హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే మీకో శుభవార్త. కరోనా మహమ్మారి కారణంగా ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించడంతో వివిధ బ్యాంకులు కూడా హోమ్ లోన్ సహా వివిధ వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. తాజాగా ఎల్ఐసీ హోమ్ లోన్ కొనుగోలుదారులకు సూపర్ వడ్డీ రేటు ఇస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ ప్రయోజనం కొంతమందికి మాత్రమే. సిబిల్ స్కోర్ ఆధారంగా వడ్డీ రేటు పెద్ద మొత్తంలో తగ్గించింది.

800 లోపు సిబిల్ స్కోర్ ఉంటే కొత్తవారికి 7.5 శాతం వడ్డీ రేటు
మార్టగేజ్ రుణాలు అందించే దేశంలో అతిపెద్ద సంస్థల్లో ఒకటి ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (LICHFL). హోమ్ లోన్ తీసుకోవాలనుకునే వారికి వడ్డీ రేటును ఏకంగా 60 బేసిస్ పాయింట్లు తగ్గించి 7.5 శాతంగా నిర్ణయించింది. అయితే ఇందుకు సిబిల్ స్కోర్ 800కు పైన ఉండాలి. అదీ కొత్త వారికి మాత్రమే ఈ తక్కువ వడ్డీ రేటు రుణాలు అందించనుంది. ఈ మేరకు గురువారం ప్రకటన చేసింది.

కొత్తగా ఇంటిని కొనుగోలు చేస్తే మరింత ప్రయోజనం
కరోనాతో ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు నిధుల లభ్యతను పెంచడానికి ఆర్బీఐ తీసుకున్న చర్యల్లో భాగంగా ఎల్ఐసీ కస్టమర్లకు తక్కువ వడ్డీకే రుణాలు అందించాలని నిర్ణయించినట్లు కంపెనీ ఎండీ, సీఈవో సిద్దార్థ మెహంతి వెల్లడించారు. ఇక కొత్తగా ఇంటిని కొనుగోలు చేసేవారికి అదనంగా 10 బేసిస్ పాయింట్ల తక్కువ వడ్డీకే రుణాలు అందించడంతో వడ్డీరేటు 7.4 శాతానికి తగ్గనుంది. ఇప్పటికే తీసుకున్న లేదా కొత్త సింగిల్ టర్మ్ బీమా పాలసీని రుణ ఖాతాకు అనుసంధానించే కస్టమర్లకు మరో 10 బేసిస్ పాయింట్లు తగ్గించి 7.4 శాతానికి అందిస్తున్నట్లు తెలిపారు.

రుణగ్రహీత మరణిస్తే టర్మ్ పాలసీ భద్రత
తమకు కూడా తక్కువ వ్యయానికి నిధులు వస్తున్నాయని, ఈ ప్రయోజనాలను ఖాతాదారులకు అందించాలని నిర్ణయించామని, ఈ రంగంపై కస్టమర్లకు తిరిగి నమ్మకం కలిగేందుకు ఇది దోహదం చేస్తుందని సిద్ధార్థ మెహంతీ అన్నారు. ఇక పాలసీదారుడు అనుకోకుండా మరణిస్తే టర్మ్ పాలసీ ఆ రుణ భారాన్ని పూర్తిగా భరిస్తుంది. కాగా, వివిధ బ్యాంకులు ఇప్పటికే హోమ్ లోన్ వడ్డీ రేట్లను తగ్గించాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications