ఆసుపత్రిలో చేరినప్పుడు ఖర్చుల భారం మనమీద పడకుండా కాపాడేందుకు ఆరోగ్య బీమా దోహదపడుతుందన్న విషయం తెలిసిందే. ఇందుకోసం మనం బీమా పాలసీ తీసుకునే సమయంలో తగినంత ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఏటా పాలసీని రెన్యూవల్ చేసుకోవాలి. అప్పుడు ఆస్పత్రిలో అయ్యే ఖర్చును మొత్తం బీమా కంపెనీయే చెల్లిస్తుంది. మనం ఏమాత్రం చెల్లించాల్సిన అవసరం ఉండదు. అయితే ప్రీమియం భారం తగ్గించుకోవడానికి కొత్త మంది కో-పే సదుపాయాన్ని ఎంచుకుంటారు. దీన్ని ఎంచుకున్నప్పుడు వైద్య ఖర్చుల్లో కొంత బీమా పాలసీ తీసుకున్న వారు చెల్లించాల్సి వస్తుంది. ఇది కో-పే క్లాజును బట్టి ఉంటుంది. మిగతా మొత్తం బీమా కంపెనీ చెల్లిస్తుంది.
న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ, ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్సు, ఓరియంటల్ ఇన్సూరెన్స్ తదితర కంపెనీలు కో-పే క్లాజ్ లతో తమ పాలసీలను అందుబాటులోకి తెచ్చాయి. విభిన్న రకాల సేవలు, ఔషధాలు, చికిత్స, వైద్య సదుపాయాన్ని బట్టి కో-పే మొత్తం నిర్దిష్టంగా ఉంటుంది. కో-పే క్లాజు ప్రకారం అంటే పది లేదా ఇరవై శాతం అని ఉంటే వైద్య ఖర్చు లో ఈ మొత్తాన్ని పాలసీదారు చెల్లించాల్సి ఉంటుంది.

కో- పే క్లాజ్ ఎందుకంటే?
బీమా కంపెనీలు కో- పే క్లాజును కలిగి ఉండటానికి కారణాలున్నాయి. బీమా ఉంది కదా అని కొంత మంది తమకు ఏ మాత్రం అనారోగ్యం కలిగినా ఆస్పత్రిలో చేరతారు. దీనివల్ల బీమా కంపెనీలపై భారం పడటానికి అవకాశం ఉంటుంది. కో-పే నిబంధన ఉండటం వల్ల తాము కూడా కొంత చెల్లించాల్సి వస్తుందని భావించి ఆస్పత్రిలో చేరే ముందు కాస్త ఆలోచిస్తారు. దీనివల్ల అటు బీమా కంపెనీపై ఇటు పాలసీ దారుపై ప్రభావం తగ్గుతుంది. ముఖ్యంగా ఆరోగ్య బీమా పాలసీల దుర్వినియోగం తగ్గడానికి అవకాశం ఉంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
* కో-పే ఉన్నందువల్ల ఖరీదైన ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య తగ్గుతుంది.
* ఆరోగ్య బీమా పాలసీలను అనవసరంగా వాడకుండా నిజాయితీగా వాడేందుకు అవకాశం ఉంటుంది.
* కో- పే వల్ల బీమా కంపెనీలకు రిస్క్, ఆర్ధిక భారం తగ్గుతుంది. ఆమేరకు ఆయా కంపెనీలకు ప్రయోజనం కలుగుతుంది.

ప్రతికూలతలు
* బీమా కంపెనీలు విక్రయించే అన్ని పాలసీల్లో కో-పే క్లాజ్ ఉండదు. బీమా పాలసీదారు, కంపెనీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కంపెనీలు నిర్ణయాలు తీసుకుంటాయి.
* ఒక వేళ కో- పే మొత్తం ఎక్కువగా ఉంటే బీమా తీసుకున్న వారిపై ఎక్కువ భారం పడుతుంది. బీమా తీసుకోవడం వల్ల ప్రయోజనం లేకుండా పోతుంది.
* కో-పే నిబంధన ఉన్న పాలసీలు ఎక్కువగా ఆదరణ ఉండదని మార్కెట్ వర్గాలు చెబుతుంటాయి.
* కో-పే అంటే బీమా తీసుకునే సమయంలో తక్కువ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందన్న మాట. అందుకే కొంత మంది ప్రీమియం తక్కువ ఉంటుందని కో- పే కు ప్రాధాన్యం ఇస్తారు. దీని వల్ల ప్రీమియం మొత్తం మిగులుతుంది. అయితే ఏమైనా జరిగి ఆస్పత్రిలో చేరితే మాత్రం ప్రీమియం ల ద్వారా అదా చేసుకున్న మొత్తం చికిత్స ఖర్చులకు చెల్లించాల్సి వస్తుంది.

కో- పే ఎంచుకోవాలా వద్దా?
మంచి ఆరోగ్యంతో ఉండటమే కాకుండా ఇంతకు ముందు ఎలాంటి వ్యాధులు లేని వారు, భవిష్యత్తులో ఎలాంటి వ్యాధులు రావడానికి అవకాశం లేని వారు కో- పాలసీలను ఎంచుకోవచ్చు. దీనివల్ల ప్రీమియం భారం తగ్గుతుంది. ఒకవేళ అనారోగ్యంతో బాధపడే వారు అయితే ప్రీమియం ఎక్కువ ఉన్నా సరే రెగ్యులర్ పాలసీ తీసుకోవడం మంచిదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications