బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతుండటం, మాస్కో పైన అమెరికా, యూరోపియన్ దేశాల ఆంక్షల వంటి వివిధ కారణాలు పసిడి పైన ప్రభావం చూపుతున్నాయి. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో సురక్షిత పెట్టుబడిగా భావించే పసిడి వైపు చూస్తున్నారు ఇన్వెస్టర్లు. దీంతో నేడు పసిడి ధరలు రూ.52,000 క్రాస్ చేయగా, వెండి ధరలు రూ.68,000 మార్కును దాటింది. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 1950కి చేరువ కాగా, సిల్వర్ ఫ్యూచర్స్ 25.500 డాలర్లకు చేరువైంది.

వారంలో రూ.2000 పెరిగిన బంగారం
మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి (మార్చి 4) ప్రారంభ సెషన్‌లో రూ.238 పెరిగి రూ.52,008 వద్ద ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌లోను రూ.500 వరకు పెరిగింది. రెండు రోజుల్లోనే రూ.700కు పైగా పెరిగింది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.243 పెరిగి రూ.52,192 వద్ద ట్రేడ్ అయింది. బంగారం ధరలు రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముందు రూ.50,000 స్థాయిలో కనిపించాయి. ఈ వారం రోజుల్లోనే రూ.2000 పెరిగింది. పసిడి ధరలు 14 నెలల గరిష్టం వద్ద ఉన్నాయి.
ఎంసీఎక్స్‌లో సిల్వర్ ఫ్యూచర్స్ రూ.307 పెరిగి రూ.68,211 వద్ద, జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.336 పెరిగి రూ.68,918 వద్ద ట్రేడ్ అయింది.

1950 డాలర్లను దాటిన బంగారం
అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ ఓ సమయంలో 1950 డాలర్లు దాటి 1953.90 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. పసిడి ఈ స్థాయికి చేరుకోవడం గత కొద్ది నెలల్లో ఇదే మొదటిసారి. నేటి సెషన్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 1,932.30 - 1,953.90 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. ఈ వార్త రాసే సమయానికి ఏప్రిల్ గోల్డ్ 5.30 డాలర్లు లేదా 0.27 శాతం లాభపడి 1941.30 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.008 డాలర్లు లేదా 0.03 శాతం లాభపడి 25.220 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

మరింత పెరిగేనా?
బంగారం ధరలు కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి ఇప్పటికే దేశీయ ఫ్యూచర్ మార్కెట్‌లో రూ.52,000 అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్‌లో 1950 డాలర్లను సమీపించింది. రష్యా-ఉక్రెయిన్ పరిస్థితి ఇలాగే ఉంటే 2000 డాలర్లు క్రాస్ చేయవచ్చునని, అప్పుడు దేశీయ ఫ్యూచర్ మార్కెట్‌లో రూ.53,000 క్రాస్ చేయవచ్చునని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. పరిస్థితి సద్దుమణిగితే మాత్రం రూ.50,000 దిగువకు పడిపోవచ్చునని అంటున్నారు. టెక్నికల్ పరంగా బంగారం ప్రస్తుతం 1975కు చేరుకునే అవకాశాలు కొట్టి పారేయలేమని, అయితే 1910 వద్ద మద్దతు ధర కనిపిస్తోందని చెబుతున్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications