బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. ఓ వైపు స్టాక్ మార్కెట్ కుప్పకూలుతుంటే మరోవైపు పసిడి ధరలు క్షీణిస్తున్నాయి. త్వరలో వడ్డీ రేట్లు పెంచనున్నట్లు ఫెడ్ రిజర్వ్ చీఫ్ జెరోమ్ పోవెల్ తెలిపారు. దీంతో ఇటు మార్కెట్లు, అటు పసిడి ధరలు క్షీణిస్తున్నాయి. బంగారం ధరలు క్రితం సెషన్‌లో ఏకంగా రూ.733 తగ్గింది. వెండి దాదాపు రూ.1500 పతనమైంది. గోల్డ్ ఫ్యూచర్స్ చాలా రోజులకు రూ.51,500 స్థాయికి, సిల్వర్ ఫ్యూచర్స్ రూ.65,000కు దిగి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌లోను పసిడి ధరలు 1900 డాలర్ల స్థాయికి పడిపోయాయి.

బంగారం రూ.1500 డౌన్
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌లో గోల్డ్ ఫ్యూచర్ ధరలు నిన్నటి వరకు భారీగా తగ్గినప్పటికీ, నేడు స్వల్పంగా పెరిగాయి. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి ప్రారంభ సెషన్‌లో రూ.139 పెరిగి రూ.51,532 వద్ద, ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.169.00 పెరిగి రూ.51,800 వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ నేడు స్వల్పంగా పెరిగింది.
మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.316 పెరిగి రూ.65,432 వద్ద, జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.336 పెరిగి రూ.66,250 వద్ద ట్రేడ్ అయింది. గోల్డ్ ఫ్యూచర్స్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో రూ.55,000 క్రాస్ చేసింది. ఇటీవల కూడా రూ.53,000 దాటింది. కానీ ఈ కొద్ది కాలంలోనే రూ.1500 వరకు తగ్గింది. సిల్వర్ ఫ్యూచర్స్ ఇటీవల రూ.70,000 దాటినప్పటికీ, ఇప్పుడు రూ.65,500 దిగువన ఉంది. అంటే ఈ కాలంలో రూ.5000 వరకు తగ్గింది.

1900 డాలర్లకు బంగారం
అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్ ఫ్యూచర్ ధరలు 1900 డాలర్ల స్థాయికి దిగి వచ్చాయి. రష్యా - ఉక్రెయిన్ యుద్ధ సమయంలో 2060 డాలర్లు క్రాస్ చేసినప్పటికీ, ఆ తర్వాత 1920 డాలర్ల దిగువకు వచ్చి, మళ్లీ 1990 డాలర్ల సమీపానికి ఎగిసిపడ్డాయి. కానీ ఇటీవల తిరిగి 80 డాలర్లకు పైగా క్షీణించింది.
దీంతో ప్రస్తుతం 1900 డాలర్ల వద్ద ఉంది. అయితే క్రితం సెషన్‌లో మాత్రం ఏకంగా 1900 డాలర్ల దిగువకు పడిపోయి 1896 డాలర్ల వద్ద ముగిసింది. నేడు 10 డాలర్లు పెరిగి 1905 డాలర్ల వద్ద ఉంది. సిల్వర్ ఫ్యూచర్స్ 23.870 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.

మద్దతు, నిరోధకం
బంగారం ధరలు ప్రస్తుతం నెల రోజుల కనిష్టం వద్ద కదలాడుతున్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం, వెండి వినియోగించే చైనాలో కరోనా కేసులు పెరుగుతుండటంతో డిమాండ్ ఆందోళనలు కమ్ముకున్నాయి. ఇక్కడ కరోనా కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయని అంటున్నారు. దీనికి తోడు ఫెడ్ వడ్డీ రేట్లు త్వరలో పెరిగే అవకాశముంది.
ఇది పసిడిపై ఒత్తిడి పెంచింది. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి మద్దతు ధర రూ.1885 డాలర్ల నుండి 1870 డాలర్లు, నిరోధకం 1910 డాలర్ల నుండి 1925 డాలర్లు. ఎంసీఎక్స్‌లో మద్దతు ధర రూ.51,150 నుండి రూ.50,900, నిరోధకం రూ.51,800 నుండి రూ.52,000గా కనిపిస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో ఎంతకు చేరిందంటే.. మార్చి 25, బుధవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: బంగారం ధరలు భారీగా పతనం.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన.. సామాన్యులకు ఊరట

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..

భారీగా తగ్గిన బంగారం ధరలు .. భయపడి అమ్మేసుకుంటున్న పెట్టుబడిదారులు.. మార్చి 24, మంగళవారం ధరలు ఇవే.



Click it and Unblock the Notifications