2020-21 బడ్జెట్‌లో కస్టమ్స్ డ్యూటీ పెంచుతూ నిర్ణయం తీసుకున్నందున మార్చి నెల నుండి ధరలు పెంచేందుకు ఎయిర్ కండిషనర్, టెలివిజన్, రిఫ్రిజిరేటర్ తదితర కన్స్యూమర్ డ్యూరబుల్ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. దీంతో వినియోగదారులపై భారం పడనుంది. మొబైల్ ఫోన్ ధరలు కూడా పెరగనున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు ధరలు పెంచాయి.

రూ.1,300 వరకు పెంచిన ఆపిల్
ఆపిల్ సంస్థ తన ఐపోన్ మోడల్స్ iPhone 11 Pro, 11 Pro Max, iPhone 8 వంటి వాటిపై ఇప్పటికే రూ.600 నుండి రూ.1,300 వరకు పెంచింది. కస్టమ్స్ డ్యూటీ పెరుగుతున్న నేపథ్యంలో ధరలు పెంచింది.

3 నుండి 6 శాతం పెరుగుదల
రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు, ఎయిర్ కండిషన్స్ ధరలు ఈ నెల నుండి పెరగనున్నాయి. వీటి ధరలు 3 శాతం నుండి 6 శాతం వరకు పెరగనున్నాయి. అంటే ఎండాకాలం సందర్భంగా ఏసీలు, రిఫ్రిజిరేటర్లు కొనే వారిపై మరింత భారం పడనుంది.

పెంపుకు కారణాలు..
ఏసీలకు ఉపయోగించే మోటార్లు, కాంప్రెషర్ల పైన బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 2.5 శాతం పెంచారు. దీనికి తోడు కరోనా వైరస్ కారణంగా రవాణా ఖర్చులు పెరిగాయి. దీంతో ఆయా సంస్థలు తమ తమ ఉత్పత్తులపై ధరలను పెంచనున్నాయి.

వీటి ధరలు 10 శాతం పెంపు
వెన్న, జున్ను, ఫుడ్ గ్రైండర్, రూమ్ హీటర్స్, టీ, కాఫీ మేకర్స్, కిచెన్‌వేర్ తదితర వస్తువులపై ఈ బడ్జెట్‌లో కస్టమ్ సుంకాన్ని పెంచారు. బూట్లపై ఇంపోర్ట్ డ్యూటీని 20 శాతం వేశారు. ఈ నేపథ్యంలో వీటి ధరలు కూడా పెరగనున్నాయి. స్పోర్ట్స్ వేర్ బ్రాండ్ ప్యూమా ధరలు 10 శాతం మేర పెరగనున్నాయి. ఇవి ఏప్రిల్ నుండి పెరుగుతాయి.

అప్పటి దాకా పెంపు లేదు
ఇప్పటికే దిగుమతి చేసుకున్న వస్తువులపై తాము అధిక కస్టమ్స్ డ్యూటీ చెల్లించలేదని, కాబట్టి ప్రస్తుతానికి పెంచమని, ఈ స్టాక్ అయిపోయాక పెంచుతామని ప్యూమా ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అభిషేక్ గంగూలీ అన్నారు.

పెరిగిన కూల్ డ్రింక్స్ ధర
గోద్రేజ్ కన్స్యూమర్ ఉత్పత్తులు ఇప్పటికే 5 శాతం ధరలు పెంచాయి. పెప్సికో వంటి శీతల పానియాల సంస్థ కొన్ని వస్తువుల ధరలను సవరించింది. ఉదాహరణకు ఈ ఫుడ్ అండ్ బీవరేజ్ సంస్థ ఉత్తర ప్రదేశ్‌లో 750ml సాఫ్ట్ డ్రింక్ ధరను రూ.38 నుండి రూ.40కి పెంచింది. 1.25 లీటర్ ప్యాక్ ధరను కర్ణాటకలో రూ.60 నుండి రూ.65కు పెంచింది.

వీటి ధరలు కూడా...
FMCG మేజర్ పార్లే ఉత్పత్తులు, నెస్ట్లే ధరల పెరుగుదలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాయి. ముడిపదార్థాల ధరలు పెరుగుతున్నాయి. గత మూడు నెలలుగా గోధుమ, చక్కెర, ఎడిబుల్ ఆయిల్ సహా వివిధ వస్తువుల ధరలు 10 శాతం నుండి 20 శాతం మేర పెరిగాయి. జనవరిలో ద్రవ్యోల్భణం 7.59 శాతానికి పెరిగి 2014 మే తర్వాత గరిష్టానికి చేరుకుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications