టాక్స్ రిఫండ్ త్వరగా రావాలా? అయితే వెంటనే ఈ 6 పద్ధతుల్లో మీ ఐటీఆర్ కన్ఫర్మ్ చేసుకోండి!
అసెస్‌మెంట్ ఇయర్ (AY) 2026-27 కు సంబంధించి మీరు ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేశారా? అబ్బా.. ఎలాగోలా లాస్ట్ డేట్ లోపు ఐటీఆర్ (ITR) సబ్మిట్ చేసేశాం కదా అని రిలాక్స్ అయిపోకండి. ఎందుకంటే, కేవలం ఐటీఆర్ ఫైల్ చేస్తే సరిపోదు, దాన్ని 'ఈ-వెరిఫికేషన్' (e-verification) చేయడం చాలా ముఖ్యం. ఒకవేళ మీరు రిటర్న్స్ ఫైల్ చేసి, వెరిఫై చేయకుండా వదిలేస్తే.. మీరు అసలు ఐటీఆరే ఫైల్ చేయనట్లుగా ఆదాయ పన్ను శాఖ భావిస్తుంది. దీనివల్ల మీ రిటర్న్ ఇన్వాలిడ్ అయిపోతుంది.

30 రోజుల డెడ్‌లైన్.. మిస్ అయితే పెనాల్టీలు!
కొత్త రూల్స్ ప్రకారం, మీరు ITR ఫైల్ చేసిన 30 రోజులలోపు ఖచ్చితంగా ఈ-వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి. ఒకవేళ ఈ టైమ్ దాటిపోతే మీ రిటర్న్ రద్దవుతుంది. దీనివల్ల టాక్స్ బెనిఫిట్స్ కోల్పోవాల్సి రావడం, రీఫండ్ రావడం ఆలస్యం అవ్వడం, లేట్ ఫైలింగ్ ఛార్జీలు పడటం లేదా ఐటీ డిపార్ట్‌మెంట్ నుండి నోటీసులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు బెంగళూరులోని సీపీసీ (CPC) ఆఫీస్‌కు ఫిజికల్ కాపీలు పంపాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లోనే ఇన్స్టంట్‌గా వెరిఫై చేసుకునే 6 ఈజీ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అవేంటో చూద్దాం.
1. ఆధార్ ఓటీపీ (Aadhaar OTP) ద్వారా..
ఇది అన్నింటికంటే ఈజీ పద్ధతి. మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ లింక్ అయి ఉండాలి.
- ఇన్కమ్ టాక్స్ పోర్టల్‌లోకి లాగిన్ అయ్యి, 'e-Verify Return' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- 'Generate Aadhaar OTP' సెలెక్ట్ చేసుకుంటే, మీ ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే పని పూర్తవుతుంది.
2. నెట్ బ్యాంకింగ్ (Net Banking) తో..
- మీ బ్యాంక్ అకౌంట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లోకి లాగిన్ అవ్వండి.
- అక్కడ ట్యాక్స్ సర్వీసెస్ సెక్షన్‌లో 'Income Tax e-Filing' ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే అది మిమ్మల్ని నేరుగా ఐటీ పోర్టల్‌కు తీసుకెళ్తుంది. అక్కడ పెండింగ్ రిటర్న్‌ను సెలెక్ట్ చేసి వెరిఫై చేయవచ్చు.
3. బ్యాంక్ అకౌంట్ లేదా డీమ్యాట్ అకౌంట్ EVC ద్వారా..
టాక్స్ పోర్టల్‌లో మీ బ్యాంక్ అకౌంట్ లేదా డీమ్యాట్ (Demat) అకౌంట్ ముందే వాలిడేట్ అయి ఉంటే, వాటి ద్వారా ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్ (EVC) జనరేట్ చేసుకోవచ్చు. మీ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఈ కోడ్‌ను ఎంటర్ చేసి రిటర్న్‌ను కన్ఫర్మ్ చేయొచ్చు.
4. బ్యాంక్ ఏటీఎం (ATM) ద్వారా..
మీ బ్యాంక్ ఏటీఎం కార్డును మిషన్‌లో ఉంచి, పిన్ నెంబర్ ఎంటర్ చేశాక 'Generate EVC for Income Tax Filing' ఆప్షన్ ఎంచుకోవాలి. అప్పుడు మీ ఫోన్‌కు వచ్చే కోడ్‌ను ఐటీ పోర్టల్‌లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
5. డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ (DSC)
మీకు వాలిడ్ డిజిటల్ సిగ్నేచర్ ఉంటే, ఐటీ పోర్టల్‌లో డీఎస్‌సీ యుటిలిటీ ద్వారా అథెంటికేషన్ పూర్తి చేసి సబ్మిట్ చేయవచ్చు.
ఆన్‌లైన్ కుదరకపోతే ఫిజికల్ కాపీ పంపండి!
ఒకవేళ పైన చెప్పిన ఆన్‌లైన్ పద్ధతులు ఏవీ వర్కవుట్ కాకపోతే, మీ ITR సబ్మిట్ చేశాక వచ్చే 'ITR-V' ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, బ్లూ ఇంక్ పెన్‌తో సంతకం చేసి.. బెంగళూరులోని 'సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్ (CPC), ఆదాయపన్ను శాఖ, పోస్ట్ బాక్స్ నెం. 1, ఎలక్ట్రానిక్ సిటీ పోస్ట్ ఆఫీస్, బెంగళూరు - 560500' అడ్రస్‌కు ఆర్డినరీ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా పంపవచ్చు.


Click it and Unblock the Notifications