కొన్ని సందర్భాల్లో పలు క్రిప్టోకరెన్సీలు హఠాత్తుగా ఎగిసిపడుతున్నాయి. గతంలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్వీట్ చేసినప్పుడు షిబా ఇను, ఇటీవల ఎలానమిక్స్, అంతకుముందు ఆర్క్ గవర్నన్స్, హస్కీ, స్క్విడ్ వంటి డిజిటల్ కాయిన్స్ అప్పటికప్పుడు భారీగా లాభపడి వార్తల్లోకి వచ్చాయి. తాజాగా మరో క్రిప్టో లాభపడింది. గత ఐదారు రోజులుగా ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఆందోళన కలిగిస్తోన్న విషయం తెలిసిందే. నవంబర్ 24వ తేదీన సౌతాఫ్రికాలో దీనిని మొదటిసారి గుర్తించారు. ఆ తర్వాత వివిధ దేశాల్లో ఈ మహమ్మారి జాడలు కనిపించాయి. మరోవైపు, భారత్‌లో క్రిప్టో బిల్లు ఆందోళనతో డిజిటల్ కాయిన్స్ తీవ్రంగా నష్టపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో అప్పటి వరకు అస్పష్టంగా ఉన్న ఓ డిజిటల్ టోకెన్ ధర భారీగా పెరిగింది.

మూడ్రోజుల్లో రూ.5వేల నుండి రూ.52వేలకు
ట్విట్టర్ ఫీడ్‌లో వెయ్యి కంటే తక్కువ ఫాలోవర్లు కలిగిన ఈ డిజిటల్ టోకెన్ శుక్రవారం నుండి సోమవారం ఉదయం వరకు పది రెట్లు పెరిగింది. అంతకుముందు 75 శాతం పడిపోయిన ఈ టోకెన్ రెండు రోజుల్లో 688 డాలర్లకు చేరుకుంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేరియంట్ వార్తలపై గ్లోబల్ మార్కెట్లు గతవారం కుప్పకూలాయి. అయితే అదే పేరుతో కలిగిన ఒ క్రిప్టో కరెన్సీ జంప్ చేసింది. ఒమిక్రాన్ టోకెన్ ఏకంగా 900 శాతం లాభపడింది. గత వారం చివరలో ఇది దాదాపు 65 డాలర్ల వద్ద (దాదాపు రూ.4,883) వద్ద ఉంది. నవంబర్ 29 నాటికి ఇది 689 డాలర్లకు (దాదాపు రూ.51,765)కు చేరుకుంది. అంటే మూడ్రోజుల్లో 945 శాతం లాభపడింది. అంటే ఒమిక్రాన్ కంటే ముందు ఇన్వెస్ట్ చేసిన వారికి లేదా 27వ తేదీ వరకు ఇన్వెస్ట్ చేసిన వారికి ఇప్పుడు పది రెట్ల కంటే ఎక్కువ లాభం వస్తుంది.

ఇవి జంప్
ఇక బిట్ కాయిన్ గత శుక్రవారం దారుణంగా పతనమైంది. గత రెండు నెలల కాలంలో ఇది వరస్డ్ డే. ఓ సమయంలో ఎనిమిది శాతం నష్టపోయింది. స్కిడ్ గేమ్, డోజీకాయిన్, ఇతర మైనర్ క్రిప్టో కరెన్సీలు హఠాత్తుగా భారీగా లాభపడుతున్నాయి. తాజాగా ఒమిక్రాన్ లాభపడింది. అయితే దీనిని ఎప్పుడు లాంచ్ చేశారనే విషయం పక్కన పెడితే, కాయిన్ జెస్కో డేటాలో నవంబర్ 8వ తేదీ నుండి అందుబాటులో ఉంది.

ఈ క్రిప్టోపై దృష్టి సారించాలి
సాధారణంగా మనం ఎప్పటికీ బిట్ కాయిన్, ఎథేరియం, బియాన్స్ కాయిన్ వంటి క్రిప్టో పేర్లు వింటుంటాం. అయితే షిబా ఇను, ఎలానమిక్స్, ఆర్క్ గవర్నన్స్, హస్కీ, స్క్విడ్ వంటి డిజిటల్ కాయిన్స్ అప్పుడప్పుడు హఠాత్తుగా వెలుగులోకి వస్తున్నాయి. కేవలం బిట్కాయిన్, ఎథేరియం వంటివి మాత్రమే కాకుండా ఈ 15 క్రిప్టోల పైన కూడా అప్పుడప్పుడు దృష్టి సారించాలి. అవేమిటో తెలుసుకుందాం...
సోలానా, రిప్పిల్(XRP), పోల్కాడాట్(DoT), డోజీకాయిన్(DOGE), టెర్రా(LUNA), యూనిస్వాప్(UNI), బిట్ కాయిన్ క్యాష్(BCH), చైన్ లింక్(LINK), రాప్డ్ బిట్ కాయిన్(WBTC), లైట్ కాయిన్(LTC), ఫైల్ కాయిన్(FIL), ఎథేరియం క్లాసిక్(ETC), ఆవే(AAVE), డ్యాష్(DASH), ఆస్పెన్ కాయిన్(ASPD) ఉన్నాయి.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications