బ్యాంకులలో చెక్కు మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆర్బీఐ త్వరలో కొత్త విధానం తీసుకు రానుంది. పాజిటివ్ పే పేరుతో దీనిని తీసుకు వస్తోంది. ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గవర్నర్ శక్తికాంతదాస్ ద్రవ్య విధాన కమిటీ (MPC) తీసుకున్న నిర్ణయాలను ప్రకటించారు. ఈ సందర్భంగా పాజిటివ్ పే ద్వారా చెక్కులకు మరింత సెక్యూరిటీ ఫీచర్స్ జోడిస్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు.

చెక్కు భద్రత కోసం పాజిటివ్ పే.. ఎలా పని చేస్తుంది
ఈ పాజిటివ్ పే విధానంలో చెక్కు జారీ చేసే వ్యక్తి, సంబంధిత లబ్ధిదారుడికి చెక్కు ఇచ్చే ముందు,ఆ చెక్క్ ఫోటో తీసి దానిని బ్యాంకు మొబైల్ యాప్‌లో అప్ లోడ్ చేస్తారు. ఈ పద్ధతిని రూ.50,000కు పైన ఉండే అన్ని చెక్కులకు వర్తింప చేస్తారు. పరిమాణం పరంగా 20 శాతం, వ్యాల్యూపరంగా 80 శాతం ఈ పరిధిలోకి రానున్నాయి. చెక్కు పరిమాణంతో సంబంధం లేకుండా 2016 నుండి ఐసీఐసీఐ బ్యాంకు ఈ సదుపాయాన్ని తీసుకు వచ్చింది.

డిపాజిట్ కంటే ముందే బ్యాంకుకు వివరాలు
పాజిటివ్ పే వంటి విధానం ద్వారా వినియోగదారు ఇచ్చిన చెక్కును లబ్ధిదారు తన ఖాతాలోకి డిపాజిట్ చేయడానికి ముందే బ్యాంకుకు ఆ చెక్కుకు సంబంధించిన వివరాలు తెలుస్తాయి. చెక్కు ఎవరి పేరు మీద, ఎంత మొత్తానికి జారీ చేశారనే విషయాలు తెలుస్తాయి. డబ్బులు బదలీ చేయడానికి ముందే ఆ వివరాలను ముందస్తుగా తనిఖీ చేసేందుకు ఈ పద్ధతి మంచి వెసులుబాటు అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. యాభై వేల రూపాయల కంటే ఎక్కువ మొత్తానికి జారీ చేసే చెక్కులన్నీ పాజిటివ్ పే పరిధిలోకి వస్తాయి. చెక్కు ట్రంకేషన్ సిస్టం (CTS) 2010 ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. చెక్కు మోసాలకు నిరోధకంగా ఉంటుంది.

CTS అంటే?
చెక్కులకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్‌ను ఫిజికల్ మూమెంట్ ప్రాతిపదికన కాకుండా కేవలం ఎలక్ట్రానిక్ రూపంలో జరిగేలా వీలు కల్పించే విధానాన్ని చెక్ ట్రంకేషన్ సిస్టమ్ (CTS) అంటారు. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే చెక్కు లావాదేవీల్లో ఎటువంటి మోసాలు జరగకుండా చూడడం, అలాగే అన్‌లైన్‌లో ఎలక్ట్రానిక్ ఇమేజ్డ్ ప్రాతిపదికన చెక్కులు వెంటనే క్లియరెన్స్ ఈ విధానం ప్రధాన ఉద్దేశం.

సెప్టెంబర్ నుండి తీసుకు వస్తామని..
చెక్ చెల్లింపుల్లో మరింత భద్రతను పెంచడానికి, చెక్కు ఫ్రాడ్స్ జరగకుండా ఉండేందుకు పాజిటివ్ పేను తీసుకు వస్తోంది ఆర్బీఐ. చెక్కులకు సంబంధించి మరింత సెక్యూరిటీ కోసం సెప్టెంబర్ నాటికి కొత్త విధానం తీసుకు వస్తామని ఆర్బీఐ గతంలోనే చెప్పింది. రూ.50వేలు, అంతకుమించిన చెక్కులపై పాజిటివ్ పేను ప్రవేశ పెట్టడమంటే మరింత భద్రత కల్పించడమని బ్యాంకు బజార్ డాట్ కామ్ సీఈవో ఆదిల్ శెట్టి అన్నారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications