New rules: బిగ్ అప్‌డేట్! పోస్టాఫీసు డిపాజిట్లు, విత్‌డ్రాల్స్‌పై కేంద్రం కొత్త రూల్స్.. పూర్తి వివరాలు!

భారతదేశంలోని చిన్న పొదుపు పథకాల వినియోగదారులకు ముఖ్య గమనిక. ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్ 2026 ప్రకారం, పోస్టాఫీసు పొదుపు వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇకపై పోస్టాఫీసులో ఖాతా తెరవాలన్నా లేదా నగదు లావాదేవీలు చేయాలన్నా పాన్ కార్డ్ (PAN) తప్పనిసరి చేస్తూ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.

Post Office Rules 2026 PAN Compulsory For Deposits Withdrawals Form 121 Introduced New Rules

పాన్ కార్డ్ ఎందుకు తప్పనిసరి?

కొత్త నిబంధనల ప్రకారం (Rules 159-237), అకౌంట్ ఓపెనింగ్, డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్ , టైమ్ డిపాజిట్లలో పెట్టుబడులకు పాన్ నంబర్ కోట్ చేయడం ఇప్పుడు మ్యాండేటరీ. అధిక విలువ కలిగిన లావాదేవీలను ట్రాక్ చేయడానికి, పారదర్శకతను పెంచడానికి , పన్ను ఎగవేతలను అరికట్టడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

మీ దగ్గర పాన్ కార్డ్ లేకపోతే?

ఒకవేళ మీ వద్ద పాన్ కార్డ్ లేకపోతే, మునుపటి 'ఫారమ్ 60' స్థానంలో ఇప్పుడు 'ఫారమ్ 97' (Form 97) సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో..

  • డిపాజిటర్ పేరు , చిరునామా
  • లావాదేవీ స్వభావం , మొత్తం
  • గుర్తింపును ధృవీకరించే సపోర్టింగ్ డాక్యుమెంట్లను జతచేయాలి. దీనివల్ల పాన్ లేని లావాదేవీలు కూడా పన్ను వ్యవస్థ పరిధిలోకి వస్తాయి.

15G, 15H స్థానంలో కొత్త 'ఫారమ్ 121'

వడ్డీ ఆదాయంపై TDS (Tax Deducted at Source) కట్ అవ్వకుండా ఉండేందుకు ఇప్పటివరకు మనం ఉపయోగించే ఫారమ్ 15G (60 ఏళ్ల లోపు వారికి) , 15H (సీనియర్ సిటిజన్లకు) స్థానంలో ఇప్పుడు ఒకే ఒక యూనిఫైడ్ ఫారమ్ 'ఫారమ్ 121' (Form 121) అందుబాటులోకి వచ్చింది.

  • ప్రతి ఆర్థిక సంవత్సరానికి ఒకసారి దీనిని సమర్పించాలి.
  • మీ అంచనా మొత్తం ఆదాయంపై పన్ను బాధ్యత 'సున్నా' (Nil) అయితేనే ఇది వర్తిస్తుంది.
  • ఈ ఫారమ్‌లను పోస్టాఫీసు ఏడేళ్ల పాటు రికార్డుల్లో భద్రపరుస్తుంది.

ఈ మార్పులు ఎప్పటి నుంచి?

పోస్టాఫీసు SB ఆర్డర్ నం. 02/2026 ప్రకారం, ఈ కొత్త నిబంధనలు (New rules) తక్షణమే అమల్లోకి వచ్చాయి. ప్రస్తుతానికి సిస్టమ్ అప్‌గ్రేడ్ అయ్యే వరకు పాత ఫారమ్‌లను తాత్కాలికంగా అనుమతించినప్పటికీ, కస్టమర్లు వీలైనంత త్వరగా కొత్త మార్గదర్శకాలకు అలవాటు పడటం మంచిది.

ఎందుకు ఈ నిర్ణయం?

సాంప్రదాయ పొదుపు మార్గాలను పన్ను పరిధిలోకి తీసుకురావడం ద్వారా ఆడిట్ ట్రయల్స్‌ను మెరుగుపరచడం ప్రభుత్వ లక్ష్యం. సామాన్య పొదుపుదారులకు డాక్యుమెంటేషన్ సులభతరం చేయడం , రికార్డుల డూప్లికేషన్‌ను తగ్గించడం దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం.

పోస్టాఫీసు పథకాల్లో మీ పెట్టుబడులు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగాలంటే కొత్త రూల్స్ (New rules) ప్రకారం వెంటనే మీ ఖాతాకు పాన్ కార్డ్ లింక్ చేసుకోండి. మీ వద్ద పాన్ కార్డ్ లేకపోతే వెంటనే దరఖాస్తు చేసుకోవడం లేదా 'ఫారమ్ 97' వంటి ప్రత్యామ్నాయాల గురించి పోస్టాఫీసు సిబ్బందిని సంప్రదించడం ఉత్తమం. అలాగే, టీడీఎస్ మినహాయింపు కోసం కొత్తగా ప్రవేశపెట్టిన 'ఫారమ్ 121'ను సరైన సమయంలో సమర్పించడం ద్వారా మీ వడ్డీ ఆదాయంపై అనవసరంగా పన్ను కట్ అవ్వకుండా జాగ్రత్తపడవచ్చు. కొత్త ఫారమ్‌లపై అవగాహన పెంచుకోవడం ద్వారా పన్ను సంబంధిత ఇబ్బందుల నుండి తప్పించుకోవచ్చు!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+