For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ తర్వాత భారీగా తగ్గిన పసిడి ధర: రూ.65వేలకు చేరుకుంటుందా, కొనుగోలుకు ఇదే మంచి సమయమా?

|

బంగారం ధరలు ఈ వారం భారీగా క్షీణించిన విషయం తెలిసిందే. ఆగస్ట్ 7వ తేదీ ఆల్ టైమ్ గరిష్ట ధరతో రూ.6,500కు పైగా, ఈ వారంలో రూ.2వేలకు పైగా క్షీణించింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో 10 గ్రాముల గోల్డ్ ఫ్యూచర్స్ నిన్న రూ.238 క్షీణించి రూ.49,666 వద్ద స్థిరపడింది. వెండి కూడా కిలో ధర 1 శాతం మేర క్షీణించి రూ.59018 పలికింది. ఇండియన్ డీలర్ల్స్ ఈ వారం కూడా డిస్కౌంట్ ఇస్తున్నారు. 5 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు. గత వారం 23 డాలర్ల మేరకు ఉండగా, ఈ వారం డిస్కౌంట్ తగ్గించారు. ప్రపంచంలో అతిపెద్ద పసిడి మార్కెట్ చైనాలో డిస్కౌంట్ 40 డాలర్ల నుండి 45 డాలర్ల మేర ఉంది. గత వారం ఇది 44 డాలర్ల నుండి 48 డాలర్ల మధ్య ఉంది.

 ఫారెక్స్ నిల్వలు సరికొత్త రికార్డ్, తగ్గిన బంగారం నిల్వలు ఫారెక్స్ నిల్వలు సరికొత్త రికార్డ్, తగ్గిన బంగారం నిల్వలు

మార్చి నుండి గరిష్ట క్షీణత

మార్చి నుండి గరిష్ట క్షీణత

కరోనా మహమ్మారి ప్రారంభమైన మార్చి నుండి పసిడి ధరలు భారీగా పెరిగాయి. ఆగస్ట్ రెండో వారం నుండి ధరలు క్షీణిస్తున్నాయి. దాదాపు ఈ రెండు నెలల్లో రూ.ఆరున్నర వేలు క్షీణించింది. చాలా రోజులుగా పసిడి ధరలు పైకి, కిందకు కదులుతున్నాయి. అయితే ఈ వారం ఏకంగా రూ.2,000కు పైగా తగ్గింది. ఇక వెండి ఏకంగా రూ.10వే వరకు తగ్గింది. ఓ వారంలో పసిడి, వెండి భారీగా తగ్గడం మార్చి నుండి ఇదే మొదటిసారి. డాలర్ బలపడటం, కరోనా రికవరీ పెరగడం వంటి వివిధ అంశాలు ఒత్తిడి తగ్గి, ధరలు క్షీణించడానికి కారణమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు ఈ వారం 4.6 శాతం మేర క్షీణించాయి. వెండి ధరలు 15 శాతం మేర తగ్గాయి.

బంగారం మరింత పెరుగుతుందా?

బంగారం మరింత పెరుగుతుందా?

బంగారం ధరలు గత కొద్ది రోజుల క్రితం వరకు పరుగులు పెట్టాయి. 2019లో ఇది దాదాపు 20శాతం పెరిగింది. 2020లో ఇప్పటికే 30శాతానికి పైగా పెరిగింది. ప్రస్తుతానికి బంగారం ధరలు క్షీణించినప్పటికీ, వ్యాక్సీన్ రాక, డాలర్, ఈక్విటీ మార్కెట్, కరోనా కేసులు, కరోనా రికవరీ వంటి అంశాలపై ఈ పసిడి ధర ఆధారపడి ఉంటుంది. ప్రధానంగా బలహీనమైన డాలర్ వ్యాల్యూతో ముడిపడి ఉంది. దీంతో దేశంలో ధరలు ఇప్పుడు కాకపోయినా మున్ముందు మరింతగా పెరిగే అవకాశాలు కొట్టి పారేయలేమని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. డాలర్ బలహీనపడితే కనుక వస్తువుల ధరలను పెంచే అవకాశాలు ఉంటాయి. అయితే ప్రస్తుతం డాలర్ బలహీనత, కరోనా, వ్యాక్సీన్ రాకపై ఈ ధర పెరుగుదల ఆధారపడి ఉంది.

రూ.65వేలకు పెరుగుతుందా?

రూ.65వేలకు పెరుగుతుందా?

వ్యాక్సీన్ వచ్చినా, బంగారం ధరలు మరింత తగ్గుతుందేమోనని, కానీ అది స్వల్పంగానే ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీర్ఘకాలంలో పెట్టుబడులు పెట్టేవారికి బంగారం కొనుగోలు చేసేందుకు ఇది సరైన సమయమని కూడా సూచిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో 1840-1860 డాలర్ల మధ్య కొనుగోలు చేయవచ్చునని చెబుతున్నారు. 2021 చివరి నాటికి మాత్రం పుత్తడి ధరలు అంతర్జాతీయ మార్కెట్లో 2,400 దాటడం కొట్టి పారేయలేమని అంటున్నారు. దేశంలో రూ.65వేలకు చేరుకోవచ్చునని చెబుతున్నారు. గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ కూడా బంగారం ధరలకు సహాయపడే స్థిరమైన డబ్బు ప్రవాహాన్ని చూస్తున్నాయని, భౌతిక బంగారానికి డిమాండ్ లేని సమయం ఇది ఉంటుందని చెబుతున్నారు. ఈటీఎఫ్‌లలోకి పెట్టుబడులు పెరిగినట్లు చెబుతున్నారు.

కొనుగోలుకు మంచి సమయమా..

కొనుగోలుకు మంచి సమయమా..

ప్రస్తుత పరిస్థితుల్లో పసిడి ధరలు 2020లో పెనుమార్పులు లేకుండా (కరోనా కేసులు, వ్యాక్సీన్) స్వల్ప హెచ్చుతగ్గులు మినహా స్థిరంగా ఉండవచ్చునని చెబుతున్నారు. ఆర్థిక కార్యకలాపాలు పుంజుకునే అవకాశాలు లేకుండే పసిడి ధర స్వల్పంగా తగ్గినా, పుంజుకునే అవకాశాలు లేవని ఆర్థిక నిపుణులు భావిస్తున్నందున క్రమంగా స్వల్ప పెరుగుదల నమోదయ్యే అవకాశాలు, హెచ్చుతగ్గులు ఉండవచ్చునని చెబుతున్నారు. బంగారం గణనీయంగా తగ్గే అవకాశాలు చాలా తక్కువ అంటున్నారు. కాబట్టి కొనుగోలుకు ఇదే మంచి సమయం అని చెబుతున్నారు.

English summary

ఆ తర్వాత భారీగా తగ్గిన పసిడి ధర: రూ.65వేలకు చేరుకుంటుందా, కొనుగోలుకు ఇదే మంచి సమయమా? | Gold prices today: May continue to fall, This is worst weeks since March

Gold and silver posted their biggest weekly losses since March, when the global onset of the coronavirus pandemic panicked markets. The dollar gained as concern over the outlook for global economic growth bolstered the appeal of the currency as a haven, sapping demand for gold. Fears are mounting that rising coronavirus cases, particularly in Europe, may lead to more national lockdowns, denting the outlook for recovery. Gold fell 4.6% this week, while silver slumped 15%.
Story first published: Saturday, September 26, 2020, 20:51 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X