బంగారం, వెండి ధరలు నేడు (జూన్ 23) స్వల్పంగా పెరిగాయి. యూఎస్ ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పోవెల్ తాజాగా స్పందిస్తూ వడ్డీ రేట్లను అప్పుడే పెంచబోమని స్పష్టం చేశారు. ఆ తర్వాత అంతర్జాతీయ స్పాట్ మార్కెట్‌లో ధరలు పెరిగాయి. అలాగే జాబ్ మార్కెట్ రికవరీ కూడా కనిపిస్తోంది. వడ్డీ రేట్లు మరింతకాలం తక్కువగానే ఉంటాయనే వార్తల నేపథ్యంలో బంగారానికి సానుకూలంగా మారింది. ఈ ప్రభావం అంతర్జాతీయ ప్యూచర్ మార్కెట్, దేశీయ ఫ్యూచర్ మార్కెట్ పైన పడింది. ఆల్ టైమ్ కనిష్టం రూ.56200తో పోలిస్తే పసిడి రూ.9000 తక్కువగా ఉంది.

స్వల్పంగా పెరిగిన బంగారం ధర
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి మధ్యాహ్నం సెషన్లో రూ.127.00 (0.27%) పెరిగి రూ.47138.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,093.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.47,163.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.46,962.00 కనిష్టాన్ని తాకింది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.146.00 (0.31%) పెరిగి రూ.47450.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,389.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.47,450.00 గరిష్టాన్ని, రూ.47,280.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి జంప్
జూలై సిల్వర్ ఫ్యూచర్స్ సాయంత్రం సెషన్లో రూ.400.00 (0.59%) పెరిగి రూ.67915.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.67,917.00 వద్ద ప్రారంభమై, రూ.68,089.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.67,501.00 వద్ద కనిష్టాన్ని తాకింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.421.00 (0.61%) పెరిగి రూ.68962.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,899.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.69,014.00 గరిష్టాన్ని, రూ.68,535.00 కనిష్టాన్ని తాకింది

అంతర్జాతీయ మార్కెట్లో...
అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం నేడు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 6.15 (0.35%) డాలర్లు పెరిగి 1,783.55 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,777.25 - 1,785.45 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. 0.190 (0.73%) డాలర్లు పెరిగి 26.047 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.802 - 26.082 డాలర్ల మధ్య కదలాడింది.

బంగారం కొనుగోలు చేయవచ్చా?
బంగారాన్ని రూ.47,350 టార్గెట్‌గా పెట్టుకొని రూ.46,900 వద్ద కొనుగోలు చేయవచ్చునని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. రూ.46,680 వద్ద స్టాప్ లాస్ పెట్టుకొని కొనుగోలు చేయవచ్చు. వెండి రూ.66600 స్టాప్ లాస్‌తో టార్గెట్ ధర రూ.68200 పెట్టుకొని రూ.67200 కొనుగోలు చేయవచ్చు. బంగారం ధరలు మరికొద్ది రోజులు స్వల్పంగా పెరగవచ్చునని, ప్రస్తుత ధర వద్ద కొనుగోలు చేయవచ్చు చెబుతున్నారు.
More From GoodReturns

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

Gold: రాబోయే 2 ఏళ్లలో బంగారంపై భారీ లాభాలు.. ఇన్వెస్టర్లు అప్రమత్తం!

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications