గతవారం స్థిరంగా ముగిసిన బంగారం ధరలు ఈ వారం క్షీణిస్తున్నాయి. అయితే అది కూడా స్వల్పంగానే. గోల్డ్ ఫ్యూచర్స్ ఈ వారం రూ.47,500 స్థాయిలో ప్రారంభమై, ఈ రెండు సెషన్‌లలో అతిస్వల్పంగా తగ్గడంతో నేటి ప్రారంభ సెషన్‌లో (సెప్టెంబర్ 7, 2021) రూ.47,400 దిగువన ట్రేడ్ అయింది. గోల్డ్ ఫ్యూచర్స్ ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.8800 తక్కువగా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లోను బంగారం ధరలు 1820 డాలర్ల దిగువకు పడిపోయాయి. సోమవారం ఆసియా మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్ దేశాల్లో కరోనా కేసులు తగ్గాయి. ఈ ప్రభావం గోల్డ్ ఫ్యూచర్ పైన పడింది. అయితే కరోనా మహమ్మారి ఆందోళనలు సహా వివిధ అంశాల ప్రభావంతో నేడు డాలర్ 0.07 శాతం క్షీణించి 92.14 వద్ద ట్రేడ్ అయింది. దీంతో బులియన్ మార్కెట్ ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

అంతర్జాతీయ మార్కెట్లో మద్దతు ధర
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ప్రస్తుతం 1820 డాలర్ల వద్ద ఉంది. 1818 డాలర్ల వద్ద బంగారం కొనుగోలుకు అనుకూలమైనదేనని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు మరికొద్దికాలం ఈ సురక్షిత పెట్టుబడిగా భావించే పసిడి 1794 డాలర్లకు పైనే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. అప్-సైడ్ బ్రేక్ 1832 డాలర్ల నుండి 1858 డాలర్లు. బంగారం బలహీనం 1810 డాలర్ల నుండి 1800 డాలర్లు. సిల్వర్ ఫ్యూచర్స్ మరింత బలపడితే 25.10 డాలర్ల నుండి 25.44 డాలర్లకు పెరగవచ్చు, మద్దతు ధర 23.20 డాలర్ల నుండి 22.70 డాలర్లు.

దేశీయ మార్కెట్లో మద్దతు ధర
ఎంసీఎక్స్‌లో అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ మద్దతు ధర రూ.47,350 నుండి రూ.47,200. నిరోధకస్థాయి రూ.47,550 నుండి రూ.47,700. ఎంసీఎక్స్ సిల్వర్ డిసెంబర్ ఫ్యూచర్ రూ.65,000 పైకి చేరితే ఆ తర్వాత రూ.65,600 నుండి రూ.66,100కు చేరుకోవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణుల అంచనా. మద్దతు స్థాయి రూ.64,500 నుండి రూ.63,700.

ధరలు ఎలా ఉన్నాయంటే?
బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ఉదయం సెషన్‌లో రూ.78.00 (-0.16%) క్షీణించి రూ.47347.00 వద్ద, డిసెంబర్ ఫ్యూచర్స్ రూ.14.00 (-0.03%) క్షీణించి రూ.47554.00 వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ డిసెంబర్ రూ.200.00 (-0.31%) ఎగిసి రూ.65092.00 వద్ద, మార్చి ఫ్యూచర్స్ రూ.100.00 (-0.15%) లాభపడి రూ.65903.00 వద్ద ట్రేడ్ అయింది.
ఇక అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 15.35 (0.84%) డాలర్లు నష్టపోయి 1,818.35 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 268.00 (-0.41%) డాలర్లు క్షీణించి 65024.00 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.
ఇటీవల విడుదలైన అమెరికా జాబ్ డేటా అంచనాలు మిస్ అయ్యాయి. జాబ్ డేటా కాస్త సానుకూలంగా ఉన్నప్పటికీ గత కొద్ది నెలలతో పోలిస్తే తగ్గింది. అమెరికాలోను కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆగస్ట్ నెలలో కొత్తగా 2,35,000 ఉద్యోగాలు వచ్చినట్లు యూఎస్ లేబర్ డిపార్టుమెంట్ జాబ్ డేటా వెల్డిస్తోంది. ఈ ప్రభావం బంగారం పైన కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం ఈ వారం మరింత పెరిగే అవకాశాలు కొట్టి పారేయలేమని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications