ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీసీఎఫ్ అనేది ప్రభుత్వం ఆమోదించిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాండ్ పథకాలకు పన్ను మినహాయింపును అందించడం ద్వారా పెట్టుబడిదారులకు ప్రయోజనం చేకూర్చే నిబంధన. ఇది 2010 సంవత్సరంలో రూపొందించబడి, 2011లో అమలులోకి వచ్చింది. దేశంలోని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు, అలాగే పన్ను చెల్లింపుదారుల బాధ్యతలను తగ్గించేందుకు ఆదాయపు పన్ను శాఖ ఈ తగ్గింపును తిరిగి ప్రవేశపెట్టింది.

వీటిలో ఇన్వెస్ట్ చేయవచ్చు
దేశ ఆర్థిక అభివృద్ధికి మౌలిక సదుపాయాలకు సంబంధం ఉంటుంది. మెరుగైన ఇన్ఫ్రా, వేగవంతమైన వృద్ధి, ఆర్థిక పురోగతికి దారి తీస్తుంది. అయితే మౌలిక సదుపాయాల అభివృద్ధికి లక్షల కోట్లు అవసరం. ఇందుకు ఎక్కువ శాతం నిధులు పన్ను చెల్లింపుదారుల నుండి వస్తుండగా, మిగతా నిధులను సమకూర్చేందుకు పౌరుల సహకారం కోసం ఇన్ఫ్రా బాండ్స్‌ను విడుదల చేస్తుంది.
ఎక్కువమంది పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు80సీసీఎఫ్ ద్వారా ప్రోత్సాహకాలను అందిస్తోంది. పన్ను చెల్లింపుదారులు పన్ను భారాన్ని తగ్గించుకోవడానికి చూస్తారు. అలాంటి వారు ఈ బండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు.

అర్హత ఎవరికి
సెక్షన్ 80సీ ప్రకారం లభించే రూ.1.50 లక్ష మినహాయింపుకు అదనంగా 80సీసీఎఫ్ ద్వారా పన్నును ఆదా చేసుకోవచ్చు. నిర్దిష్ట పథకాలలో పెట్టుబడి చేసిన పన్ను చెల్లింపుదారులకు మాత్రమే ఈ సెక్షన్ కింద మినహాయింపు వర్తిస్తుంది. ఈ సెక్షన్ కింద ఇన్ఫ్రా, ఇతర బాండ్స్‌లో చేసిన పెట్టుబడులపై పన్ను మినహాయింపు ఉంటుంది.
సెక్షన్ 80సీసీఎఫ్ కింద లభించే ఈ మినహాయింపు భారతీయులకు ఎవరికైనా వర్తిస్తుంది. ఎన్నారైలు, విదేశీయులకు ఈ మినహాయింపు వర్తించదు. సంస్థలు, సంఘాలు మొదలైన వాటికి ఈ నిబంధన వర్తించదు. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులతో పాటు హిందూ అవిభాజ్య కుటుంబాల వారికి సెక్షన్ 80సీసీఎప్ కింద పన్ను మినహాయింపుకు అర్హత ఉంది.

ఒక్కరికే ప్రయోజనాలు
ఉమ్మడిగా ఇన్వెస్ట్ చేసినా ప్రయోజనాలు ఒక్కరికే లభిస్తాయి. ప్రథమ పెట్టుబడిదారు పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. హిందూ అవిభాజ్య కుటుంబాలలో ఒక సభ్యుడు మాత్రమ మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. ప్రభుత్వ అనుమతితో బ్యాంకులు, కార్పోరేషన్లు జారీ చేసే పన్ను ఆదా బాండ్స్, ఇన్ఫ్రా బాండ్స్‌లో చేసిన పెట్టుబడులకు మాత్రమే సెక్షన్ 80సీసీఎఫ్ వర్తిస్తుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం వడ్డీ ఆదాయంపై మాత్రం పన్ను చెల్లించాలి.

మినహాయింపు పరిమితి
సెక్షన్ 80సీసీఎప్ కింద గరిష్టంగా 20వేల వరకు మినహాయింపు ఉంటుంది. అంతకుమించితే మినహాయింపు వర్తించదు.
మినహాయింపు పొందడానికి పాన్ వివరాలు, ప్రభుత్వం ఆమోదించిన ఐడీ ప్రూఫ్, బ్యాంకు వివరాలు, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీసీఎప్ వర్తింపు పెట్టుబడి పత్రాలు అవసరం.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..



Click it and Unblock the Notifications