బంగారం ధరలు ఇటీవల ఫ్యూచర్ మార్కెట్లో రూ.48,000 స్థాయిలో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం భారీగా పెరిగింది. క్రితం సెషన్‌లో ఏకంగా 16 డాలర్లకు పైగా లాభపడి 1830.40 డాలర్ల వద్ద ముగిసింది. నిన్న ఒక్కరోజే దాదాపు ఒక శాతం ఎగిసింది. ఏడాదిలో గోల్డ్ ఫ్యూచర్స్ అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు 5 శాతం క్షీణించింది. 2021లోకి రూ.50వేల స్థాయిలో ఎంటర్ అయిన పసిడి ఇప్పుడు రూ.48,000 వద్ద ఉంది. ఎంసీఎక్స్‌లో చివరి సెషన్‌లో బంగారం రూ.200 పెరిగి రూ.48,083 వద్ద ముగిసింది. అయితే మన వద్ద మాత్రం ఆ స్థాయిలో పెరగలేదు. ఇందుకు డాలర్ మారకంతో రూపాయి బలపడటం కారణం.

భారీగా తగ్గి.. అదే స్థాయిలో పెరిగి
2022లో బంగారం ధరలు మళ్లీ ఎగిసిపడవచ్చునని, ఈ ఏడాది చివరి నాటికి పది గ్రాముల మేలిమి బంగారం రూ.55,000 దాటే అవకాశాలు కనిపిస్తున్నాయని బులియన్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఆందోళనలు, ప్రపంచవ్యాప్తంగా ధరలు ఆందోళనకర స్థాయికి పెరగడం, ఈ ఏడాది డాలర్ బలపడే అంశాలు ప్రభావం చూపుతాయని చెబుతున్నారు.
2022 ప్రథమార్ధంలో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ పసిడి ధర 1,700-1,900 డాలర్ల స్థాయిలో ట్రేడ్ అవుతుందని, ద్వితీయార్ధంలో 2,000 డాలర్ల స్థాయిని దాటే అవకాశాలు ఉన్నాయని కామ్‌ట్రెండ్జ్ సహ వ్యవస్థాపకులు, సీఈఓ జ్ఞానశేఖర్ త్యాగరాజన్ అంచనా వేస్తున్నారు. దేశంలో ఎంసీఎక్స్‌లో పది గ్రాముల పసిడి 2022 ప్రథమార్ధంలో రూ.45,000-50,000 స్థాయిలో, ద్వితీయార్ధంలో రూ.55,000 స్థాయికి చేరుకోవచ్చునని చెప్పారు.

బంగారం నుంటి ఈక్విటీ వైపు పెట్టుబడులు
కరోనా కారణంగా 2020లో బంగారం ధరలు పరుగు పెట్టాయి. 2020 ఆగస్ట్ 7న ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200కు చేరుకున్నాయి. ఆల్ టైమ్ గరిష్టంతో ప్రస్తుతం 14 శాతం తక్కువగా ఉంది. ఈ ఏడాది జనవరి నెలలోను రూ.50,000కు పైనతో చూసినా నాలుగు శాతం తక్కువే. ఇన్వెస్టర్లు విలువైన లోహాల్లోని పెట్టుబడులను ఈక్విటీ మార్కెట్లకు తరలించారని, అందుకే పసిడి ధర కాస్త తగ్గుముఖం పట్టిందని చెబుతున్నారు.

స్వల్పకాలంలో ధరల మద్దతు
ఇటీవల రూపాయి ధర పెరిగిన నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్ ధరతో పోలిస్తే మన వద్ద పసిడి ధరల పెరుగుదల కాస్త తక్కువగా ఉంది. కానీ ఓవరాల్‌గా గత ఏడాది (2021)లో మొత్తం చూస్తే డాలర్ మారకంతో రూపాయి క్షీణించింది. కాబట్టి అంతర్జాతీయ మార్కెట్‌తో పోలిస్తే మన వద్ద పసిడి 3 శాతం ఎక్కువగానే ఉంది. పసిడి స్వల్పకాలంలో మద్దతు ధర 1670 డాలర్లు, నిరోధకస్థాయి 1970గా అంచనా వేస్తున్నారు. ఎంసీఎక్స్‌లో నిరోధకస్థాయి రూ.49,200, మద్దతు ధర రూ.45,000గా అంచనా వేస్తున్నారు.
More From GoodReturns

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 2, గురువారం ధరలు ఇవే..

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..



Click it and Unblock the Notifications