బంగారం ధరలు ఈ నెలలో (ఏప్రిల్) ఇప్పటి వరకు రూ.3,000 పెరిగాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో గోల్డ్ ఫ్యూచర్స్ 0.35 శాతం ఎగిసి రూ.47,350కి చేరుకుంది. ఈ నెల ప్రారంభంలో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.44,000 వద్ద ఉంది. అంతకుముందు ఈ స్థాయి దిగువకు వచ్చింది. ఈ నెల ప్రారంభం నుండి ఇప్పటి వరకు రూ.3వేలకు పైగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోను బంగారం ధరలు ఏడు వారాల గరిష్టానికి చేరుకున్నాయి. ఈ వారం 0.8 శాతం ఎగిసి 1778.04 డాలర్లకు చేరుకుంది. అమెరికా బాండ్ యీల్డ్స్ ఈ వారం 1.6 శాతం క్షీణించాయి.

మరింత పెరిగే ఛాన్స్
కరోనా కేసులు పెరుగుతుండటం, ద్రవ్యోల్భణ భయాలు కమ్ముకోవడం వంటి వివిధ కారణాలు బంగారం పెరగడానికి దోహదపడుతున్నాయి. యూఎస్ రిటైల్ సేల్స్ డేటా, వీక్లీ జాబ్ లాస్ క్లెయిక్స్ తగ్గిపోవడం వల్ల పసిడి ధరలు కాస్త తగ్గాలి. అయితే కరోనా కేసులు పెరగడం పసిడికి కలిసి వస్తోంది. సమీప భవిష్యత్తులో కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సరైన సమయమని, ధరలు మరికొంత పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. బంగారం ధర ఇప్పటికే కీలక మద్దతు 1760 డాలర్లను క్రాస్ చేసిందని, ఈ పరిస్థితుల్లో మరింత పెరిగే అవకాశాలు కొట్టి పారేయలేమని అంటున్నారు.

గత వారం బంగారం ధరలు
ఎంసీఎక్స్‌లో జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు క్రితం సెషన్‌లో 175.00 (0.37%) పెరిగి రూ.47,350 వద్ద క్లోజ్ అయింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.189.00 (0.40%) పెరిగి రూ.47,590.00 వద్ద ముగిసింది. సిల్వర్ ఫ్యూచర్స్ మే రూ.62.00 (0.09%) ఎగిసి రూ.68602.00 వద్ద, జూలై సిల్వర్ ప్యూచర్స్ రూ.116.00 (0.17%) పెరిగి రూ.69728.00 వద్ద క్లోజ్ అయింది.

అంతర్జాతీయ మార్కెట్లో
అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ గత వారం చివరి సెషన్లో 10.10(+0.57%) శాతం ఎగిశాయి. గోల్డ్ ఫ్యూచర్స్ 1,776.90 డాలర్ల వద్ద ముగిసింది. సిల్వర్ ఫ్యూచర్స్ చివరి సెషన్లో 0.068 (+0.26%) డాలర్లు పెరిగి 26.032 డాలర్ల వద్ద క్లోజ్ అయింది.
More From GoodReturns

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో ఈ రేటును దాటడం ఖాయం అంటున్న నిపుణులు..

బంగారం ధర ఈ వారం ఎంత పెరిగిందో తెలుసా.. రూపాయి పైనే పెట్టుబడిదారుల ఆశలు.. ఎందుకంటే..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Gold silver: బంగారం, వెండి కొనేవారికి అలర్ట్.. ఈ వారం ధరలు ఎలా ఉండబోతున్నాయి? నిపుణుల అంచనా ఇదే!

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!



Click it and Unblock the Notifications