హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తమ వినియోగదారుల కోసం అనేక పథకాలను తీసుకొస్తోంది. తాజాగా, సీనియర్ సిటిజన్ల కోసం మరో పథకాన్ని ప్రవేశపెట్టింది. సీనియర్ సిటిజన్స్ కోసం స్పెఫల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ 'ఎస్బీఐ వీకేర్' తీసుకొచ్చింది. ఈ పథకం సెప్టెంబర్ 30 వరకు అందుబాటులో ఉంటుంది.

ఎస్బీఐ కొత్త పథకం..
కరోనావైరస్ సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేకంగా ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీంను తీసుకువచ్చింది. ఐదేళ్లపదవీ కాలం, అంతకంటే ఎక్కువ కాలం వారికి పెట్టుబడలుపై అధిక వడ్డీ రేటు పొందేందుకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. కాగా, ఎస్బీఐ వీకేర్ డిపాజిట్‌గా పిలవబడే ఈ కొత్త పథకానికి వారి స్థిర డిపాజిట్లపై అదనంగా 30 బేసిక్ పాయింట్లను పొందుతున్నారు. ప్రస్తుతం ఎస్బీఐ టర్మ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు అదనంగా 50 బేసిక్ పాయింట్లను అందిస్తుంది.

సీనియర్ సిటిజన్లకు ఎస్బీఐ స్కీంలో 6.2 శాతం వడ్డీ.. సెప్టెంబర్ 30వరకే
ఒకవేళ ఎస్బీఐ వీకేర్ స్కీంలో డిపాజిట్ చేస్తే అదనంగా 30 బేసిస్ పాయింట్లు వడ్డీ లభిస్తుంది. అంటే ఎస్బీఐ వీకేర్ స్కీంలో డిపాజిట్ చేయడం ద్వారా సీనియర్ సిటిజన్లకు 6.2 శాతం వడ్డీ పొందవచ్చు. అయితే, ఐదేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లకు మాత్రమే ఈ వీడ్డీ రేటు వర్తిస్తుంది. అయితే, 2021, సెప్టెంబర్ 30 లోగా ఈ స్కీంలో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) వడ్డీ రేట్లను తరచూ మారుస్తూ ఉంటుంది. వడ్డీ రేట్లు పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. అందుకే ఎప్పటికప్పుడు వడ్డీ రేట్లను తనిఖీ చేయాల్సి ఉంటుంది.

డిపాజిట్ ఐదేళ్లు ఉంచితేనే పూర్తి ప్రయోజనం కోసం
కాగా, ఎస్బీఐ వీకేర్ డిపాజిట్ స్కీంలో డిపాజిట్ చేయాలంటే వయస్సు 60 ఏళ్లపైనే ఉండాలి. భార్యాభర్తలు సింగిల్ లేదా జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. నామినేషన్(నామినీ) సదుపాయం కూడా ఉంది. ఈ స్కీంలో కనీసం రూ. 1000 నుంచి గరిష్టంగా 15,00,000 వరకు డిపాజిట్ చేయవచ్చు. మొదట ఐదేళ్లకు డిపాజిట్ చేయాలి. ఆ తర్వాత మరో మూడేళ్లు పొడిగించుకోవచ్చు. అయితే, ఐదేళ్ల కంటే ముందే డబ్బులు తీసుకుంటే(విత్ డ్రా చేస్తే) వడ్డీ నష్టపోవాల్సి ఉంటుంది. ఈ పథకం పూర్తి ప్రయోజనం పొందాలంటే కనీం ఐదేళ్లపాటు డబ్బును ఖాతాలోనే ఉంచాల్సి ఉంటుంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్‌డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications