కరోనా మహమ్మారి, అంతర్జాతీయ మార్కెట్లలో గందరగోళం, అమెరికా - చైనా ఇష్యూ, ఆర్థిక ప్యాకేజీ వంటి వివిధ కారణాలతో గత కొద్ది రోజులుగా బంగారం స్థిరంగా ఉండటం లేదు. ఈ వారం కూడా బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. బంగారం ఆగస్ట్ కాంట్రాక్ట్ ఈ వారం రూ.46,175 కంటే కిందకు రాకుంటే కొనుగోళ్లకు మొగ్గు చూపవచ్చునని సూచిస్తున్నారు. రూ.48,100 నుండి రూ.48,889 లక్ష్యంతో లాంగ్ పొజిషన్లో కొనుగోలు చేయవచ్చునని సూచిస్తున్నారు.

6 నెలల్లో 20 శాతం పెరుగుదల
కరోనా సహా వివిధ కారణాలతో బంగారం ధర స్వల్పకాలంలో ఎగుడుదిగుడులు చూసినప్పటికీ దీర్ఘకాలంలో మాత్రం మంచి పెట్టుబడిగా భావిస్తున్నారు. మందగమనం కారణంగా 2019 చివరి ఆరునెలల్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఇప్పుడు కరోనా కారణంగా పెరుగుతున్నాయి. గత ఆరు నెలల కాలంలో అంటే ఈ క్యాలెండర్ ఇయర్‌లో బంగారం ధరలు దాదాపు 20 శాతం పెరిగాయి. మందగమనం, కరోనా, బలమైన పెట్టుబడులతో ధరలు పెరిగాయి.

రూ.47,000కు పైన సెటిల్
శుక్రవారం నాడు ఎంసీఎక్స్‌లో బంగారం ధరలు 10 గ్రాములకూ రూ.47,355 వద్ద సెటిల్ అయింది. వెండి కిలో ధర రూ.47,741 పలికింది. గత నెలలో బంగారం ధర 10 గ్రాములకు రూ.48,000తో రికార్డ్ హైకి చేరుకున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధరలు 2 శాతం పెరిగి ఔన్స్ 1,730.19గా పలికింది.

బంగారం ధర మరింత జూమ్
ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం ధర మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, మాంద్యంలోకి జారుకుంటున్న పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు, ఈక్విటీల్లో ఆటుపోట్లు వంటి పరిస్థితుల్లో పసిడి తిరిగి తన చారిత్రమాత్మక గరిష్టస్థాయి ఔన్స్ ధర 1900 డాలర్లకు చేరుకోవచ్చునని అంటున్నారు. కరోనా కట్టడి అంతగా లేకున్నా, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు ఇలాగే కొనసాగుతే ఈ డాది డిసెంబర్ నాటికి 1900 డాలర్లకు చేరుకోవచ్చునని భావిస్తున్నారు.

రూ.50,000 మార్క్‌కు
ఈ క్యాలెండర్ ఏడాదిలో ప్రపంచ ఆర్థికవృద్ధి మైనస్ 5 శాతానికి పడిపోతుందని అంచనాలు వేస్తున్నారు. అగ్రరాజ్యాల ఆర్థిక వ్యవస్థలతో వర్థమాన దేశాల ఆర్థిక వ్యవస్థలు క్షీణతను నమోదు చేస్తాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం యూఎస్ సెంట్రల్ బ్యాంకు ఫెడ్ వడ్డీ రేటు నెగిటివ్‌లోకి వెళ్తే బంగారం తొమ్మిదేళ్ల గరిష్టం (2011 ఆగస్ట్) 1920 డాలర్లకు చేరుకోవచ్చునని భావిస్తున్నారు. గత కొద్ది కాలంగా బంగారం 1789 గరిష్టస్థాయిని తాకి, శుక్రవారం 1752 డాలర్ల వద్ద ముగిసింది. ఇప్పటికే రూ.48,000కు చేరువలో ఉన్న బంగారం ఇదే పరిస్థితి కొనసాగితే దీపావళి లేదా ఈ క్యాలెండర్ ఇయర్ చివరి నాటికి రూ.50,000కు చేరుకోవచ్చునని భావిస్తున్నారు.
More From GoodReturns

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications