ITR Sahaj Form: ఐటీఆర్ సహజ్ ఫైలింగ్ అర్హత, ప్రాసెస్
వేతనం, వన్ హౌస్ ప్రాపర్టీ నుండి, ఇతర ఆదాయాలు, వ్యవసాయం నుండి రూ.5,000 వరకు ఆర్జించే వారు ITR 1 ఫామ్‌ను ఫైల్ చేయాలి. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే సమయంలో పాన్, ఆధార్ కార్డు వివరాలు తప్పనిసరిగా అందించాలి. పన్ను చెల్లింపుదారుల ఆదాయాన్ని బట్టి ఆదాయ పన్ను శాఖ అందుకు అనుగుణంగా ఐటీఆర్ ఫామ్స్‌ను జారీ చేసింది. అంటే మీరు మీ ఆదాయ వనరు ప్రకారం ఐటీఆర్ ఫామ్స్‌ను ఎంచుకొని, పైల్ చేయాలి. చాలామంది ఐటీఆర్ సహజ్ ఫారంను దాఖలు చేస్తారు. దీని గురించి తెలుసుకుందాం...

ఐటీఆర్ ఫామ్ 1 దాఖలు ఎవరు చేస్తారంటే
శాలరీ సహా వివిధ ఆదాయాల ద్వారా రూ.50 లక్షల వరకు ఆర్జించే పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్ 1 ఫామ్‌ను దాఖలు చేస్తారు. వన్ హౌస్ ప్రాపర్టీ నుండి ఆదాయం వచ్చే వారు దాఖలు చేస్తారు. గత ఏడాది నుండి లోటును ముందుకు తీసుకు వెళ్లే పరిస్థితుల్లో తప్ప. వేతనం లేదా పెన్షన్ నుండి ఆదాయం వస్తున్న వారు ఐటీఆర్ సహజ్‌కు అర్హులు. లాటరీ విన్నింగ్ లేదా హార్స్ రేసింగ్ నుండి మినహాయించి ఇతర ఆదాయం కలిగిన వారు. మైనర్ లేదా భార్య ఆదాయాన్ని కూడా కలిపితే వారి ఆదాయ వనరు పైన పేర్కొన్న విధంగా ఉంటేనే ఐటీఆర్1 సమర్పిస్తారు.

అర్హులు వీరే
లాటరీ, పందెం, వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయం సంపాదించే వ్యక్తికి ఐటీఆర్ సహజ్ ఫామ్‌కు అర్హత ఉండదు. అలాంటి ఆదాయం రూ.50 లక్షల కన్నా తక్కువ ఉన్నప్పటికీ ఐటీఆర్ 2 ఫామ్‌ను దాఖలు చేయాలి. క్యారీ ఫార్వర్డ్ లాస్ ఉన్న వ్యక్తి కూడా ఐటీఆర్ సహజ్ ఫామ్‌కు అర్హత లేదు.రూ.50 లక్షల వరకు ఆదాయం ఉన్న వారు దీనిని సమర్పిస్తారు.

ఐటీఆర్ ఫామ్
కన్సల్టెంట్‌గా పని చేస్తోన్న పెన్షన్‌దారులు ఐటీఆర్ - 3 లేదా ఐటిఆర్ - 4 ఫామ్‌ను దాఖలు చేయాలి. ఎందుకంటే వారి ఆదాయాన్ని వృత్తి లేదా వ్యాపారం నుండి వచ్చిన ఆదాయంగా పరిగణిస్తారు. పన్ను చెల్లింపుదారుకు వ్యవసాయ ఆదాయం రూ.5000 వరకు ఉంటే ఐటిఆర్- సహజ్ ఫామ్‌ను దాఖలు చేయవచ్చు. అయితే, వ్యవసాయ ఆదాయం రూ.5,000 పైన ఉంటే పన్ను చెల్లింపుదారు ఐటీఆర్ సహజ్ ఫామ్‌కు అర్హత పొందడు.


Click it and Unblock the Notifications