దేశవ్యాప్తంగా ఆన్ లైన్ ద్వారా నగదు లావాదేవీలు భారీ స్థాయిలో జరుగుతున్నాయి. ఈ లావాదేవీలు జరగడానికేకాకుండా పెరగడానికి నెఫ్ట్ (నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్), ఐఎంపీఎస్ (ఇమ్మీడియేట్ పేమెంట్ సర్వీస్), ఆర్టీజీఎస్ (రియల్ టైం గ్రాస్ సెటిల్మెంట్) వ్యవస్థలు దోహదపడుతున్నాయి. వీటిని మరింత ఎక్కువ మంది వినియోగించుకునే విధంగా ఆర్బీఐ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా వీటి ద్వారా లావాదేవీలను నిర్వహించే కాలంపై ఉన్న పరిమితులను సడలించారు.
ఈ మూడు విధానాల ద్వారా నగదు బదిలీ జరుగుతోంది. వీటిలో దేని ప్రత్యేకత దానిదే. ఇంతకు ముందు ఐఎంపీఎస్ ద్వారా నగదు బదిలీ రియల్ టైం లో జరిగేవి. నెఫ్ట్ లావాదేవీల నిర్వహణపై కొన్ని పరిమితులు ఉండేవి. ఐఎం పీఎస్ మాదిరిగా నెఫ్ట్ కూడా ఇప్పుడు 24 గంటలు అందుబాటులోకి వచ్చింది. ఈ రెండు కూడా కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా సేవలను అందిస్తున్నాయి.

ఎంత బదిలీ చేయవచ్చంటే....
* చిన్న మొత్తంలో ఆన్ లైన్ ద్వారా నగదు బదిలీ చేయడానికి ఐఎంపీఎస్ విధానం ఉపయోగపడుతుంది. దీని ద్వారా గరిష్టంగా రెండు లక్షల రూపాయలు బదిలీ చేయవచ్చు. ఎంత తక్కువ మొత్తాన్నయినా బదిలీ చేయవచ్చు.
* నెఫ్ట్ ద్వారా అయితే గరిష్ట మొత్తం బదిలీ పై ఎలాంటి పరిమితి లేదు. దీని ద్వారా పెద్ద మొత్తంలో నగదును ఎప్పుడయినా బదిలీ చేయడానికి అవకాశం ఉంటుంది.
* యూపీఐ లేదా ఐఎంపీఎస్ ల కన్నా ఎక్కువ మొత్తంలో లావాదేవీలను జరపడానికి అవకాశం ఉంటుంది.

చార్జీలు
* ఈ జనవరి నుంచి నెఫ్ట్, ఆర్టీ జీఎస్ లావాదేవీలపై ప్రాసెసింగ్ చార్జీలను ఎత్తివేస్తున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. ప్రకటించింది. డిజిటల్ లావాదేవీలకు ప్రోత్సాహం కల్పించే చర్యల్లో భాగంగా ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
* నెఫ్ట్ ద్వారా మరొకరికి ఇంటర్నెట్ బ్యాంకింగ్ తో నగదు బదిలీ చేయాలంటే ముందు వారి ఖాతా నెంబర్ను జత చేసుకోవాల్సిఉంటుంది. ఇందుకోసం వారికి సంభందించిన బ్యాంక్ ఖాతా వివరాలతో పాటు ఐఎఫ్ ఎస్ సి కోడ్ నెంబర్ అవసరం ఉంటుంది. అయితే పెద్ద మొత్తంలో నగదు బదిలీ చేయాలంటే ఈ విధానం సరియైనది.

ఐఎంపీఎస్ పై చార్జీలు
* ఐఎంపీఎస్ పై చార్జీలు అమలవుతున్నాయి. ఈ చార్జీలు నగదు బదిలీ చేసే మొత్తం పై ఆధారపడి ఉంటాయి. బదిలీ చేసే సొమ్మును బట్టి రూపాయి నుంచి పాతిక రూపాయలవరకు బ్యాంకులు చార్జీలను వసూలు చేస్తాయి. అయితే ఈ చార్జీలను ఎత్తివేస్తే డిజిటల్ లావాదేవీలు మరింతగా పుంజుకోవడానికి అవకాశం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.
* ఐఎంపీఎస్ ద్వారా మొబైల్ ఫోన్ వినియోగదారులు ప్రతిసారీ బ్యాంక్ వివరాలను ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. మొబైల్ మనీ ఐడెంటి ఫయర్ ద్వారా నగదు బదిలీ చేయవచ్చు. దీన్నీ బ్యాంకు నుంచి పొందవచ్చు. అప్పుడు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ను ఉపయోగించి నగదు బదిలీ చేయవచ్చు. ఐ ఎం పీ ఎస్ లో ఖాతా నెంబర్ తో పాటు ఐఎఫ్సి కోడ్ ను ఎంటర్ చేసి వెంటనే నగదు బదిలీ చేయవచ్చు.
* ఇక ఆర్టీజీఎస్ ను భారీ మొత్తంలో ఇంటర్ బ్యాంక్ నగదు బదిలీ కోసం వినియోగిస్తుంటారు.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications