For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎల్ఐసీ 2 యూనిట్ లింక్డ్ పాలసీలు.. ప్రయోజనాలు ఏమిటంటే?

|

భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసి) చాలా కాలం తర్వాత ఒకేసారి రెండు కొత్త యూనిట్ లింక్డ్ ప్లాన్లను విడుదల చేసింది. వాటిలో ఒకదాని పేరు ఎల్ఐసి 'నివేశ్ ప్లస్' ప్లాన్ కాగా రెండో దాని పేరు ఎల్ఐసి 'ఎస్ఐఐపీ'. ఇటు జీవిత బీమా తో పాటు అటు పెట్టుబడి పెట్టాలన్న ఉద్దేశ్యం ఉన్న వారు ఈ పాలసీలను కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ రెండు ప్లాన్ల ఫీచర్లు ఏమిటో తెలుసుకుంటే దేన్ని ఎంచుకోవాలన్న దానిపై మీరే నిర్ణయం తీసుకోవచ్చు.

3 నెలలు EMI కట్టక్కర్లేదు, క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించాలా? 8 కీలక అంశాలు తెలుసుకోండి3 నెలలు EMI కట్టక్కర్లేదు, క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించాలా? 8 కీలక అంశాలు తెలుసుకోండి

నివేశ్ ప్లస్

నివేశ్ ప్లస్

* ఇది సింగిల్ ప్రీమియం ప్లాన్. నాన్ పార్టిసిపేటింగ్, యూనిట్ లింక్డ్, ఇండివిడ్యువల్ లైఫ్ ఇన్సూరెన్సు ప్లాన్.

* పాలసీ దారు కనీస వయసు : 90 రోజులు గరిష్ట వయసు 35 సంవత్సరాలు

* మెచ్యూరిటీ వయసు : 18 సంవత్సరాలు, గరిష్ట వయసు 50 సంవత్సరాలు/ 85 సంవత్సరాలు ( ఎంచుకున్న లైఫ్ కవర్ ప్రకారం )

* పాలసీ కాల పరిమితి 10-25 సంవత్సరాలు.

* పాలసీ కాలంలో ఇది బీమాతో పాటు పెట్టుబడి అవకాశాన్ని కూడా కల్పిస్తుంది.

* ఇందులో నాలుగు ఫండ్ ఆప్షన్స్ ఉన్నాయి. అవి : బాండ్, సెక్యూర్డ్, బ్యాలన్సుడ్, గ్రోత్. ఏడాది కాలంలో నాలుగు సార్లు ఈ ఫండ్ ఆప్షన్స్ లో మార్పులు చేర్పులు చేసుకోవచ్చు.

* ఐదేళ్ల తర్వాత పాక్షికంగా ఉపసంహరణ చేసుకోవచ్చు.

* సమ్ అష్యుర్డ్ లో సింగిల్ ప్రీమియం కన్నా 1.25 రేట్లు లేదా సింగిల్ ప్రీమియం కన్నా 10 రేట్లు ఎక్కువ ఉండే ఆప్షన్ లను ఎంచుకోవచ్చు.

* ఎంపిక చేసుకున్న ఫండ్ రకాన్ని బట్టి కేటాయించిన ప్రీమియం, గ్యారంటీడ్ ఆడిషన్లను యూనిట్ల కొనుగోలుకు వినియోగిస్తారు.

* కనీస ప్రీమియం రూ . 1,00,000. గరిష్ట ప్రీమియం పై పరిమితి లేదు.

ఎస్ఐఐపీ

ఎస్ఐఐపీ

* ఇది రెగ్యులర్ ప్రీమియం, నాన్ పార్టిసిపేటింగ్, యూనిట్ లింక్డ్, ఇండివిడ్యువల్ లైఫ్ ఇన్సూరెన్సు ప్లాన్.

* ఇది బీమాతో పాటు పెట్టుబడి సదుపాయాన్ని అందిస్తోంది.

* ఎంత ప్రీమియం చెల్లించాలన్న దాన్ని పాలసీ దారు ఎంచుకోవచ్చు.

* పాలసీకి అర్హత : కనీస వయసు 90 రోజులు, గరిష్ట వయసు 65 ఏళ్ళు.

* మెచ్యూరిటీ వయసు : 18 సంవత్సరాలు. గరిష్ట వయసు 85 సంవత్సరాలు.

* పాలసీ కాల పరిమితి : 10-25 సంవత్సరాలు.

* కేటాయించిన ప్రీమియం తో పాటు గ్యారంటీడ్ ఆడిషన్స్ ను ఎంపిక చేసుకున్న ఫండ్ రకం యూనిట్లను కొనుగోలు చేయడానికి వినియోగిస్తారు.

* 55 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న వారికీ అందిస్తున్న బేసిక్ సమ్ అస్యూరెన్స్ వార్షిక ప్రీమియం కన్నా 10 రేట్లు, 55 ఏళ్ళు అంతకు మించిన వయసున్న వారికీ 7 రేట్లు ఎక్కువ ఉంటుంది.

వార్షికంగా..

వార్షికంగా..

* వార్షికంగా కనీస ప్రీమియం 40,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. నెలవారీగా 4,000 రూపాయల నుంచి ప్రారంభించవచ్చు. గరిష్ట ప్రీమియం పై పరిమితి లేదు.

* నాలుగు రకాల ఫండ్స్ ను ఎంచుకోచ్చు. వాటిలో బాండ్, సెక్యూర్డ్, బ్యాలన్సుడ్, గ్రోత్ ఫండ్స్ ఉంటాయి.

* రిటర్న్ లను పెంచుకోవడానికి ఏడాదిలో నాలుగు సార్లు ఫండ్ అప్షన్లను మార్చుకోవచ్చు.

* మెచ్యూరిటీ తర్వాత యూనిట్ ఫండ్ విలువకు సమానమైన మొత్తాన్ని చెల్లిస్తారు.

* ఐదేళ్ల తర్వాత పాక్షికంగా కొంత సొమ్ము ఉపసంహరించుకోవడానికి అనుమతి ఇస్తారు. రెండు ప్లాన్లలోనూ ఈ సదుపాయం ఉంది.

* ఈ రెండు ప్లాన్లు ఆఫ్ లైన్ లోనే కాకుండా ఆన్ లైన్ లోను కొనుగోలు చేయవచ్చు.

English summary

ఎల్ఐసీ 2 యూనిట్ లింక్డ్ పాలసీలు.. ప్రయోజనాలు ఏమిటంటే? | LIC launches two unit linked plans

Life insurance corporation of India recently lanuched two unit liked plans. The plans are Lic's Nivesh Plus and Lic's SIIP.
Story first published: Monday, March 30, 2020, 20:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X