పసిడి కొనుగోలు చేసేవారికి కాస్త ఊరట. ఇటీవల స్వల్పంగా పెరుగుతూ వచ్చిన ధరలు నేడు (డిసెంబర్ 7, మంగళవారం) మళ్లీ తగ్గాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో ఈ రోజు ప్రారంభ సెషన్‌లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.68,000 తగ్గి రూ.47,846 వద్ద, ఏప్రిల్ ఫ్యూచర్స్ రూ.13 నష్టపోయి రూ.48,099 వద్ద ముగిసింది. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.59 క్షీణించి రూ.61,211 వద్ద, మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.61,825 వద్ద ట్రేడ్ అయింది.
అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు నేటి సెషన్లో స్వల్పంగా క్షీణించాయి. గోల్డ్ ఫ్యూచర్స్ 1 డాలర్ మేర తగ్గి 1778 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.037 డాలర్లు పెరిగి 22.297 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.బంగారం ధరలు క్రితం సెషన్‌లో దాదాపు స్థిరంగా ఉన్నాయి. నిన్నటి సెషన్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.47,917 వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ రూ.61,223 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రితం సెషన్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 1779 డాలర్లు, సిల్వర్ ఫ్యూచర్స్ 22.263 డాలర్ల వద్ద ముగిసింది.

వివిధ నగరాల్లో బంగారం ధరలు
బంగారం ధరలు వివిధ నగరాల్లో ఇలా ఉన్నాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రూ.51,170, ముంబైలో రూ.47,510, చెన్నైలో రూ.49,180, కోల్‌కతాలో రూ.49,800గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ఢిల్లీలో రూ.46,910, ముంబైలో రూ.46,510, చెన్నైలో రూ.45,080, కోల్‌కతాలో రూ.47,100గా ఉంది.
ఢిల్లీలో వెండి కిలో రూ.65,600, ఢిల్లీ, ముంబై నగరాల్లో రూ.61,500, కోల్‌కతా రూ.61,500, బెంగళూరులో రూ.61,500, హైదరాబాద్‌లో రూ.65,600గా ఉంది.

కొనుగోలు చేయవచ్చు.. కానీ
షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్లు ఎవరైనా ఉంటే ప్రస్తుత స్మాల్ డిప్స్‌సో బంగారాన్ని లాంగ్ టైమ్ కోసం కొనుగోలు చేయవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ట్రేడర్లు కింది టెక్నికల్ లెవల్స్‌ను పరిగణలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఫిబ్రవరిగోల్డ్ ఫ్యూచర్స్ మద్దతు ధర రూ.47,750, ఆ తర్వాత రూ.47,500. నిరోధకస్థాయి రూ.48,050, ఆ తర్వాత రూ.48,200.
సిల్వర్ మద్దతు ధర రూ.60,600, ఆ తర్వాత రూ.60,000, నిరోధకస్థాయి రూ.62,000, ఆ తర్వాత 63,000.

నిరోధకస్థాయి
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ప్రస్తుతం 1778 డాలర్ల వద్ద ఉంది. మొదటి నిరోధకస్థాయి 1792 డాలర్లు. ఈ మార్కును క్రాస్ చేస్తే 1800 డాలర్లను దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ 1771 డాలర్ల స్థాయికి పడిపోతే మరింత క్షీణించి డిసెంబర్ 2 నాటి కనిష్టం 1762 స్థాయికి పడిపోయే అవకాశాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో ఈ రేటును దాటడం ఖాయం అంటున్న నిపుణులు..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తీవ్రమవుతున్న ఇరాన్ యుద్ధం

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలకు కొత్త సవాల్.. బిట్ కాయిన్ ఈటీఎఫ్‌ల ముందు వేస్ట్ అంటున్న నిపుణులు.. కారణం ఏంటంటే..

Gold silver: బంగారం, వెండి కొనేవారికి అలర్ట్.. ఈ వారం ధరలు ఎలా ఉండబోతున్నాయి? నిపుణుల అంచనా ఇదే!

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

Silver: వెండి ధర కిలో రూ.2 లక్షల కంటే కిందకు పడిపోదా? నిపుణులు ఏమంటున్నారు?



Click it and Unblock the Notifications