బంగారం, వెండి ధరలు సోమవారం (డిసెంబర్ 27) దాదాపు స్థిరంగా ఉన్నాయి. అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్ కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్ అతి స్వల్పంగా తగ్గగా, దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌లో (MCX)లో కాస్త పెరిగాయి. అయితే అంతర్జాతీయంగా క్షీణిస్తుండటంతో ఈ ప్రభావం పడింది. దీంతో ఉదయం ప్రారంభంలో రూ.100కు పైగా ఎగిసిన పసిడి గం.10.45 సమయానికి రూ.20 పెరుగుదలకు పరిమితమైంది. గత వారం పసిడి ధరలు స్వల్పంగా క్షీణించాయి. ఆల్ టైమ్ గరిష్టంతో పసిడి ధరలు అంతర్జాతీయ మార్కెట్లో అయితే 262 డాలర్లు తక్కువగా ఉంది. ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో రూ.8000 తక్కువగా ఉంది.

బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.21 లాభపడి రూ.48,140 వద్ద, ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.103 ఎగిసి రూ.48,209 వద్ద ట్రేడ్ అయింది. కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 1.50 డాలర్లు క్షీణించి 1810 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. వెండి ధరలు రూ.62,000 స్థాయికి దిగి వచ్చాయి.
మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.282 తగ్గి రూ.62,016 వద్ద, మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.225 క్షీణించి రూ.62,700 వద్ద ట్రేడ్ అయింది. కామెక్స్‌లో సిల్వర్ ఫ్యూచర్స్ 0.132 డాలర్లు క్షీణించి 22.808 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఏడాదిలో పసిడి ధర 4.65శాతం మేర క్షీణించగా, వెండి 12.22శాతం తగ్గింది.

ఈ వారం అనిశ్చితి
బంగారం, వెండి ధరలు ఈ వారం అనిశ్చితితో కదలాడవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో పైకి, కిందకు కదలాడవచ్చునని చెబుతున్నారు. కామెక్స్‌లో పసిడి 1830 డాలర్లకు చేరుకోవచ్చునని, అలాగే, సిల్వర్ ఫ్యూచర్ 23.50 డాలర్లకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
1800 డాలర్ల నుండి 1785 డాలర్ల మధ్య మద్దతు ధర, 1822 డాలర్ల నుండి 1835 డాలర్ల మధ్య నిరోధకస్థాయి. వెండి మద్దతు ధర 22.70 డాలర్ల నుండి 22.44 డాలర్లు. నిరోధకస్థాయి 23.10 డాలర్ల నుండి 23.40 డాలర్లు.
ఇక ఎంసీఎక్స్‌లో బంగారం మద్దతు ధర రూ.47,950 నుండి రూ.47,800. నిరోధకస్థాయి రూ.48,350 నుండి రూ.48,500. వెండి మద్దతు ధర రూ.61,900 నుండి రూ.61,500. నిరోధకస్థాయి రూ.62,670 నుండి రూ.63,100.

ఏ స్థాయిలో కొనుగోలు చేయవచ్చు?
స్వల్ప కాలానికి గాను బంగారాన్ని డిప్‌లో కొనుగోలు చేయవచ్చునని, రూ.48,000 స్థాయిలో కొనుగోలు చేయవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. రూ.47,750 స్టాప్ లాస్ పెట్టుకొని, రూ.48,400 టార్గెట్‌తో కొనుగోలు చేయవచ్చునని చెబుతున్నారు.వెండి రూ.61,500 స్టాప్ లాస్‌తో, రూ.62,800 వద్ద టార్గెట్‌తో రూ.61,900 స్థాయిలో కొనుగోలు చేయవచ్చునని చెబుతున్నారు.
More From GoodReturns

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 2, గురువారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..



Click it and Unblock the Notifications