Gold Prices Today: అందుకే బంగారం ధరలు పెరుగుతున్నాయి, మద్దతు ధర ఎక్కడంటే?
బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కొద్దిరోజుల క్రితం రూ.47,000 స్థాయిలో ఉన్న పసిడి ఫ్యూచర్ ఇప్పుడు రూ.48,500ను సమీపించింది. ఓ వైపు ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు సంకేతాలు ఉన్నప్పటికీ, ద్రవ్యోల్భణ ఆందోళనలు, పెరుగుతున్న చమురు ధరల ప్రభావం కనిపిస్తోంది. వివిధ అంశాలు పసిడి పెరుగుదలపై ప్రభావం చూపుతున్నాయి. ధరలు నేడు దాదాపు స్థిరంగా ఉన్నప్పటికీ నిన్న మాత్రం భారీగా పెరిగాయి. నిన్న ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.200 వరకు పెరిగి రూ.48,426 వద్ద, జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.194 పెరిగి రూ.48,568 వద్ద ముగిసింది. నిన్న సిల్వర్ ఫ్యూచర్స్ రూ.335 పెరిగి రూ.62,370 వద్ద క్లోజ్ అయింది.

బంగారం ధరలు నేడు
ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి (ఫిబ్రవరి 3) ప్రారంభ సెషన్‌లో స్థిరంగా లేదా అతి స్వల్పంగా పెరిగాయి. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు రూ.11 పెరిగి రూ.48,440 వద్ద, జూన్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.48,570 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 1830 డాలర్లకు దిగువనే ఉన్నాయి. ఈ వార్త రాసే సమయానికి 0.45 డాలర్లు లేదా 0.02 శాతం లాభపడి 1828.35 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఏడాదిలో 1 శాతం క్షీణించింది. క్రితం సెషన్‌లో 1827.90 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

వెండి ధరల పరుగు
బంగారం ధరలు నేడు కాస్త శాంతించినప్పటికీ, వెండి ధరలు మాత్రం పరుగులు పెడుతోంది. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ నేటి సెషన్‌లో రూ.256 పెరిగి రూ.62,623 వద్ద, మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.250 ఎగిసి రూ.63,412 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో సిల్వర్ ఫ్యూచర్స్ 23 డాలర్లను క్రాస్ చేసింది. నేడు మరో 0.115 డాలర్లు లాభపడి 23.315 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

మద్దతు ధర
ఓ వైపు బాండ్ యీల్డ్స్ పెరుగుతున్నప్పటికీ, మార్కెట్ అస్థిరత, ఈటీఎఫ్ ఇన్-ఫ్లో, అంతర్జాతీయ సరిహద్దు ఉద్రిక్తతలు, ద్రవ్యోల్భణ ఆందోళనల కారణంగా పసిడి ముందుకు వెళ్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం మద్దతు ధర 1818 డాలర్ల నుండి 1810 డాలర్లు, నిరోధకస్థాయి 1834 డాలర్ల నుండి 1845 డాలర్లు.
వెండి మద్దతు ధర 23 డాలర్ల నుండి 22.70 డాలర్లు. నిరోధకస్థాయి 23.70 డాలర్లు. దేశీయంగా అంటే ఎంసీఎక్స్‌లో బంగారం మద్దతు ధర రూ.48,300 నుండి రూ.48,100. నిరోధకస్థాయి రూ.48,600 నుండి రూ.48,700. వెండి మద్దతు ధర రూ.62,000 నుండి రూ.61,600, నిరోధకస్థాయి రూ.62,750 నుండి 63,100.


Click it and Unblock the Notifications