Free credit card: గూగుల్ పే అదిరిపోయే ఆఫర్! యూజర్లకు ఫ్రీ క్రెడిట్ కార్డ్! ఎలా పొందాలంటే..
స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి మొబైల్‌లో గూగుల్ పే (Google Pay) వంటి పేమెంట్ యాప్స్ కచ్చితంగా ఉంటాయి. అయితే ఇప్పటివరకు కేవలం బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బులు పంపడానికి లేదా బిల్లులు చెల్లించడానికి మాత్రమే దీనిని వాడేవాళ్లం. కానీ ఇప్పుడు గూగుల్ కంపెనీ యాక్సిస్ బ్యాంక్‌తో జతకట్టి తన మొట్టమొదటి కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డు (credit card) ను భారత్ లో లాంచ్ చేసింది. దీని పేరు "గూగుల్ పే ఫ్లెక్స్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్" (Google Pay Flex Axis Bank Credit Card). దీన్ని పొందాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.

ఈ క్రెడిట్ కార్డ్ ప్రత్యేకత ఏంటి?
ఈ కార్డు సాధారణ క్రెడిట్ కార్డుల కంటే భిన్నంగా ఉంటుంది. ఇది పూర్తిగా డిజిటల్ కార్డు.
- UPI లింకింగ్: ఇది రూపే (RuPay) నెట్‌వర్క్‌పై పనిచేస్తుంది. కాబట్టి మీరు ఈ కార్డును నేరుగా మీ గూగుల్ పే యాప్‌లో యూపీఐకి లింక్ చేయవచ్చు. అంటే మీ దగ్గర డబ్బులు లేకపోయినా క్రెడిట్ కార్డు ద్వారా ఏదైనా షాపులో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేయవచ్చు.
- ఇన్‌స్టంట్ రివార్డ్స్: సాధారణంగా కార్డులపై వచ్చే రివార్డ్స్ నెల చివరలో లేదా స్టేట్‌మెంట్ వచ్చాక క్రెడిట్ అవుతాయి. కానీ, ఇందులో ప్రతి ట్రాన్సాక్షన్‌కు ఇన్‌స్టంట్‌గా 'స్టార్స్' (Stars) రూపంలో రివార్డ్స్ లభిస్తాయి. 1 స్టార్.. 1 రూపాయికి సమానం.
- మీరు కూడా తరచుగా గూగుల్ పే వాడుతుంటే.. ఈ కొత్త డిజిటల్ క్రెడిట్ కార్డు ఫీచర్ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తక్కువ ఖర్చుతో, సులభంగా క్రెడిట్ పొందాలనుకునే వారికి ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.
క్రెడిట్ కార్డ్ ఎలా అప్లై చేయాలి? (How to Apply)
ఈ కార్డ్ కోసం మీరు ఏ బ్యాంక్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. కేవలం మీ మొబైల్‌లోని గూగుల్ పే యాప్ ద్వారా నిమిషాల్లో అప్లై చేసుకోవచ్చు.
- ముందుగా మీ మొబైల్‌లో Google Pay యాప్‌ని ఓపెన్ చేయండి.
- యాప్ కింది భాగంలో ఉండే 'Money' సెక్షన్‌కు వెళ్లి, అక్కడ కనిపిస్తున్న 'Credit Cards' లేదా 'Get Flex' బ్యానర్‌పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు 'Apply Now' బటన్ నొక్కి, మీ వ్యక్తిగత వివరాలు (PAN కార్డ్, ఉద్యోగం, ఆదాయం వంటివి) ఎంటర్ చేయండి.
- మీ ఆధార్, పాన్ కార్డ్ ఉపయోగించి Digital KYC ప్రక్రియను పూర్తి చేయండి.
- అన్ని వివరాలు సరిగ్గా ఉంటే, బ్యాంక్ మీ అప్లికేషన్‌ను పరిశీలించి నిమిషాల్లోనే అప్రూవల్ ఇస్తుంది.
- అప్రూవల్ రాగానే మీ Digital Credit Card యాక్టివేట్ అవుతుంది. దానిని మీ యూపీఐ (UPI) కి లింక్ చేసుకుని వెంటనే వాడటం మొదలుపెట్టవచ్చు.
- ఈ కార్డు కొంతమంది యూజర్లకు అందుబాటులో ఉండకపోవచ్చు. ఒకవేళ మీకు యాప్‌లో 'Apply' ఆప్షన్ కనిపించకపోతే.. మీరు Waitlist లో చేరవచ్చు. త్వరలోనే మీకు నోటిఫికేషన్ వస్తుంది.
మెస్సీకి రూ. 11 కోట్ల గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ! ఈ వాచ్ ప్రత్యేకత తెలిస్తే షాక్ అవుతారు!
పోటీలో ఇతర కంపెనీలు
గూగుల్ పే మాత్రమే కాదు, ఇప్పటికే ఫిన్‌టెక్ రంగంలో ఉన్న పేటీఎం (Paytm), ఫోన్ పే (PhonePe) వంటి సంస్థలు కూడా ఇలాంటి క్రెడిట్ కార్డు (credit card) లను మార్కెట్లోకి తెచ్చాయి.
1. PhonePe: హెచ్‌డిఎఫ్‌సి (HDFC) బ్యాంక్‌తో కలిసి ఫోన్ పే 'అల్టిమో' (Ultimo), 'యూనో' (Uno) అనే కార్డులను అందిస్తోంది. వీటి ద్వారా షాపింగ్, బిల్లుల చెల్లింపులపై భారీ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
2. Paytm: పేటీఎం కూడా హెచ్‌డిఎఫ్‌సీ, ఎస్బీఐ (SBI) బ్యాంకుల భాగస్వామ్యంతో క్రెడిట్ కార్డులను ఇస్తోంది. ముఖ్యంగా మూవీ టికెట్లు, ట్రావెల్ బుకింగ్స్‌పై ఇవి మంచి ఆఫర్లు ఇస్తాయి.


Click it and Unblock the Notifications