మీది పెళ్లైన జంటనా? రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేస్తున్నారా? అవును అంటే కనుక, అటల్ పెన్షన్ యోజన(APY) పథకాన్ని ఎంచుకుంటే మంచి రిటర్న్స్‌తో పాటు భద్రత ఉంటుంది. అటల్ పెన్షన్ యోజన కింద రెండు సపరేట్ అకౌంట్స్ ఓపెన్ చేసి, ఆ తర్వాత నెలకు రూ.10,000 ఆదాయం పొందవచ్చు. పన్ను కంటే దంపతులు అయితే తమ పెట్టుబడిపై ట్యాక్స్ బెనిఫిట్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
అటల్ పెన్షన్ యోజనను 2015లో ప్రారంభించారు. తమ భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవడానికి అసంఘటిత రంగంలోని వారికి ఊతమిచ్చేలా దీనిని ప్రారంభించారు. 18 నుండి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు ఎవరైనా అటల్ పెన్షన్ యోజన ద్వారా ఇన్వెస్ట్ చేయవచ్చు.

అటల్ పెన్షన్ యోజనలో చేరితే
మీకు బ్యాంకు లేదా పోస్టాఫీస్‌లో ఖాతా ఉంటే అటల్ పెన్షన్ యోజనలో చేరవచ్చు. పెట్టుబడిదారులకు అరవై ఏళ్ల తర్వాత నుండి పెన్షన్ రావడం ప్రారంభమవుతుంది.
ఈ పథకం కింద ఇన్వెస్ట్ చేసినవారు తమ పెట్టుబడి ప్రాతిపదికన నెలవారీ పెన్షన్‌ను రూ.1000, రూ.2000, రూ.3000, రూ.4000, రూ.5000 వరకు పొందవచ్చు.
అటల్ పెన్షన్ యోజనలో పెట్టుబడి పెట్టేందుకు ఆధార్ కార్డు నెంబర్, మొబైల్ నెంబర్ తప్పనిసరి.
పెట్టుబడిదారు ఈ పథకం కింద ఎంత త్వరగా పెట్టుబడి పెడితే అతడు లేదా ఆమె అంత ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు. ఒక వ్యక్తి 18 సంవత్సరాల వయస్సులో అటల్ పెన్షన్ యోజనలో చేరితే అరవై ఏళ్ల తర్వాత అతను లేదా ఆమె ప్రతి నెల రూ.5000 నెలవారీ పెన్షన్ పొందవచ్చు. ఇందు కోసం నెలకు రూ.210 డిపాజిట్ చేయాలి.

రూ.10వేలు రావాలంటే
30 కంటే తక్కువ వయస్సు ఉన్న దంపతులు రెండు సపరేట్ అటల్ పెన్షన్ యోజన అకౌంట్స్ తెరిచి, అరవై ఏళ్ల తర్వాత నెలకు రూ.10,000 పొందవచ్చు. అయితే వీరు తమ తమ అకౌంట్లలో రూ.577 ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లాలి.
ఒకవేళ భార్యా, భర్తల వయస్సు 35 అయితే కను వారు నెలకు రూ.902 ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడు గానీ అరవై ఏళ్ల తర్వాత నెలకు రూ.10,000 పెన్షన్ పొందుతారు.
సెక్షన్ 80సీ కింద ఏడాదికి రూ.1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనాలు ఉన్నాయి.

ఆస్తులు ఎంతంటే
ఇదిలా ఉండగా, ఎన్పీఎస్ పథకంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగుల పెన్షన్ నిధులతో పాటు ప్రయివేటు రంగం ఉద్యోగుల పెన్షన్ నిధులు ఎక్కువగా ఉంటాయి. అలాగే, పౌరులు ఎవరైనా ఎన్పీఎస్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఎన్పీఎస్ పరిధిలోని రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వరంగ ఉద్యోగుల ఆస్తులు 2022 జనవరి 1వ తేదీ నాటికి రూ.3,52,217 కోట్లుగా ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆస్తులు రూ.2,11,656 కోట్లుగా ఉన్నాయి. కార్పొరేట్ రంగం ఉద్యోగుల ఆస్తులు రూ.82,190 కోట్లుగా ఉన్నట్టు PFRDA విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పౌరుల విభాగంలోని ఆస్తులు రూ.28,657 కోట్లుగా ఉన్నాయి. ఈ రెండు పథకాలను PFRDA పర్యవేక్షిస్తుంటుంది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications