బంగారం ధరలు స్థిరంగా ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 1800 డాలర్ల పైకి, దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో రూ.48,000కు పైనే ఉంది. ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ నేడు (డిసెంబర్ 24) ప్రారంభ సెషన్‌లో రూ.7.00 (-0.01%) తగ్గి రూ.48145.00 వద్ద, ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.12 నష్టపోయి రూ.48,212 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 0.25 డాలర్లు పెరిగి 1810 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. యూఎస్ ఎకనమిక్ డేటా బంగారం, వెండి ధరలకు మద్దతు ఇచ్చింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో నేడు ధరలు స్వల్పంగా పెరిగాయి. ఈ ప్రభావం దేశీయ మార్కెట్ పైన పడి నేడు కాస్త పెరిగే అవకాశాలు ఉంటాయి. అయితే ఇది అంతర్జాతీయ మార్కెట్‌ను అనుసరించి ఉంటుంది.

ఏడాదిలో 5 శాతం పెరిగిన బంగారం ధర
దేశీయ ప్యూచర్ మార్కెట్ ఎంసీఎక్స్‌లో నేడు స్థిరంగా ఉన్నాయి. అయినప్పటికీ రూ.62,000కు పైనే ఉంది. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.91 క్షీణించి రూ.62,220 వద్ద, మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.30 లాభపడి రూ.62,892 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో సిల్వర్ ఫ్యూచర్స్ 23 డాలర్లకు చేరువైంది. నేడు 0.091 డాలర్లు పెరిగి 22.910 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ ఏడాదిలో 12 శాతం క్షీణించింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్లో 1802 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేడు మరింత పైకి ఎగిసింది. ఏడాదిలో దాదాపు 5 శాతం నష్టపోయింది.

యూఎస్ డేటా ఎఫెక్ట్
యూఎస్ కోర్ పీఎస్ఈ ప్రైస్ ఇండెక్స్ గత నెలలో 0.5 శాతం పెరిగింది. ఇది 0.4 శాతం పెరుగుతుందని అంచనా వేయగా కాస్త ఎక్కువగానే ఉంది. ఏడాది ప్రాతిపదికన పీసీఈ 4.7 శాతానికి పెరిగింది.
యూఎస్ నిరుద్యోగిత క్లెయిమ్స్ గతవారం 2,05,000కు చేరుకున్నాయి. ఆర్థికవేత్తలు దీనిని 2,00,000కు అంచనా వేశారు. కానీ ఇది పెరిగింది. పర్సనల్ ఇన్‌కం, పర్సనల్ స్పెండింగ్ డేటా కూడా అంతకుముందు నెలతో పోలిస్తే క్షీణించింది.

టార్గెట్ ధర
ప్రస్తుతం పసిడి ధరలు 1800 డాలర్లకు పైన ఉన్నాయి. మద్దతు ధర 1800 డాలర్ల నుండి 1788 డాలర్ల మధ్య కనిపిస్తోంది. నిరోధకస్థాయి 1822 డాలర్ల నుండి 1834 డాలర్ల మధ్య కనిపిస్తోంది. వెండి మద్దతు ధర 22.55 నుండి 22.30 డాలర్లు, నిరోధకస్థాయి 23.10 డాలర్ల నుండి 23.40 డాలర్ల మధ్య కనిపిస్తోంది.
ఎంసీఎక్స్‌లో మద్దతు ధర రూ.48,000-రూ.47,850, నిరోధకస్థాయి రూ.48,330-రూ.48,580. సిల్వర్ మద్దతు ధర రూ.61,900-రూ.61,660. నిరోధకస్థాయి రూ.62,700-రూ.63,100. వెండిని రూ.61,500 వద్ద స్టాప్ లాస్ పెట్టుకొని, రూ.63,000 టార్గెట్ ధరతో రూ.62,000 కొనుగోలు చేయవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. బంగారం బై-జోన్ రూ.48,100, టార్గెట్ ధర రూ.48,400. సెల్-జోన్ రూ.47,800, టార్గెట్ ధర రూ.47,600.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications