తమ పిల్లలు ప్రయోజకులు కావాలని, వారికి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు రాకూడదని ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది. కానీ, పెరుగుతున్న కాలేజీ ఫీజులు, పెళ్లి ఖర్చులు చూస్తుంటే కాస్త భయం వేయడం సహజం. అయితే మీ పిల్లలను కోటీశ్వరులను చేయడం అంత పెద్ద విషయమేమీ కాదు. సరైన ప్లాన్ తో పిల్లలు పెద్దయ్యే లోపే రూ. కోటి సమకూర్చొచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
పిల్లలను కోటీశ్వరులను చేయాలంటే దానికి కావాల్సింది భారీ పెట్టుబడులు కాదు, కేవలం 'సమయం' అలాగే 'క్రమశిక్షణ'. మీరు కేవంల నెలకు రూ. 6000తోనే రూ. కోటి నిధిని సమకూర్చుకోవచ్చు. ఇలాంటి సీక్రెట్ ను బ్యాంకులు మీకు చెప్పవు. మీకు మీరుగానే తెలుసుకోవాలి.

ఇంతకీ ప్లాన్ ఏంటంటే..
కేవలం నెలకు రూ. 6,000 పొదుపు చేస్తూ మ్యూచువల్ ఫండ్స్ (mutual funds) లేదా ఇతర ప్రభుత్వ పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీ బిడ్డ భవిష్యత్తును ఎలా సెటిల్ చేయవచ్చో ఇప్పుడు చూద్దాం.
1. ఉన్నత చదువుల కోసం (Higher Education)..
మీ బిడ్డకు 18 ఏళ్లు వచ్చేసరికి పైచదువుల కోసం భారీ మొత్తం అవసరమవుతుంది. దీనికోసం మీరు 'HDFC Children's Gift Fund' వంటి చిల్డ్రన్ స్పెసిఫిక్ మ్యూచువల్ ఫండ్స్ (mutual funds) ఎంచుకోవచ్చు.
- పెట్టుబడి: నెలకు రూ. 6,000
- టెన్యూవర్: 18 ఏళ్లు
- మొత్తం పెట్టుబడి: రూ. 13 లక్షలు
- రిటర్న్స్: 12% (అంచనా)
- మెచ్యూరిటీ అమౌంట్: సుమారు రూ. 43 లక్షలు.
2. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్లాన్ (Post Graduation)
ఒకవేళ మీ బిడ్డ విదేశాల్లో చదవాలన్నా లేదా పీజీ చేయాలన్నా 22 ఏళ్ల వయసులో కొంత డబ్బు కావాలి. దీనికోసం సేఫ్టీ ఉండే Gold Mutual Funds లో ఇన్వెస్ట్ చేయొచ్చు.
- పెట్టుబడి: నెలకు రూ. 6,000
- టెన్యూవర్ : 22 ఏళ్లు
- రిటర్న్స్: 10% (అంచనా)
- మెచ్యూరిటీ అమౌంట్: సుమారు రూ. 54 లక్షలు.
3. పెళ్లి లేదా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ (The Crorepati Plan)
అన్నిటికంటే ముఖ్యమైనది.. మీ బిడ్డను కోటీశ్వరుడిని చేసే ప్లాన్. దీనికోసం రిస్క్ తీసుకునే సామర్థ్యం ఉండాలి. దీనికోసం మీరు ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ (Flexi Cap mutual funds) లో పెట్టుబడి పెట్టాలి.
- పెట్టుబడి: నెలకు రూ. 6,000
- టెన్యూవర్: 25 ఏళ్లు
- మొత్తం పెట్టుబడి: రూ. 18 లక్షలు
- రిటర్న్స్: 14% (అంచనా)
- మెచ్యూరిటీ అమౌంట్: అక్షరాలా రూ. 1.40 కోట్లు!
4. ఆడపిల్లల కోసం సుకన్య సమృద్ధి (SSY)
మీకు ఆడపిల్ల ఉంటే ప్రభుత్వం అందించే 'సుకన్య సమృద్ధి యోజన' ఒక గొప్ప ఆప్షన్. ఇందులో 8.2% ఫిక్స్‌డ్ వడ్డీ లభిస్తుంది. నెలకు రూ. 6,000 చొప్పున 15 ఏళ్లు కడితే, పాపకు 21 ఏళ్లు వచ్చేసరికి సుమారు రూ. 33 లక్షలు అందుతాయి.
ఇలా వీటిలో ఏ ప్లాన్ తో అయినా మీరు మీ పిల్లల కోసం భారీ నిధిని సమకూర్చొచ్చు. బిడ్డ పుట్టిన వెంటనే మీరు పెట్టుబడి మొదలుపెడితే, కాంపౌండింగ్ (Compounding) మ్యాజిక్ వల్ల చిన్న మొత్తం కూడా కోట్లుగా మారుతుంది. మీరు మీ పిల్లలకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఖరీదైన గ్యాడ్జెట్లు లేదా బొమ్మలు కాదు.. సరైన సమయంలో మొదలుపెట్టిన పెట్టుబడి మాత్రమే! కాబట్టి ఆలస్యం చేయకుండా మీకు నచ్చిన స్కీమ్ లో పెట్టుబడి పెట్టండి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్‌డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications