బంగారం ధరలు తగ్గుతున్నాయి, కానీ: మద్దతు ధర, నిరోధకస్థాయి ఇక్కడే..
బంగారం ధరలు ఈ వారం తగ్గుముఖం పడుతున్నాయి. అయితే దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో ఇప్పటికీ రూ.48,000 స్థాయిలోనే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లోను బంగారం ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. మొన్నటి సెషన్‌లలో 1800 డాలర్ల దిగువకు వచ్చిన గోల్డ్ ఫ్యూచర్స్ నిన్న మరింత తగ్గి 1790 డాలర్ల దిగువకు పడిపోయింది. వెండి ధరలు రూ.62,00కు దిగువన దాదాపు స్థిరంగా ఉన్నాయి. ఒమిక్రాన్ వ్యాప్తి ఆందోళనలు, యూఎస్ ట్రెజరీ యీల్డ్స్ పెరగడం వంటి అంశాలు పసిడి ధరల పైన ప్రభావం చూపుతాయి.

బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే
ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ నేటి (బుధవారం, డిసెంబర్ 22) ప్రారంభ సెషన్‌లో రూ.30 తగ్గి రూ.48,037 వద్ద, ఏప్రిల్ ఫ్యూచర్స్ రూ.12 తగ్గి రూ.48,118 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 0.10 డాలర్లు క్షీణించి 1788 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఏడాదిలో బంగారం ధర 5.75 శాతం తగ్గింది. నేటి సెషన్లో 1,787.60 - 1,791.65 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. ఎంసీఎక్స్‌లో ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పసిడి ధర 8200 వరకు తక్కువగా ఉంది.

సిల్వర్ ఫ్యూచర్స్ ఎంతంటే
దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ ప్రారంభ సెషన్‌లో రూ.83.00 (0.13%) పెరిగి రూ.61,888 వద్ద ట్రేడ్ అయింది. మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.73 పెరిగి రూ.62,505 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లోను అతి స్వల్పంగా 0.014 డాలర్లు పెరిగి 22.543 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఏడాదిలో సిల్వర్ ఫ్యూచర్ ధర 15.1 శాతం క్షీణించింది.

మద్దతు ధర, నిరోధకస్థాయి
అంతర్జాతీయంగా ఈక్విటీ షేర్లు క్రమంగా పుంజుకుంటోన్న నేపథ్యంలో బంగారం ధరలు ఒత్తిడిలో కనిపిస్తున్నాయని, ఓవైపు ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నప్పటికీ యూరోపియన్, యూఎస్ స్టాక్స్ మళ్లీ పుంజుకుంటున్నాయని, దీంతో పసిడి టైట్ రేంజ్‌లో ట్రేడ్ అవుతోందని చెబుతున్నారు. దేశీయంగా ఫిజికల్ గోల్డ్ డిమాండ్ క్రమంగా పెరుగుదలను నమోదు చేస్తోందని అంటున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం మద్దతు ధర 1780 డాలర్లు, నిరోధకస్థాయి 1800 డాలర్లుగా ఉందని, ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్ మద్దతు ధర 47,800, నిరోధకస్థాయి 48,400 వద్ద కనిపిస్తోందని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications