ప్రపంచ ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ గురించి పరిచయం అక్కర్లేదు. అలాగే భారతీయ బిజినెస్ టైకూన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ గురించి కూడా మనందరికీ తెలిసిందే. ఇటీవల మెస్సీ భారత్‌కు వచ్చినప్పుడు.. అనంత్ అంబానీ తన వంటారా (Vantara) ప్రాజెక్టును సందర్శించిన మెస్సీకి ఒక అరుదైన బహుమతిని ఇచ్చారు. అది చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.

ఏంటా గిఫ్ట్? దాని ధర ఎంత?
అనంత్ అంబానీ ఫుట్‌బాల్ స్టార్ మెస్సీకి ఒక అల్ట్రా-రేర్ లగ్జరీ వాచ్‌ను బహుమతిగా ఇచ్చారు. ఇప్పుడు ఆ వాచ్ గురించే ఇంటర్నెట్ లో చర్చ జరుగుతోంది. ఈ వాచ్ కేవలం ప్రత్యేకమైనదే కాదు, చాలా అరుదైనది కూడా. ఈ వాచ్ పేరు RM 003-V2 GMT Tourbillon "Asia Edition". ఇది ప్రముఖ లగ్జరీ బ్రాండ్ 'రిచర్డ్ మిల్లే' (Richard Mille) కి చెందింది. దీని ధర అక్షరాలా రూ. 10.91 కోట్లు ఉంటుందని అంచనా. ఈ వాచ్ అంత స్పెషల్ ఎందుకు అంటే.. ఇలాంటి వాచీలు ప్రపంచవ్యాప్తంగా కేవలం 12 మాత్రమే తయారు చేశారు. అంటే ప్రపంచంలో ఈ వాచ్ ఉన్న అతికొద్ది మందిలో మెస్సీ ఒకరన్నమాట!
ఈ వాచ్ ప్రత్యేకతలు ఇవే!
ఈ రూ. 11 కోట్ల వాచ్ బ్లాక్ కార్బన్ కేసింగ్‌తో లోపల ఉన్న మెకానిజం మొత్తం కనిపించేలా 'స్కెలెటనైజ్డ్ డయల్' (Skeletonised dial) తో ఉంటుంది. ఇందులో టూర్‌బిలాన్ (Tourbillon), GMT ఫంక్షన్ వంటి అత్యంత సంక్లిష్టమైన మెకానిక్స్ ఉన్నాయి. చాలా తక్కువ బరువు ఉండటం, చూడటానికి ఎంతో స్టైలిష్‌గా ఉండటం ఈ వాచ్ ప్రత్యేకత.
అనంత్ అంబానీ దగ్గర ఉన్న వాచ్ ధర ఎంత?
మెస్సీకి 11 కోట్ల వాచ్ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ.. అదే సమయంలో తను కూడా ఒక ఖరీదైన వాచ్ ధరించి కనిపించారు. అది RM 056 Sapphire Tourbillon. దీని ధర సుమారు 5 మిలియన్ డాలర్లు.. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. 45.59 కోట్లు! అంబానీ ఫ్యామిలీకి లగ్జరీ వాచీలంటే ఎంత ఇష్టమో దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు.
మెస్సీ లగ్జరీ వాచ్ కలెక్షన్ ఇదే..
కేవలం అనంత్ అంబానీ ఇచ్చిన వాచ్ మాత్రమే కాదు, మెస్సీ దగ్గర ఇప్పటికే కళ్ళు చెదిరే వాచ్ కలెక్షన్ ఉంది.
- Rolex Cosmograph Daytona "Le Mans": ఇది 18 క్యారెట్ల పసిడితో చేసిన వాచ్.
- Patek Philippe Nautilus: దీని ధర కూడా కోట్లలోనే ఉంటుంది.
- వీటితో పాటు ఆడిమర్స్ పిగ్యుట్ (Audemars Piguet), రోలెక్స్ GMT-మాస్టర్ II వంటి అనేక ఖరీదైన వాచీలు కూడా మెస్సీ దగ్గర ఉన్నాయి.
ఏదేమైనా భారతీయ ఆతిథ్యానికి, అంబానీ రేంజ్ లగ్జరీకి ఈ గిఫ్ట్ ఒక నిదర్శనంగా నిలిచింది. ఫుట్‌బాల్ కింగ్ కు, బిజినెస్ కింగ్ కొడుకు ఇచ్చిన ఈ సర్ ప్రైజ్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.


Click it and Unblock the Notifications