For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు: ఈ వారం పసిడి ఎలా ఉండొచ్చు?

|

దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో పసిడి ధరలు గతవారం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ ఎంసీఎక్స్‌లో పది గ్రాముల గోల్డ్ ఫ్యూచర్స్ ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే రూ.5,600 వరకు తక్కువతో ముగిసింది. రూ.50,552 వద్ద క్లోజ్ అయింది. అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో ఔన్స్ బంగారం 1902 డాలర్ల వద్ద ముగిసి స్వల్పంగా పెరిగింది. ఈ వారం బంగారం ధరల్లో స్వల్పంగా తేడా కనిపించవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ పరిణామాలు, కరోనా కేసులు, ఆర్థిక ప్యాకేజీ వంటి అంశాలు పసిడిపై ప్రభావం చూపుతాయి.

బంగారం ధర ఈ వారం..

బంగారం ధర ఈ వారం..

గోల్డ్ డిసెంబర్ కాంట్రాక్ట్ ఈ వారం రూ.51,250 స్థాయిని అదిగమిస్తే మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ధరలు మరింతగా క్షీణించినా రూ.50,100 వద్ద మద్దతు ధర ఉండవచ్చునని అంటున్నారు. సిల్వర్ డిసెంబర్ ఫ్యూచర్ కిలో రూ.63,000 వద్ద స్టాప్ లాస్‌గా అంచనా వేస్తున్నారు.

గతవారం బంగారం ధరలు (డిసెంబర్ ఫ్యూచర్స్) రూ.50,552 వద్ద ముగిశాయి.

వెండి ధర స్వల్పంగా పెరిగి కిలో రూ.61,653 వద్ద క్లోజ్ అయింది.

1900 డాలర్ల వద్ద బంగారం

1900 డాలర్ల వద్ద బంగారం

అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్‌లో గతవారం పసిడి ధరలు తగ్గగా, వెండి ధరలు పెరిగాయి. అక్టోబర్ నెలలో ఇప్పటి వరకు పసిడి ధరలు 1900 డాలర్లకు దగ్గర (కాస్త అటు ఇటు) ఆగిపోయాయి. ఇందుకు ప్రధాన కారణంగా మిగతా కరెన్సీలతో పోలిస్తే డాలర్ క్రమంగా బలపడటం. అమెరికా ఆర్థిక ప్యాకేజీ నిర్ణయంపై డైలమా కూడా బంగారంపై ప్రభావం చూపింది.

ఈరోజు (అక్టోబర్ 19) అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్ కామెక్స్‌లో పసిడి ధర 10 గ్రాములు 0.13 శాతం క్షీణించి 1903 డాలర్లు పలికింది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.50 శాతం పడిపోయి 24.282 డాలర్లు పలికింది.

నేటి బంగారం ధరలు

నేటి బంగారం ధరలు

దేశీయ ఫ్యూచర్ మార్కెట్ ఎంసీఎక్స్‌లో పసిడి ధరలు ఈ రోజు మరింతగా క్షీణించాయి. ప్రారంభ సెషన్‌లో 10 గ్రాముల పసిడి రూ.56(0.11 శాతం) క్షీణించి రూ.50,491 పలికింది. వెండి కూడా అదే బంగారం బాటలోనే నడిచింది. వెండి కిలో రూ.316 (0.51 శాతం) క్షీణించి రూ.61,360 పలికింది.

English summary

మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు: ఈ వారం పసిడి ఎలా ఉండొచ్చు? | Gold Prices Today slips to below Rs 50,500: yellow metal Weekly Forecast

Gold prices have been stuck around the $1,900 an ounce for most of October due to the strength in the U.S. dollar, but analysts expect the gold price action to pick up in the next few weeks, producing a "lasting price upswing."
Story first published: Monday, October 19, 2020, 9:45 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X