బంగారం, వెండి ధరలు ఈరోజు(సెప్టెంబర్ 3, గురువారం) పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో నేడు ప్రారంభ సెషన్‌లో 10 గ్రాములు అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.23 శాతం పెరిగి రూ.50,940 పలికింది. వెండి ఫ్యూచర్స్ 0.75 శాతం లాభపడి కిలో రూ.68,770 పలికింది. అంతకుముందు సెషన్లో బంగారం 10గ్రాములు రూ.650 తగ్గింది. అంతకుముందు రోజు కూడా తగ్గింది. క్రితం సెషన్‌లో వెండి కిలో రూ.2,650 పలికింది. ఆగస్ట్ 7వ తేదీన గరిష్ట ధర రూ.56,200తో పోలిస్తే పసిడి ధర ఇప్పటికీ రూ.5000కు పైగా తగ్గుదలతో ఉంది.

బంగారం ధరలు
హైదరాబ్ద్, విజయవాడల్లో పసిడి ధరలు రూ.500కు పైగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.53,700 సమీపానికి చేరుకుంది. 22 క్యారెట్ల పసిడి రూ.49,200గా ఉంది. ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల పసిడి రూ.54,600, 22 క్యారెట్ల బంగారం రూ.50,000 పలికింది. నిన్న భారీగా తగ్గిన వెండి ఈ రోజు కూడా రూ.1400 వరకు దిగి వచ్చింది.

అంతర్జాతీయ మార్కెట్లో ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో అంతకుముందు సెషన్లో బంగారం ధరలు ఔన్స్ 1.4 శాతం క్షీణించాయి. కానీ తాజా సెషన్‌లో దాదాపు స్థిరంగా ఉన్నాయి. స్పాట్ గోల్డ్ మాత్రం 0.1 శాతం స్వల్పంగా పెరిగి ఔన్స్ ధర 1,944.58 డాలర్లు పలికింది. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ రికవరీపై గందరగోళం, కరోనా కేసులు, వ్యాక్సీన్ ప్రభావం, డాలర్ వ్యాల్యూ, ట్రేడ్ వార్, భౌగోళిక ఉద్రిక్తతలు తదితర అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపిస్తాయి. ఇతర అతి ఖరీదైన లోహాల విషయానికి వస్తే వెండి ఔన్స్ 0.1 శాతం తగ్గి 27.48 డాలర్లు, ప్లాటినమ్ 0.1 శాతం పెరిగి 906.69 డాలర్లు, పల్లాడియం 0.3 శాతం తగ్గి 2,241.10 డాలర్లు పలికింది.

బంగారం ర్యాలీ కొనసాగుతుందా..
బంగారం ధరల ర్యాలీ మరింతగా కొనసాగుతుందా అంటే.. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా కేసులు, వ్యాక్సీన్ అందుబాటుపై ఆధారపడి ఉంటుందనే విషయం తెలిసిందే. అయితే ఇక్కడ మరో కీలక విషయం కూడా ఉంది. ప్రస్తుతం ధరలు అధికంగా పెరగడంతో రిటైల్ కొనుగోలుదారులు తగ్గినప్పటికీ, ఇన్వెస్టర్లు మాత్రం పెట్టుబడికి ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం అస్థిరంగా ఉండటంతో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏమంటే బంగారం సరఫరా గత మూడేళ్లలో ఇతర అతి ఖరీదైన లోహాలకు భిన్నంగా కేవలం 0.6 శాతం మాత్రమే వృద్ధిని నమోదు చేసింది. అంతేకాదు నిల్వలు కొత్తగా కనుగొనలేని పరిస్థితి. మరోవైపు కేంద్ర బ్యాంకులు పసిడి నిల్వలు పెంచుకుంటున్నాయి. ఈ పరిస్థితులు బంగారానికి సానుకూలమేనని అంటున్నారు. ఇలాగే ఉంటే ర్యాలీ ఉండే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పసిడి రేటు భారీ ర్యాలీతో ఎంత వరకు వెళ్లిందంటే.. ఏప్రిల్ 15, బుధవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై లేటెస్ట్ రిపోర్ట్.. సరికొత్త నివేదికను విడుదల చేసిన ప్రముఖ బ్యాంకులు

Today Gold Silver Rate Live: అమెరికా ఇరాన్ చర్చల తర్వాత పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

ఐస్ క్రీం బండి మీద తక్కువ ధరకే బంగారం అమ్మకం.. విశాఖ బీచ్ వద్ద ఎగబడుతున్న కస్టమర్లు. .వీడియో ఇదిగో..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

Gold: బంగారంపై పెట్టుబడి పెడుతున్నారా? బిస్కెట్లు, కాయిన్స్ ఎక్కడ కొంటే ఎక్కువ లాభం?

Akshaya Tritiya: అక్షయ తృతీయ ఏ రోజు? కన్ఫ్యూజన్ వద్దు.. అసలైన ముహూర్తం ఇదే!

భారతీయుల ఇళ్లలో ఉన్న బంగారంపై షాకింగ్ న్యూస్.. 10 దేశాల కేంద్ర బ్యాంకుల నిల్వ కంటే ఎక్కువే..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం



Click it and Unblock the Notifications