బంగారం ధరలు తగ్గాయి కానీ.. 10% వరకు దిద్దుబాటుకు ఛాన్స్
ముంబై: బంగారం ధరలు పైకి, కిందకు కదులుతున్నాయి. ఆగస్ట్ రెండో వారం నుండి ఆల్ టైమ్ గరిష్టం నుండి క్షీణించిన ధరలు దాదాపు రెండు మూడు నెలలు రూ.51,000 నుండి రూ.53,000 మధ్య కదలాడింది. ఆ తర్వాత ఫైజర్, మోడర్నా వ్యాక్సీన్ ప్రకటన, వ్యాక్సినేషన్ ప్రకటనల నేపథ్యంలో పసిడి అంతకంతకు పడిపోయి రూ.47,500 స్థాయికి చేరింది. అయితే గత పది రోజులుగా ధరలు మళ్లీ పెరిగాయి. అంతకుముందు సెషన్లో రూ.50,000 పైకి చేరుకున్న బంగారం చివరి సెషన్లో మాత్రం రూ.స్వల్పంగా తగ్గింది. అయినప్పటికీ రూ.50,000 పైన ఉంది.

రూ.50,000కు పైనే బంగారం
క్రితం సెషన్లో దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో 10 గ్రాముల ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.85.00 (-0.17%) తగ్గింది. గతవారం రూ.50,305 వద్ద క్లోజ్ అయింది. ఏప్రిల్ ఫ్యూచర్స్ క్రితం సెషన్లో రూ.122 క్షీణించింది. గతవారం రూ.50,332 వద్ద స్థిరపడింది. పసిడి ఫ్యూచర్స్ తిరిగి రూ.50,000 మార్క్ చేరుకోవడం గమనార్హం.
ఇక సిల్వర్ ఫ్యూచర్స్ పది సెషన్ల క్రితం రూ.60వేల దిగువన పలికింది. ఇప్పుడు మార్చి ఫ్యూచర్స్ రూ.67,840 వద్ద ముగిసింది. మే ఫ్యూచర్స్ రూ.68,803 వద్ద ముగిసింది.

ఏడాదిలో బంగారం 25 శాతం
అంతర్జాతీయ మార్కెట్లోను గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్లో 3.40 (-0.18%) తగ్గి ఔన్స్ 1,887.00 డాలర్ల వద్ద ముగిసింది. ఏడాదిలో బంగారం ధర 25 శాతం వరకు పెరిగింది. వెండి ఫ్యూచర్స్ క్రితం సెషన్లో 0.178 (-0.68%) క్షీణించి 26.003 డాలర్ల వద్ద ముగిసింది. ఏడాదిలో వెండి ఫ్యూచర్ 50.13 శాతం పెరిగింది.

దిద్దుబాటుకు లోనయ్యే అవకాశం
బంగారం ధరలు 8 శాతం నుండి 10 శాతం మేర దిద్దుబాటుకు లోనయ్యే అవకాశాలు లేకపోలేదని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అది పెట్టుబడిదారులకు ఇన్వెస్ట్ చేసేందుకు మంచి మార్గం అవుతుందని అంటున్నారు. ఈ ఆగస్ట్ నెలలో బంగారం రూ.56,000 మార్కును దాటింది. గత నాలుగేళ్లలో బంగారం 100 శాతం కంటే ఎక్కువగా ర్యాలీచేసింది. 25,000 నుండి రూ.56,000కు పెరిగింది.


Click it and Unblock the Notifications