ఇప్పుడు బంగారం కొనుగోలు చేయవచ్చా, ధర ఎలా ఉండవచ్చు?
వరుసగా ఆరు రోజుల పాటు పెరిగిన బంగారం ధరలు నేడు (జూలై 8 గురువారం) క్షీణించాయి. రెండు రోజుల క్రితం రూ.48,000 క్రాస్ చేసిన పసిడి ధరలు నేడు రూ.47,800 దిగువన ట్రేడ్ అయ్యాయి. వెండి ధరలు రూ.69,000 దిగువకు వచ్చాయి. యూఎస్ ట్రెజరీ యీల్డ్స్ క్షీణించడం, కరోనా కొత్త కేసులు వివిధ దేశాల్లో పెరగడం వంటి కారణాలు పసిడిపై ఒత్తిడిని పెంచాయి. ఇటీవలి వరకు తగ్గిన బంగారం ధరలపై డెల్టా వేరియంట్ ప్రభావం పడింది. దీంతో బంగారం ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. గోల్డ్ ఫ్యూచర్స్ ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో రూ.8500 తక్కువగా ఉంది.

బంగారం ధరలు ఈ స్థాయిలోకి...
ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ సోమవారం రూ.47,300 వద్ద, మంగళవారం రూ.47,685 వద్ద, బుధవారం రూ.47,850కి పైన ట్రేడ్ అయింది. ఓ సమయంలో రూ.48,000ను టచ్ చేసింది. నిన్నటి క్లోజింగ్ కంటే నేడు రూ.170 తగ్గి, రూ.47,739 వద్ద ట్రేడ్ అయింది. ఓ సమయంలో రూ.47,600 స్థాయికి పడిపోయింది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.114.00 తగ్గి రూ.48030.00 వద్ద ట్రేడ్ అయింది.
అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 1800 డాలర్ల దిగువనే ఉంది. ఈ వారం పసిడి 1820 డాలర్ల నుండి 1748 డాలర్ల మధ్య ముగిసే అవకాశాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఏదేమైనా 1745 డాలర్ల దిగువన ముగిసే అవకాశాలు కూడా కొట్టి పారేయలేని పరిస్థితి అంటున్నారు.

సిల్వర్ ఫ్యూచర్స్
సిల్వర్ ఫ్యూచర్స్ సెప్టెంబర్ రూ.425.00 క్షీణించి రూ.68940.00 వద్ద ట్రేడ్ అవుతోంది. రూ.69,200.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.69,696.00 వద్ద గరిష్టాన్ని, రూ.68,646.00 వద్ద కనిష్టాన్ని తాకింది. డిసెంబర్ ఫ్యూచర్స్ రూ.356.00 క్షీణించి రూ.70300.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.70,326.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.71,000.00 వద్ద గరిష్టాన్ని, రూ.69,995.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

26 డాలర్ల దిగువకు సిల్వర్
అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేటి సాయంత్రం సెషన్లో 3.95
(0.22%) డాలర్లు క్షీణించి 1798.15 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.137 (0.52%) రూ.డాలర్లు క్షీణించి 25.992 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గోల్డ్ 1800 డాలర్ల దిగువనే ఉండగా, సిల్వర్ 26 డాలర్ల దిగువకు వచ్చింది.


Click it and Unblock the Notifications