కరోనా మహమ్మారి కారణంగా ఇప్పుడు చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. ఐటీ కంపెనీలలో అయితే వందకు 80 శాతం నుండి 90 శాతం వరకు ఉద్యోగులు ఇంటి వద్ద నుండి పని చేస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారి కోసం రిలయన్స్ జియో మరో అద్భుత ఆఫర్‌తో ముందుకు వచ్చింది. ఈ మేరకు హై-డేటా ప్రీపెయిడ్ యూజర్ల కోసం శుక్రవారం జియో మరో సూపర్ ఆఫర్‌తో ముందుకు వచ్చింది.

రూ.999కే రోజుకు 3GB డేటా 84 రోజులు
రిలయన్స్ జియో తాజాగా ప్రకటించిన ఆఫర్ క్వార్టర్లీ ప్లాన్. ఈ ప్లాన్‌లో రోజుకు 3GB డేటా 84 రోజుల కాలపరిమితి ఉంటుంది. ఇది కేవలం రూ.999కి మాత్రమే. ఈ ప్లాన్‌లో 1GB హైస్పీడ్ డేటా రూ.4 కంటే తక్కువకు వస్తుంది. ఈ ప్లాన్‌లో భాగంగా జియో నుండి జియోకు ఉచిత-అపరిమిత కాల్స్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ల్యాండ్ లైన్ ద్వారా కూడా ఈ ప్రయోజనం ఉంది. అలాగే, జియో నుండి ఇతర నెట్‌వర్క్‌లకు 3,000 నిమిషాల వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు పంపించుకోవచ్చు.

జియో యాప్స్ సబ్‌స్క్రిప్షన్
ఈ ప్లాన్‌లో ప్రతి రోజు 3GB హైస్పీడ్ డేటా వస్తుంది. ఇది రోజుకు 3GB చొప్పున మొత్తం 252GB డేటా ఆఫర్. డేటా పూర్తయ్యాక స్పీడ్ 64Kbpsకు తగ్గుతుంది. వీటితో పాటు జియో యాప్స్ సబ్‌స్క్రిప్షన్ వంటి అదనపు ప్రయోజనాలు ఉన్నాయి.

రూ.349 ప్లాన్‌లో..
రిలయన్స్ జియో తక్కువ మొత్తంతోను ఇలాంటి ఆఫర్లు తీసుకు వచ్చింది. రూ.349 ప్లాన్‌లో రోజుకు 3GB డేటా, జియో నుండి జియోకు ఉచిత కాల్స్, జియో నుండి ఇతర టెల్కోలకు 1,000 నిమిషాల కాల్స్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ కాల పరిమితి 28 రోజులు. మొత్తం డేటా 84GB.

ఇతర ప్లాన్స్..
లాక్ డౌన్ కాలంలో ఎంతోమంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. మరికొంతమంది ఎంటర్టైన్మెంట్ వంటి అంశాలు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో జియో కొత్త ప్లాన్స్‌తో ముందుకు వస్తోంది. ఇంతకుముందు రూ.2,399 ప్లాన్‌లో 365 రోజుల కాలపరిమితితో రోజుకు 2GB డేటా తీసుకు వచ్చింది. ఇది లాంగ్ టర్మ్ ప్లాన్. ఇప్పటికే ఉన్న రూ.2,121 ప్లాన్‌ను కంటిన్యూ చేస్తోంది. ఈ ప్లాన్‌లో రోజుకు 1.5GB డేటా ఉంటుంది. ఇది 336 రోజుల కాలపరిమితితో ఉంటుంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications