చాలామంది తమ కష్టార్జితాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. స్టాక్ మార్కెట్లలో పెడితే ఎప్పుడు మునుగుతుందో అన్న భయం, ఇంట్లో దాచి పెడితే ఎలాంటి లాభం ఉండదు. ఇలాంటి వారి కోసమే పోస్ట్ ఆఫీస్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (Post Office NSC) పథకాన్ని అందిస్తోంది. ఇది భారత ప్రభుత్వం మద్దతు ఉన్న పథకం కాబట్టి మీ పైసాకు ఢోకా ఉండదు. పూర్తిగా సేఫ్!

ఏమిటీ NSC పథకం?
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ అనేది ఒక ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ సేవింగ్స్ స్కీమ్. ఇది ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు, రిటైర్మెంట్ ప్లాన్ చేసుకునే వారికి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. దీని కాలపరిమితి 5 ఏళ్లు. మీరు ఇందులో ఒక్కసారి పెట్టుబడి పెడితే ఐదేళ్ల తర్వాత వడ్డీతో కలిపి ఒకేసారి భారీ మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు.
రూ. 4.5 లక్షల వడ్డీ ఎలా వస్తుంది?
ప్రస్తుతం ప్రభుత్వం ఈ పథకంపై 7.7% వార్షిక వడ్డీని అందిస్తోంది. ఈ వడ్డీ ప్రతి ఏటా చక్రవడ్డీ (Compound Interest) పద్ధతిలో యాడ్ అవుతుంది. ఉదాహరణకు ఒక ఇన్వెస్టర్ ఈ స్కీమ్‌లో రూ. 10 లక్షలు జమ చేశారనుకుందాం. ఐదేళ్ల మెచ్యూరిటీ కాలం ముగిసిన తర్వాత వారికి సుమారు రూ. 14.49 లక్షలు అందుతాయి. అంటే మీరు పెట్టిన పెట్టుబడి కాకుండా కేవలం వడ్డీ రూపంలోనే రూ. 4.49 లక్షలు లాభం పొందుతారు.
పెట్టుబడి పరిమితి మరియు అర్హతలు
- కనీస పెట్టుబడి: కేవలం రూ. 1,000 తో కూడా ఈ ఖాతా తెరవవచ్చు.
- గరిష్ట పరిమితి: ఇందులో పెట్టుబడి పెట్టడానికి ఎటువంటి గరిష్ట పరిమితి లేదు. మీ ఆర్థిక స్తోమతను బట్టి ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు.
- ఎవరు చేరవచ్చు: భారతీయ పౌరులు ఎవరైనా ఈ ఖాతా తెరవవచ్చు. వ్యక్తిగతంగా గానీ, లేదా ఇద్దరు ముగ్గురు కలిసి జాయింట్ అకౌంట్ గానీ ఓపెన్ చేయవచ్చు. 10 ఏళ్లు పైబడిన పిల్లల పేరు మీద కూడా ఈ సర్టిఫికేట్ తీసుకోవచ్చు. (NRIలు, HUFలు దీనికి అర్హులు కారు).
మీ పెద్దల పేరు మీద బ్యాంకులో డబ్బులు ఉన్నాయో లేదా తెలీదా? ఒక్క క్లిక్ తో చెక్ చేయండిలా..
పన్ను మినహాయింపు కూడా..
ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల కేవలం లాభమే కాదు, పన్ను ఆదా కూడా అవుతుంది. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C కింద ఏడాదికి రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. మీరు పొందే వడ్డీ తిరిగి పెట్టుబడిగా పరిగణించబడటం వల్ల ఈ ప్రయోజనం లభిస్తుంది. అయితే మెచ్యూరిటీ సమయంలో వచ్చే మొత్తంపై నిబంధనల ప్రకారం పన్ను వర్తిస్తుంది.
ఎలా అప్లై చేయాలి?
మీకు దగ్గరలోని ఏదైనా పోస్ట్ ఆఫీస్‌కు వెళ్ళి ఒక అప్లికేషన్ ఫారమ్ నింపి, కేవైసీ (KYC) పత్రాలు (ఆధార్, పాన్) సమర్పించి ఈ పోస్ట్ ఆఫీస్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (Post Office NSC) స్కీమ్ లో చేరవచ్చు. మీ డబ్బుకు పూర్తి భద్రతతో పాటు గ్యారెంటీ రిటర్న్స్ కావాలనుకుంటే NSC ని మించిన ఆప్షన్ మరొకటి లేదు. మరిన్ని వివరాలు కోసం.. పోస్ట్ ఆఫీస్ అఫీషియల్ వెబ్ సైట్ (indiapost.gov.in/banking-services/savings) ని విజిట్ చేయొచ్చు.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications