ప్రపంచంలో చాలా మంది యువతకు అమెరికాలో ఉద్యోగం చెయ్యాలని, అక్కడే నివసించాలని కలలు కంటారు. ముఖ్యంగా ఐటీ రంగం లేదా ప్రొఫెషనల్ ఉద్యోగాల కోసం అమెరికా వెళ్ళాలని అందరూ ఆశపడతారు. ప్రధాన కారణం అక్కడి డాలర్ జీతం. మామూలుగా చూసుకుంటే అమెరికా జీతాలు భారతదేశం జీతాల కంటే 4-5 రెట్లు ఎక్కువగా కనిపిస్తాయి. కానీ ఈ గణాంకాల వెనక దాగి ఉన్న నిజం చాలా మందికి తెలియదు. జీతం ఎంత ఉన్నా, అక్కడ జీవన ఖర్చులు కూడా దానికి సరిపడేలా పెరిగిపోతాయి. ఈ పోలికను దగ్గరగా పరిశీలించి ఎక్కడ బెటర్ లైఫ్ స్టైల్ జీవించగలం అనేది తెలుసుకుందాం.

అమెరికాలో ఒక సాధారణ ఐటీ ఉద్యోగి నెలకు సగటుగా $5,000-$8,000 (దాదాపు రూ.4.1-6.5 లక్షలు) సంపాదించవచ్చు. అదే స్థాయి ఉద్యోగి భారతదేశంలో రూ. 60,000-రూ. 1.5 లక్షల మధ్య జీతం వస్తుంది. మొదటిలో అమెరికా జీతం ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కానీ అక్కడి జీవన ఖర్చులు మన దేశంతో పోల్చితే 5-8 రెట్లు ఎక్కువ. ఉదాహరణకు, అమెరికాలో ఒక మధ్యస్థ నగరంలో కుటుంబంతో ఉండాలంటే ఇల్లు అద్దె రూ 1.6-2.5 లక్షలు, కిరాణా మరియు ఆహార ఖర్చులు రూ. 60,000-1.2 లక్షలు, రవాణా ఖర్చులు రూ. 40,000-80,000, హెల్త్‌కేర్ మరియు ఇన్సూరెన్స్ ఖర్చులు రూ.80,000-1.5 లక్షలు, ఇతర బిల్లులు మరియు ఎంటర్టైన్‌మెంట్ ఖర్చులు రూ. 40,000కి పైగా ఉండవచ్చు.
ఇక్కడ భారతదేశంలో జీవన ఖర్చులు చాలా తక్కువ. సిటీని బట్టి మారవచ్చు కానీ సగటుగా ఇల్లు అద్దె రూ10,000-40,000, కిరాణా ఖర్చులు రూ 8,000-20,000, రవాణా ఖర్చులు రూ 5,000-15,000, హెల్త్‌కేర్ రూ 2,000-5,000 మధ్యే ఉంటుంది. ఫలితంగా, భారతదేశంలో జీతం తక్కువైనా, సేవింగ్స్ రేటు అమెరికాతో పోల్చితే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. జీవన ప్రమాణ విషయానికి వస్తే, అమెరికాలో మౌలిక వసతులు, రోడ్లు, హెల్త్‌కేర్ సిస్టమ్, సిస్టమ్‌లో నిబంధనలు బలంగా ఉండటం వల్ల ఒక సిస్టమేటిక్ లైఫ్ ఉంటుంది. కానీ భారతదేశంలో కుటుంబం, సాంప్రదాయం, సపోర్ట్ సిస్టమ్, తక్కువ ఖర్చుతో లగ్జరీ జీవితం అనేవి పెద్ద ప్లస్ పాయింట్లు.
సేవింగ్స్ విషయంలో అమెరికాలో సగటు వ్యక్తి జీతం నుంచి 20-25% మాత్రమే సేవ్ చేయగలుగుతాడు. భారతదేశంలో తక్కువ ఖర్చుల కారణంగా 30-40% వరకు సేవ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ డాలర్లు సంపాదించడం మాత్రమే నిజమైన లాభం కాదు. మీరు ఎంత ఖర్చు చేస్తున్నారు, ఎంత సేవ్ చేస్తున్నారు, మీ జీవన విధానం ఎలా ఉంది. ఇవే అసలు నిర్ణయాత్మక అంశాలు.
MyLifeElsewhere వెబ్‌సైట్ అందించిన వివరాల ప్రకారం, భారతదేశంలో జీవన వ్యయం అమెరికాతో పోలిస్తే గణనీయంగా తక్కువగా ఉంటుంది. మొత్తం ఖర్చులు సుమారు 72.5% తక్కువ, రెస్టారెంట్లలో తినడానికి 81.3% తక్కువ, రవాణా ఖర్చులు 49.4% తక్కువ, హౌసింగ్ ఖర్చులు 88.6% తక్కువ, అలాగే చిన్నపిల్లల సంరక్షణ ఖర్చులు (చైల్డ్‌కేర్) అమెరికా కంటే 94.5% తక్కువగా ఉంటాయి. ఈ సంఖ్యలు ఒక ముఖ్యమైన విషయాన్ని చూపిస్తున్నాయి. అమెరికాలో జీతం ఎక్కువ ఉన్నా, అక్కడి జీవన వ్యయం కూడా అంతే ఎక్కువగా ఉండటంతో, చివరికి పొదుపు చేసే శాతం భారత్‌తో పోలిస్తే తక్కువగానే ఉంటుంది.
మొత్తానికి, అమెరికాలో జీతం ఎక్కువే కానీ ఖర్చులు కూడా అంతే ఎక్కువ. భారతదేశంలో జీతం తక్కువైనా, ఖర్చులు తక్కువగా ఉండటం వల్ల కొన్నిసార్లు డబ్బు ఎక్కువగా మిగులుతుంది. కాబట్టి "డాలర్ వర్సెస్ రూపాయి" పోలికలో అసలు నిజం మీరు ఎక్కడ ఉన్నా, మీరు ఎంత సేవ్ చేస్తారు, ఎలా జీవిస్తారు అనేదే మీ లాభంపై ఉంటుంది.
More From GoodReturns

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

హార్ముజ్ జలసంధిపై నీ పెత్తనమేంది.. అమెరికాపై విరుచుకుపడిన చైనా.. కారణం ఏంటంటే..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్



Click it and Unblock the Notifications