బంగారం ధరలు ఇటీవల భారీగా తగ్గుతున్నాయి. గోల్డ్ ఫ్యూచర్స్ ఏకంగా రూ.46,000 దిగువకు పడిపోయింది. నిన్న రూ.45,500 స్థాయిలో ముగిసింది. ఓ వైపు బంగారం ధరలు తగ్గుతూ కొనుగోలుదారుల్లో సంతోషాన్ని నింపుతుండగా, జ్యువెల్లర్స్ కూడా మంచి ఆఫర్ ఇస్తున్నారు. కరోనా వైరస్ మహమ్మారి నుండి పరిస్థితులు చక్కబడుతున్నాయి. ఆర్థిక కార్యకలాపాలు పుంజుకొని, రికవరీ పుంజుకుంటోంది. దీంతో దేశంలో బంగారం డిమాండ్ వేగంగా పుంజుకుంటోంది. పండుగ సీజన్ రాక నేపథ్యంలో ధరలు మళ్లీ పెరిగే అవకాశముంది. కరోనా కారణంగా బంగారం దుకాణాలకు వెళ్లి కొనుగోలు చేయడం కాస్త తగ్గింది. పెట్టుబడులు పెట్టేవారు ఆన్‌లైన్ ద్వారా పసిడిని కొనుగోలు చేస్తున్నారు. ఆభరణాల యజమానులు కూడా జ్యువెల్లరీని ఆన్‌లైన్ ద్వారా విక్రయిస్తుండటంతో కొనుగోలుదారులు తమ పంథాను మార్చారు. ఆన్ లైన్ మార్గంలోనే సదరు జ్యువెల్లరీని పరిశీలించి కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు జ్యువెల్లరీ సంస్థలు తక్కువ ధర నుండి బంగారాన్ని విక్రయిస్తున్నాయి.

ఆన్ లైన్ అమ్మకం
తనిష్క్ జ్యువెల్లర్స్, కళ్యాణ్ జ్యువెల్లర్స్, పీసీ జ్యువెల్లర్స్ లిమిటెడ్, సెంకో గోల్డ్ అండ్ డైమండ్స్ ఆన్‌లైన్ ద్వారా బంగారాన్ని విక్రయిస్తున్నాయి. పైగా రూ.100కే బంగారాన్ని అందిస్తున్నాయి. దీంతో చాలామంది కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తున్నారు. నేరుగా వెబ్‌సైట్ లేదా డిజిటల్ గోల్డ్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఈ సంస్థలు ఆన్‌లైన్ విక్రయాలు చేపడుతున్నాయి. అయితే, కనీసం ఒక గ్రాము బంగారానికి సరిపడా డబ్బు చెల్లించగానే డెలివరీ చేస్తున్నారు. మొబైల్ వ్యాలెట్లు, ఆగ్మంట్ గోల్డ్ ఫర్ ఆల్, సేఫ్ గోల్డ్ వంటివి ఇప్పటికే ఆన్ లైన్ ద్వారా బంగారాన్ని విక్రయిస్తున్నాయి. కానీ జ్యువెల్లరీ సంస్థలు ఆన్ లైన్ విక్రయానికి మొదట తడబడినప్పటికీ, కరోనా సమయంలో తమ పంథాను మార్చుకున్నాయి.

పండుగ.. ధరల తగ్గుదల... కొనుగోళ్లు పెరుగుతాయి
బంగారం ధరలు ఇటీవలి వరకు రూ.50,000 వద్ద ఉన్నాయి. 2021 ఈ మార్కు వద్దే ప్రారంభమైంది. ఆ తర్వాత రూ.44,000 దిగువకు పడిపోయినప్పటికీ మళ్లీ రూ.48,000 దరికి చేరాయి. థర్డ్ వేవ్ ప్రభావం లేదనే వాదనలు రావడం, ఆర్థిక రికవరీ కనిపించడంతో బంగారం ధరలు కాస్త తగ్గుతున్నాయి. ప్రస్తుతం రూ.46,000 దిగువనే ట్రేడ్ అవుతున్నాయి. పండుగ సమయంలో బంగారం కొనుగోళ్లు ఎక్కువ. ఇలాంటి సమయంలో ధరలు తగ్గడం కొనుగోలుదారులకు కాస్త ఊరట అని చెప్పారు. బంగారం ధర తగ్గడంతో కొనుగోలుదారులతో పాటు.. ధరలు తగ్గిన నేపథ్యంలో కొనుగోళ్లు పెరుగుతాయని విక్రయదారులు కూడా కోటి ఆశలతో ఉన్నారు.

డిజిటల్ బంగారం దిశగా
పండుగ సీజన్ ప్రారంభమైంది. దీంతో భారత్‌లో పసిడి విక్రయాలు క్రమంగా పెరుగుతున్నాయి. యువకులు డిజిటల్ బంగారం వైపు చూస్తున్నారు. దీంతో ఆన్‌లైన్‌లో విక్రయాలు పెరిగాయి. గత ఏడాది ఫిబ్రవరి తర్వాత ఆన్‌లైన్ విక్రయాలు 200 శాతం పెరిగినట్లు అంచనా. ముఖ్యంగా రూ.3,000-4,000 మధ్య ఉండే నాణేలు, బిస్కట్స్ పైన ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. బంగారం పైన క్రమబద్దమైన పెట్టుబడులు పెట్టాలని వినియోగదారులు ఆసక్తి కనబరుస్తున్నారని, ప్రత్యేకించి యువతలో కొత్త ఆసక్తి కనిపిస్తోందని కళ్యాణ్ జ్యువెల్లర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేష్ కళ్యాణరామన్ అన్నారు.
More From GoodReturns

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!



Click it and Unblock the Notifications