బంగారం ధరలు నేడు(సోమవారం, జనవరి 3) ప్రారంభ సెషన్‌లో స్థిరంగా లేదా అతి స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.19 క్షీణించి రూ.48,080 వద్ద, ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.13 తగ్గి రూ.48,150 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 1825 డాలర్ల స్థాయికి దిగి వచ్చింది. నేటి సెషన్‌లో 3.25 డాలర్లు లేదా 0.18 శాతం క్షీణించి 1825 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా తగ్గింది. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.270 క్షీణించి రూ.62,390 వద్ద, మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.200 తగ్గి రూ.63,080 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో సిల్వర్ ఫ్యూచర్స్ 0.189 క్షీణించి 23.163 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

అందుకే స్థిరంగా ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో ఏడాదిలో వెండి ధర 3.66 శాతం క్షీణించగా, వెండి ధరలు 12.05 శాతం తగ్గాయి. గోల్డ్ ఫ్యూచర్ నేటి సెషన్‌లో 1,825.05 - 1,832.80 డాలర్ల మధ్య, సిల్వర్ ఫ్యూచర్స్ 23.172 - 23.435 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది.
అమెరికా ట్రెజరీ యీల్డ్స్ పెరిగాయి. ఈ ప్రభావం పసిడి పైన కనిపించింది. అదే సమయంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న ప్రభావం కూడా సురక్షిత పెట్టుబడిగా భావించే పసిడి కొనుగోళ్లకు మొగ్గు చూపింది. ఈ రెండింటి ఒత్తిడి మధ్య దాదాపు స్థిరంగా ఉంది.

కొనుగోలు ఏ స్థాయిలో
షేర్ ఇండియా బులియన్ మార్కెట్ నిపుణులు రవి సింగ్ ప్రకారం గోల్డ్ ఫ్యూచర్స్ బై-జోన్ రూ.48,200. టార్గెట్ ధర రూ.48,500. సెల్ జోన్ రూ.47,900. టార్గెట్ ధర రూ.47,600. గంగానగర్ కమోడిటీ లిమిటెడ్ ప్రతినిధి అమిత్ ప్రకారం ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ మద్దతు ధర రూ.47,900 నుండి రూ.47,700. నిరోధకస్థాయి రూ.48,200 నుండి రూ.48,350. వెండి మద్దతు ధర రూ.62,200 నుండి రూ.61,800. నిరోధకస్థాయి రూ.62,800 నుండి రూ.63,200.

తగ్గినా మంచి రిటర్న్స్..
బంగారం ధర కొత్త క్యాలెండర్ ఏడాది(2022)లో 1800 డాలర్లకు పైనే ముగిసింది. 2021లో పసిడి దాదాపు 4 శాతం మేర క్షీణించింది. గత ఏడాదిని రూ.50,000కు పైన ప్రారంభించి రూ.48,000 స్థాయిలో ముగించింది. అయితే 2022లో బంగారం భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణుల అంచనా. మొదటి అర్ధ సంవత్సరంలో రూ.47,000 దిగువకు వచ్చినప్పటికీ రెండో అర్ధ సంవత్సరంలో రూ.55,000 స్థాయికి చేరుకోవచ్చునని అంచనా. గోల్డ్ ఇన్వెస్టర్లకు 2021 కంటే 2022 బాగుంటుందని బులియన్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. 2015-2019 మధ్య యూఎస్ ఫెడ్ రేట్లు 9 సార్లు పెరగగా, బంగారం 35 శాతం రిటర్న్స్ ఇచ్చింది. 2004 నుండి 2015 మధ్య ఫెడ్ రేట్లు 17 సార్లు పెరగగా, బంగారం 70 శాతం రిటర్న్స్ ఇచ్చింది. వీటిని పరిగణలోకి తీసుకుంటే మొదటి అర్ధ సంవత్సరంలో బంగారం దిద్దుబాటుకు గురయినప్పటికీ రెండో అర్ధ సంవత్సరంలో 2000 డాలర్లకు చేరుకోవచ్చునని అంటున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 2, గురువారం ధరలు ఇవే..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!



Click it and Unblock the Notifications