మరికొద్దిరోజులు ఆ ధర వద్దే బంగారం, కారణమిదే
గత కొద్ది నెలలుగా భారీగా పెరుగుతున్న బంగారం ధరలు నిన్నటి వారం తగ్గుముఖం పట్టాయి. దేశీయ మార్కెట్ ఎంసీఎక్స్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ఓ సమయంలో రూ.57,000కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ 2,072 దాటింది. అయితే గత వారం దేశీయంగా రూ.52వేలకు, గ్లోబల్ మార్కెట్లో 1950 డాలర్ల సమీపానికి పడిపోయింది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై బులియన్ మార్కెట్లలో వేలల్లో తగ్గుదల నమోదు చేసింది.

గత వారం.. ఎగిసి.. పడిపోతూ..
గత వారం రోజుల్లో బంగారం ధరలు 4.5 శాతం మేర పడిపోయి ఔన్స్ 1,953 డాలర్లకు చేరుకున్నాయి. వెండి ఔన్స్ ధర 24 శాతం క్షీణించింది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు ఇటీవల రోలర్ కోస్టర్‌లా కనిపిస్తున్నాయి. కరోనా తర్వాత రోజురోజుకు పెరుగుతూ 2000 డాలర్లకు పైకి పెరిగాయి. ఆ తర్వాత పడిపోయాయి. ఇటీవల 1900 డాలర్ల దిగువకు చేరుకొని, తిరిగి మళ్లీ 1950 డాలర్లకు చేరుకుంది.

2000 డాలర్ల లోపు ఒత్తిడి
ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం, ప్రపంచ దిగ్గజ ఆర్థిక వ్యవస్థలు తిరిగి కోలుకుంటున్న సూచనలు, అమెరికా డాలర్ కోలుకోవడం, వ్యాక్సీన్, ఈక్విటీ మార్కెట్లు రోజురోజూ లాభాల్లోకి రావడం వంటి వివిధ కారణాలతో పసిడి ధరలపై ప్రభావం పడుతోంది. పసిడి ధరలు మరికొంతకాలం 2000 డాలర్ల వద్ద మరికొంత కాలం తచ్చాడవచ్చునని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఈ టార్గెట్ వద్ద మరికొంతకాలం ఒత్తిడికి గురవుతాయని భావిస్తున్నారు.

గోల్డ్ ప్రీమియం.. గోల్డ్ ఈటీఫ్
గత వారం దేశీయంగా గోల్డ్ ప్రీమియం ధరలు స్వల్పంగా తగ్గాయి. డొమెస్టిక్ గోల్డ్ ధరల్లో ఇంపోర్ట్ డ్యూటీ, జీఎస్టీ ఉంటాయి. ఫ్యూచర్ మార్కెట్లో బంగారం 1.4 శాతం పడిపోయి శుక్రవారం 52.170 డాలర్లకు చేరుకుంది. కాగా, గత నెలలో గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్స్ పెరిగాయి. గోల్డ్ ఈటీఎఫ్ పెట్టుబడులు జూన్ నెలలో రూ.494 కోట్లు కాగా, జూలై నెలలో దాదాపు రెండింతలు పెరిగి రూ.921 కోట్లుగా ఉంది.


Click it and Unblock the Notifications