బంగారం కొనుగోలుదారులకు కాస్త ఊరట! పసిడి ధరలు వరుసగా క్షీణిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో రూ.55,000 క్రాస్ చేసిన గోల్డ్ ఫ్యూచర్స్, ఇటీవలే రూ.53,000 దాటి కొనుగోలుదారులకు షాకిచ్చింది. కానీ గత కొద్ది సెషన్‌లుగా తగ్గుతోంది. పసిడి (ఫ్యూచర్) ధరలు ఇప్పుడు రూ.52,000 దిగువకు వచ్చాయి. పరిస్థితులు ఇలాగే ఉంటే రూ.50,000 స్థాయికి రావొచ్చునని అంటున్నారు. గోల్డ్ ఫ్యూచర్ ధరలు ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే రూ.4300 వరకు తక్కువగా ఉన్నాయి.

బంగారం, వెండి భారీగా డౌన్
అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్, దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌లో బంగారం ధరలు రెండు వారాల కనిష్టానికి చేరుకున్నాయి. గతవారం చివరలో నష్టపోయిన పసిడి ధరలు, ఇంకా ఒత్తిడిలోనే కొనసాగుతున్నాయి.
జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి మధ్యాహ్నం సెషన్‌లో రూ.361 తగ్గి రూ.51,900 వద్ద, ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.391 క్షీణించి రూ.52,140 వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ధరలు భారీగా తగ్గాయి. చాలా రోజులకు రూ.65,500 దిగువకు వచ్చాయి. నేడు మధ్యాహ్నం సెషన్‌లో రూ.1,086 తగ్గి రూ.65,460 వద్ద, జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.1,119 తగ్గి రూ.66,256 వద్ద ట్రేడ్ అయింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో
అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధరలు 1920 డాలర్లకు దిగి వచ్చాయి. గోల్డ్ ఫ్యూచర్స్ 14 డాలర్లు క్షీణించి 1920 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.374 డాలర్లు క్షీణించి 23,887 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గతవారం ఓ సమయంలో 1980 డాలర్లు క్రాస్ చేసిన గోల్డ్ ఫ్యూచర్స్ నేడు ఓ సమయంలో 1913 డాలర్లకు కూడా పడిపోయింది. ఆల్ టైమ్ గరిష్టంతో 150 డాలర్లకు పైగా తక్కువగా ఉంది.

బంగారం ధరల నిరోధకం
బంగారం ధరలు రూ.51,800 వద్ద, వెండి ధరలు రూ.65,000 వద్ద మద్దతు కనిపిస్తోందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం 1920 డాలర్ల వద్ద మద్దతు కనిపిస్తోంది. బంగారం నిరోధకం రూ.52,500 నుండి రూ.52,600 మధ్య కనిపిస్తోంది. వెండి నిరోధకం రూ.66,700 నుండి రూ.67,300 మధ్య కనిపిస్తోంది.
More From GoodReturns

బంగారం ధరల పెరుగుదలపై లేటెస్ట్ రిపోర్ట్.. సరికొత్త నివేదికను విడుదల చేసిన ప్రముఖ బ్యాంకులు

నిజాం నవాబుల బంగారం.. హైదరాబాద్ వ్యాపారికి రూ. 50 కోట్లు టోపీ పెట్టిన కేటుగాళ్లు.. అసలు కథ ఏంటంటే..

Gold reserves: ఈ చిన్న దేశం కొంటున్న బంగారం చూస్తే కళ్లు చెదరాల్సిందే!

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పసిడి రేటు భారీ ర్యాలీతో ఎంత వరకు వెళ్లిందంటే.. ఏప్రిల్ 15, బుధవారం ధరలు ఇవే..

ఐస్ క్రీం బండి మీద తక్కువ ధరకే బంగారం అమ్మకం.. విశాఖ బీచ్ వద్ద ఎగబడుతున్న కస్టమర్లు. .వీడియో ఇదిగో..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు ర్యాలీ చేసిందంటే.. ఏప్రిల్ 11, శనివారం ధరలు ఇవే..

బంగారాన్ని భారీగా కొంటున్న బ్యాంకులు.. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులన్నీ అమ్మేసి మరీ.. కారణం ఏంటంటే..

Today Gold Silver Rate Live: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

భారతీయుల ఇళ్లలో ఉన్న బంగారంపై షాకింగ్ న్యూస్.. 10 దేశాల కేంద్ర బ్యాంకుల నిల్వ కంటే ఎక్కువే..

Gold Silver: ఆ గ్లోబల్ రిపోర్ట్ చెప్పినట్లుగా బంగారం రేటు ఆకాశాన్ని తాకబోతోందా?

బంగారం, వెండి ధరలు తగ్గాయి. తాజా రేట్లు ఇక్కడ చూడండి



Click it and Unblock the Notifications