారు.

ఏమిటీ సావరీన్ గోల్డ్ బాండ్స్?
ఏప్రిల్ నెలలో ప్రభుత్వం సిరీస్ 1 బాండ్స్ జారీ చేసింది. బంగారం బలమైన పెట్టుబడిని ఆకర్షిస్తోంది. దీనికి డిమాండ్ పెరగడంతో మరోసారి జారీ చేసింది. భౌతిక బంగారం డిమాండును తగ్గించడం, దేశీయ పొదుపులో కొంత భాగాన్ని బంగారం కొనుగోలుకు ఉపయోగించే ఆర్థిక పొదుపుగా మార్చాలనే లక్ష్యంతో సావరీన్ గోల్డ్ బాండ్స్ పథకాన్ని నవంబర్ 15వ తేదీన కేంద్రం ప్రారంభించింది.

బాండ్స్ ఎలా పొందవచ్చు, ఎంత వడ్డీ?
బ్యాంకు ద్వారా సబ్‌స్క్రైబ్ కావొచ్చు. పోస్టాఫీస్‌లలో కూడా అందుబాటులో ఉంటాయి. స్టాక్ ఎక్స్చేంజెస్.. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, స్టాక్ హోల్డింగ్ కార్పోరేషన్ లేదా నేరుగా ఏజెంట్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. పసిడి బాండ్స్ కొనుగోలు చేసిన పెట్టుబడిదారులకు సంవత్సరానికి 2.50 శాతం వడ్డీ రెండు దభాలుగా చెల్లించబడుతుంది. ఇది ఇష్యూ జారీ చేసిన తేదీ నుండి అమల్లోకి వస్తుంది. ప్రతి ఆరు నెలలకు ఓసారి వడ్డీ చెల్లిస్తారు.

పన్ను వివరాలు
సావరీన్ గోల్డ్ బాండ్లపై అందుకున్న వడ్డీకి పన్ను ఉంటుంది. వడ్డీ ఆదాయం వ్యక్తిగత ఆదాయంతో కలిపి వర్తించే పన్ను స్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాలి. అయితే వడ్డీ ఆదాయంపై టీడీఎస్ లేదా సోర్స్ వద్ద పన్ను విధించరు. సావరీన్ గోల్డ్ కాలపరిమితి ఎనిమిదేళ్లు. మెచ్యూరిటీ వరకు ఉంచితే మూలధన లాభాలకు పన్ను వర్తించదు. పెట్టుబడిదారులను భౌతిక బంగారు పెట్టుబడుల నుండి బాండ్స్ వైపు ప్రోత్సహించేందుకు అందించే ప్రత్యేక ఆదాయ పన్ను ప్రయోజనం. మూలధన లాభాల పన్ను నుంచి పన్ను మినహాయింపు గోల్డ్ ఈటీఎప్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్‌లో లేదు.

ముందే బయటకు రావొచ్చా?
బాండ్స్ కాలపరిమితి ఎనిమిదేళ్లు కాగా ముందే నిష్క్రమించేందుకు రెండు పద్ధతులు ఉన్నాయి. ఎక్స్చేంజీలో లిస్టయిన బాండ్స్‌ను ఎక్స్చేంజీల ద్వారా విక్రయించాలి. లేదా జారీ చేసిన తేదీ నుండి ఐదో సంవత్సరం తర్వాత బాండ్స్‌ను ఉపసంహరించుకోవచ్చు. ఈ రెండు సందర్భాలలో మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది. ఎక్స్చేంజీల ద్వారా విక్రయిస్తే కొనుగోలు చేసిన తేదీ నుండి మూడేళ్ల లోపు ఉండే స్వల్పకాలంగా పరిగణిస్తారు. మీ స్థూల మొత్తం ఆదాయానికి జోడించి వ్యక్తిగత ఆదాయ స్లాబ్ వద్ద ఆదాయపు పన్ను వర్తిస్తుంది. మూడేళ్లకు పైబడి ఉండే దీర్ఘకాలిక లాభాలు 20.8 శాతం పన్ను వర్తిస్తుంది.

ఎంత కొనుగోలు చేయాలి?
కనీసం ఒక గ్రాము నుండి 4 కిలోల వరకు ఎంతైనా కొనుగోలు చేయవచ్చు. ట్రస్టులు వంటివి అయితే 20 కిలోలు కొనుగోలు చేయవచ్చు. బాండ్ కొనుగోలు చేసిన సమయానికి ముందు ఇండియా బులియన్, జ్యువెల్లరీస్ అసోసియేషన్ లిమిటెడ్ ప్రచురించిన 999 స్వచ్ఛత బంగారం మూడు రోజుల ధరల సరాసరిని ఆధారంగా తీసుకొని బాండ్స్ విక్రయిస్తారు.
ఈ బాండ్స్ ద్వారా రుణ సదుపాయం పొందవచ్చు. బాండ్స్ కాలపరిమితి ముగిసిన తర్వాత ఎలాంటి మూలధన పన్ను చెల్లించకుండా పూర్తి డబ్బును పొందవచ్చు. ఒకవేళ పెట్టుబడిదారు మధ్యలో తన బాండును ఇతరులకు బదలీ చేస్తే దీర్ఘకాలిక మూలధన వడ్డీ చెల్లించాలి.

వేల కోట్ల సమీకరణ
2015 నవంబర్ నెలలో ప్రారంభమైన ఈ గోల్డ్ బాండ్స్ స్కీం ద్వారా ప్రభుత్వం రూ.9,652 కోట్లకు పైగా సమీకరించింది. 37 మార్లు నిర్వహించిన ఈ గోల్డ్ బాండ్ స్కీం ద్వారా 38.98 టన్నుల విలువైన గోల్డ్ బాండ్ విక్రయం జరిగింది. దేశంలో పెట్టుబడులకు సంబంధించి ఫిజికల్ గోల్డ్ డిమాండ్ తగ్గించడం లక్ష్యంగా 2015-16 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం సావరిన్ గోల్డ్ బాండ్ స్కీంను ప్రవేశపెట్టింది.
More From GoodReturns

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

కుప్పకూలిన బంగారం ధర.. 10 గ్రాములు ఏకంగా రూ. 5 వేలకు పైగా ఢమాల్.. కొనుగోలుపై నిపుణులు కీలక సూచన

బంగారం ధరలు కాస్త శాంతించాయి.. లక్షా యాభై వేల రూపాయల దిగువకు.. మార్చి 21, శనివారం ధరలు ఇవే..

వెండి ధర రూ. 3 లక్షలు.. బంగారం ధర 10 గ్రాములు రూ. 1. 72 లక్షలు.. షాకిస్తున్న ఆర్థిక నిపుణులు అంచనాలు..

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

కుప్పకూలిన బంగారం, వెండి ధరలు .. గంటల వ్యవధిలో 2 ట్రిలియన్ డాలర్లు ఆవిరి.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. మార్చి 23, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: బంగారం ధరలు భారీగా పతనం.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన.. సామాన్యులకు ఊరట

బంగారం, వెండి ధరలు ఢమాల్.. గ్యాస్ ధరలు హడల్.. గ్లోబల్ మార్కెట్లో అసలేమి జరుగుతోంది..

భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు, కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం



Click it and Unblock the Notifications