రూపాయి ట్యాక్స్ కట్టకుండా లక్షల్లో సంపాదించొచ్చు! చాలామందికి తెలియని సీక్రెట్ ట్రిక్ ఇదే!
పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి లాభాలు సాధించాలంటే దానికి మ్యూచువల్ ఫండ్స్ ఒక్కటే సేఫ్ అండ్ బెస్ట్ ఆప్షన్ అని నిపుణులు సూచిస్తుంటారు. అయితే మ్యూచువల్ ఫండ్స్ (Mutual funds) పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు ఆర్జించినప్పటికీ.. ఆ లాభాలపై కూడా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ (Capital Gains Tax) చెల్లించాల్సి వస్తుంది. కానీ, ఒక సింపుల్ ట్రిక్ ఉపయోగించడం ద్వారా ఈ ట్యాక్స్ కూడా తగ్గించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
మ్యూచువల్ ఫండ్స్ (Mutual funds) పెట్టుబడుల ద్వారా వచ్చే లాభాలపై ట్యాక్స్ ఉంటుంది. కానీ చట్టబద్ధంగా ఆ ట్యాక్స్ మొత్తాన్ని సున్నా (Zero Tax)కి తగ్గించుకోవచ్చని మీకు తెలుసా? సెబీ (SEBI) ఆమోదించిన ఒక సాధారణ ట్రిక్ ద్వారా ఇది సాధ్యమవుతుంది. చాలా మంది భారతీయ పెట్టుబడిదారులు దీని గురించి తెలియక లేదా ఉపయోగించక అధిక పన్నులు చెల్లిస్తున్నారు.
అసలు ట్రిక్ ఇదే..
ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) నిబంధనల ప్రకారం.. మీరు మీ మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను బంధువులకు బహుమతిగా ఇవ్వవచ్చు. అంటే గిఫ్ట్ (Gift)గా అన్నమాట. ఇలా ఇచ్చిన ఫండ్స్ కు ట్యాక్స్ ఉండదు. ఈ ఒక్క ట్రిక్ ను వాడడం ద్వారా చాలా సందర్భాల్లో మీ ట్యాక్స్‌ను సున్నాకు తగ్గించుకోవచ్చు.

ఈ ట్రిక్ ఎలా పనిచేస్తుంది?
1. తక్కువ ఆదాయం ఉన్నవారికి బదిలీ: మీరు అధిక లాభాలతో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను తక్కువ లేదా అసలు ఆస్తి లేని మీ కుటుంబ సభ్యుడికి లేదా బంధువుకు బహుమతిగా ఇవ్వొచ్చు. ఉదాహరణకు, గృహిణులు, విద్యార్థులు, లేదా రిటైర్ అయిన వారు. అటువంటి వారికి ఆదాయం తక్కువగా ఉంటుంది. అలాంటి వారికి ఇవ్వొచ్చు.
2. తక్కువ పన్ను పరిధి: కొత్త పన్ను విధానం (New Tax Regime) ప్రకారం.. సంవత్సరానికి రూ. 2.5 లక్షల వరకు ఉన్న లాభాలపై పన్ను సున్నాగా ఉంటుంది. ఒకవేళ ఆ బంధువు మొత్తం ఆదాయం తక్కువగా ఉంటే.. కొన్ని సందర్భాల్లో రూ. 12 లక్షల వరకు కూడా లాభం పన్ను రహితంగా (Tax Free) ఉండే అవకాశం ఉంది.
3. హోల్డింగ్ పీరియడ్ భద్రత: మీరు మీ ఫండ్స్ యూనిట్లను బహుమతిగా ఇచ్చినా.. మీ అసలు హోల్డింగ్ పీరియడ్ (Holding Period) అలాగే కొనసాగుతుంది. అంటే ఆ బంధువు ఫండ్స్ ను వెంటనే అమ్మివేసినా అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్(Long-Term Capital Gain) గానే పరిగణించబడుతుంది. కాబట్టి ప్రాబ్లమ్ ఉండదు.
ఈ ట్రిక్ ఎందుకు పవర్‌ఫుల్?
- సున్నా పన్నుతో లాభాల బుకింగ్: దీర్ఘకాలిక పెట్టుబడిదారులు తమ పాత స్థానాల నుంచి దాదాపు సున్నా ట్యాక్స్‌తో బయటకు రావచ్చు.
- కుటుంబ పన్ను ప్రణాళిక: కుటుంబ సభ్యులు చట్టబద్ధంగా లాభాలను పంచుకోవడం ద్వారా మొత్తం కుటుంబం యొక్క ట్యాక్స్‌ను సమర్థవంతంగా తగ్గించుకోవచ్చు.
- సులభమైన ప్రక్రియ: దీనికి పెద్దగా పేపర్ వర్క్ వంటిది కూడా అవసరం లేదు. మీ AMC లేదా బ్రోకర్‌కు ఒక సాధారణ ట్రాన్స్‌ఫర్ రిక్వెస్ట్ ఇస్తే సరిపోతుంది.
అయితే ట్యాక్స్ బెనిఫిట్ పొందాలంటే.. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం అర్హతగల బంధువులకు మాత్రమే బహుమతిగా ఇవ్వాలి. అలాంటి బంధువులకు ఇచ్చే బహుమతులు (Gifts) పూర్తిగా పన్ను రహితం. మీరు అమ్ముకోవాలని అనుకున్న పాత, దీర్ఘకాలిక మ్యూచువల్ ఫండ్స్ నుంచి అధిక ట్యాక్స్ పడకుండా లాభాలను బుక్ చేసుకోవడానికి ఈ ట్రిక్ చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది.


Click it and Unblock the Notifications