చాలామందికి వివిధ బ్యాంకుల్లో సేవింగ్స్ అకౌంట్లు ఉంటాయి. కొన్ని సార్లు ఒక ఊరి నుంచి మరో ఊరికి మారినప్పుడు లేదా పాత అకౌంట్లను వాడటం మానేసినప్పుడు వాటిలో ఉన్న బ్యాలెన్స్ ను మర్చిపోతుంటారు. మరికొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులు ఎవరైనా మరణిస్తే, వారి ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FD) లేదా ఇన్సూరెన్స్ సొమ్ము గురించి వారసులకు తెలియకుండా పోతుంది. ఇలా బ్యాంకుల్లో క్లెయిమ్ చేయకుండా పడి ఉన్న వేల కోట్ల రూపాయలను ప్రజలకు చేరవేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఉద్గమ్ (RBI UDGAM) అనే పోర్టల్ ను ప్రారంభించింది. UDGAM అంటే.. Unclaimed Deposits Gateway to Access Information అని అర్థం.

ఏమిటీ అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్?
సాధారణంగా ఏదైనా బ్యాంక్ ఖాతా లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్ 10 ఏళ్ల పాటు ఇనాక్టివ్ గా ఉంటే, ఆ డబ్బును 'అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్'గా పరిగణిస్తారు. ఇలాంటి సొమ్మును బ్యాంకులు ఆర్‌బీఐ ఆధ్వర్యంలోని 'డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్' (DEA) ఫండ్ కింద జమ చేస్తాయి. దేశవ్యాప్తంగా దాదాపు రూ. 42,000 కోట్లకు పైగా ఇలాంటి సొమ్ము బ్యాంకుల్లో క్లెయిమ్ చేయకుండానే ఉందని అంచనా.
ఉద్గమ్ (UDGAM) పోర్టల్ ఎలా పనిచేస్తుంది?
గతంలో ఈ వివరాలు తెలుసుకోవాలంటే ఒక్కో బ్యాంకు చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఉద్గమ్ పోర్టల్ ద్వారా అన్ని బ్యాంకుల్లోని వివరాలను ఒకే చోట తెలుసుకోవచ్చు.
- రిజిస్ట్రేషన్: మొదటగా మీరు ఉద్గమ్ అధికారిక వెబ్‌సైట్ లో మీ మొబైల్ నంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి.
- వివరాలు: మీ పేరు, పాన్ కార్డ్, ఓటర్ ఐడి లేదా డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ ఎంటర్ చేయాలి.
- సెర్చ్: మీరు ఎవరి పేరు మీద అయితే డబ్బు ఉందో లేదో తెలుసుకోవాలనుకుంటున్నారో వారి వివరాలు ఇచ్చి సెర్చ్ చేయాలి.
- రిజల్ట్స్: వెంటనే ఆ పేరు మీద ఏ బ్యాంకులో ఎంత అన్‌క్లెయిమ్డ్ అమౌంట్ ఉందో స్క్రీన్‌పై కనిపిస్తుంది.
డబ్బును తిరిగి పొందడం ఎలా?
ఉద్గమ్ (UDGAM) పోర్టల్ కేవలం సమాచారాన్ని మాత్రమే ఇస్తుంది. మీకు ఏదైనా బ్యాంక్ అకౌంట్లో డబ్బు ఉన్నట్లు తెలిస్తే, ఆ వివరాలతో సంబంధిత బ్యాంక్ బ్రాంచ్‌ను సంప్రదించాలి. అక్కడ మీరు క్లెయిమ్ ఫారమ్ నింపి డబ్బుని పొందొచ్చు. ఒకవేళ మరణించిన వారి అకౌంట్ లో డబ్బు ఉంటే మీరు వారసత్వ ధృవీకరణ పత్రాలు లేదా కేవైసీ (KYC) పత్రాలు సమర్పించి మీ డబ్బును వెనక్కి తీసుకోవచ్చు.
ఎందుకు ఇది ముఖ్యం?
చాలా కుటుంబాల్లో కష్టపడి సంపాదించిన డబ్బు అకౌంట్లలోనే ఉండిపోతోంది. దీని గురించి మొన్న ప్రధాని మోదీ కూడా ప్రస్తావించారు. ఆర్‌బీఐ తెచ్చిన ఈ UDGAM పోర్టల్ పారదర్శకతను పెంచడమే కాకుండా.. సామాన్యుల సొమ్మును వారికి చేరవేసేందుకు వారధిలా పనిచేస్తోంది. మీ ఇంట్లో పెద్దల పేరు మీద పాత బ్యాంక్ బుక్కులు ఏవైనా ఉంటే.. ఈరోజే ఈ పోర్టల్ ద్వారా ఒక్కసారి చెక్ చేయడం మంచిది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..



Click it and Unblock the Notifications